
మాట్లాడుతున్న కలెక్టర్
వికారాబాద్ అర్బన్: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే జిల్లాలో అటెండెన్స్ యాప్‌ను ప్రవేశపెట్టామని, ఇందులో అధికారులు, ఉద్యోగులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ఎంతమాత్రం లేదని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన చాంబర్ నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులందరూ రెగ్యులర్‌గా విధులు నిర్వహించి ప్రజలకు సత్వర సేవలు అందిస్తే జిల్లాను ఉన్నత స్థానంలో నిలిపే అవకాశం ఉంటుందన్నారు. టాప్– 5 సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. సోమవారం నుంచి వందశాతం మంది అటెండెన్స్ యాప్ ద్వారా హాజరు వేయాలని కోరారు. ఇరవై రోజులుగా ఈ విషయమై ప్రత్యేక దృష్టిసారించినప్పటికీ ఇంకా కొన్ని శాఖల సిబ్బంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోలేదని, ఇది క్రమశిక్షణా రాహిత్యం కిందకు వస్తుందని హెచ్చరించారు. పలువురు అధికారులు స్పందిస్తూ షిప్టింగ్ డ్యూటీలు, ఇతర టెక్నికల్ సమస్యల కారణంగా యాప్ డౌన్‌లోడ్ చేసుకోలేదని కలెక్టర్‌కు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment