
కుల్కచర్ల: విద్యార్థుల సౌకర్యార్థం సాక్షి దినపత్రిక అందిస్తున్న పదో తరగతి మోడల్ టెస్ట్ పేపర్స్ ఎంతో ఉపయోగకరమని కుల్కచర్ల కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాల ప్రత్యేకాధికారి దేవి అన్నారు. శుక్రవారం పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులకు మోడల్ ప్రశ్న పత్రాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల సౌకర్యార్థం సాక్షి దినపత్రిక ఇట్టి కార్యక్రమాన్ని చేపట్టడం ఉపయోగకరమన్నారు.
గ్రామ పంచాయతీలకు కేంద్ర నిధులు ఇవ్వాలి
బీఆర్‌ఎస్ కార్మిక విభాగం జిల్లా గౌరవాధ్యక్షుడు కృష్ణయ్య
కొడంగల్ రూరల్: గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన బకాయి నిధులను వెంటనే విడుదల చేయాలని బీఆర్‌ఎస్ కార్మిక విభాగం జిల్లా గౌరవ అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. త్వరలో బీఆర్‌ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో పంచాయతీ ఉద్యోగులకు పెండింగ్ జీతాలు చెల్లించేలా ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు.
టీచర్‌పై ఫిర్యాదు
వికారాబాద్ అర్బన్: పట్టణంలోని భృంగీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో నాలుగో తరగతి విద్యార్థులను సైన్స్ టీచర్ చితకబాదినట్లు పిల్లల తల్లిదండ్రులు వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పిల్లలపై టీచర్ ఇష్టానుసారంగా కొట్టినట్లు వాపోయారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పవద్దని పాఠశాల ప్రిన్సిపాల్, యాజమాన్యం పిల్లలను బయపెట్టినట్లు తెలిపారు. వేల రూపాయల ఫీజు తీసుకుంటున్న పాఠశాల యాజమన్యాం పిల్లల రక్షణపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత టీచర్‌పై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.
స్వర్ణ రుద్రాక్ష మాల బహూకరణ
షాద్‌నగర్ టౌన్: పట్టణంలోని శివమారుతీ ఆలయంలో కొలువుదీరిన అయ్యప్ప స్వామికి శుక్రవారం పట్టణంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన మంజుల, ప్రతాప్‌కుమార్ దంపతులు స్వర్ణ రుద్రాక్ష మాలను బహూకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు సంతోష్, సునీల్, ఆలయ కమిటీ అధ్యక్షుడు గోలెపు చంద్రమౌళి, బసప్ప, విశ్వం, రాఘవేందర్, చింటు, ప్రవీణ్, ముత్యాలు, రాజావరప్రసాద్, హర్షవర్ధన్ గౌడ్, శశికుమార్, శ్యాం, శ్రీకాంత్, చరణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

పదో తరగతి విద్యార్థులకు సాక్షి టెస్ట్ పేపర్స్ అందజేస్తున్న ప్రత్యేకాధికారి దేవి
Comments
Please login to add a commentAdd a comment