
నర్సరీలో ఎండిన మొక్కలను తొలగించి కొత్త మొక్కలు నాటుతున్న ఏపీఓ దస్తయ్య, సిబ్బంది
దోమ: కొత్త కలెక్టర్‌గా నారాయణరెడ్డి విధుల్లో చేరిన రోజునుంచి అధికారుల పనితీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గ్రామాలు, మున్సిపాలిటీల్లో చేప డుతున్న పనులను శుక్రవారం ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ నారాయణరెడ్డి గురువారం దోమ మండలంలో పర్యటించిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా అప్రమత్తమై యంత్రాంగం విధుల్లో చురుగ్గా పాల్గొంటోంది. ప్రజా సమస్యల పరిష్కారంపై కిందిస్థాయి సిబ్బంది సైతం దృష్టిసారించారు.
పనుల పురోగతికి ప్రత్యేక చర్యలు
దోమ మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఓ పర్యటించారు. పల్లెల్లో చేపట్టాల్సిన పనులపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లతో సమీక్ష నిర్వహించారు. అర్ధంతరంగా ఆగిపోయిన పనుల వివరాలు సేకరించడంతో పాటు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దోర్నాల్‌పల్లిని సందర్శించిన కలెక్టర్ నర్సరీ నిర్వహణ, పల్లె ప్రకృతి వనంపై అసహనం వ్యక్తంచేయడంతో అధికారులు పనులు చేపట్టారు. నర్సరీలో ఎండిన మొక్కలను తొలగించి నూతన మొక్కలు నాటించారు. పల్లె ప్రకృతి వనంలో ఉన్న మొక్కలకు నీరందించి, కొత్త మొక్కలు నాటారు. ప్రజల సౌకర్యార్థం బెంచీలు, కుర్చీలు, రోడ్లు వేయాలని ఆదేశించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఐనాపూర్, మోత్కుర్, దోమ, పాలేపల్లి, దిర్సంపల్లి, మల్లేపల్లి తదితర గ్రామాలను సందర్శించి నర్సరీ, పల్లె ప్రకృతివనం,డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక పనులను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. నర్సరీ నిర్వహణను అశ్రద్ధ చేయొద్దని సిబ్బందిని ఆదేశించారు. పల్లె ప్రకృతి వనాలను పార్కుల్లా సుందరీకరించాలన్నారు.

Comments
Please login to add a commentAdd a comment