
మాట్లాడుతున్న మాజీ మంత్రి చంద్రశేఖర్
బంట్వారం: రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారమని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం బంట్వారం, కోట్‌పల్లి మండలాల్లోని బస్వాపూర్, తొర్మామిడి, సల్బత్తాపూర్, రాంపూర్ గ్రామాల్లో శక్తి కేంద్ర కార్నర్ సమావేశాలునిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అస్సెంబ్లీ పాలక్, సినీ నటి జీవితతో కలిసి మాట్లాడారు. బూత్ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
కష్టపడిన వారికి భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. యువత చేతిలోనే దేశ భవిత ఉందన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలనకు చరమగీతం పాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. వికారాబాద్ గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాండుగౌడ్, సీనియర్ నాయకులు బసిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment