
పశువులకు చికిత్స చేస్తున్న సిబ్బంది
వికారాబాద్ అర్బన్: కళాశాల, వసతిగృహాల్లో చదువుతున్న వంద మంది విద్యార్థులకు పర్వతారోహణలో శిక్షణ ఇచ్చేందుకు శుక్రవారం భువనగిరి ఖిల్లాకు పంపించామని జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఉపేందర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మూడు బస్సుల్లో విద్యార్థులను తరలించినట్లు తెలిపారు. పర్వతారోహణలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు శిక్షణ ఇప్పించి, వారి నైపుణ్యం ఆధారంగా ప్రోత్సహిస్తామని చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజీ, భీమ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
వాహనాల పన్నుచెల్లించండి
వికారాబాద్ అర్బన్: జిల్లాలోని వాహనదారు లు సకాలంలో పన్ను చెల్లించాలని జిల్లా రవా ణా శాఖ అధికారి శుక్రవారం వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 4,769 వాహనాలు పన్ను చెల్లించకుండా తిరుగుతున్న ట్లు పేర్కొన్నారు. పట్టుబడితే అపరాధ రుసుముతో మొత్తం రూ.300 చెల్లించాల్సి వస్తుందని స్పష్టంచేశారు. జిల్లాలో సుమారు రూ.3, 50,23,190 పన్ను బకాయి ఉన్నట్లు తెలిపారు. పెద్దఎత్తున బకాయిలు పేరుకుపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశం మేరకు తనిఖీలు చేపడుతూ వాహన పన్ను వసూలు చేస్తున్నట్లు చెప్పారు.
వాహనాల వేలం పూర్తి
వికారాబాద్ అర్బన్: వదిలివేయబడిన, క్లెయి మ్ చేయలేని వాహనాలను వేలం వేశామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఈ బహిరంగ వేలానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. బహిరంగ వేలంలో 11 త్రిచక్ర వాహనాలు, 18 ద్విచక్ర వాహనాలను వేలం వేశామన్నారు. వేలంలో పొందిన వాహనాలను ఉపయోగించకూడదని, డీమాలిష్ చేసి తీసుకెళ్లాలని తెలిపారు.
పాతూరులో
పశువైద్య శిబిరం
వికారాబాద్ అర్బన్: పాడి పశువుల్లో గర్భకోశ వ్యాధులు రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తాయని పశుసంవర్ధక శాఖ ప్రాంతీయ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పూర్ణచందర్‌రావు తెలిపారు. పాతూరులో శుక్రవారం పశువైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ టి.ఉష ఆధ్వర్యంలో సుమారు వంద మూగజీవాలకు చికిత్సలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు.
కాంగ్రెస్ ప్లీనరీకి యూసుఫ్‌కు ఆహ్వానం
కొడంగల్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్ జిల్లాలో నిర్వహించను న్న కాంగ్రెస్ పార్టీ ప్లీన రీ సమావేశానికి రావా లని కొడంగల్‌కు చెందిన పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసుఫ్‌కు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఆయనకు ఫోన్ చేశారు.పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి యూసుఫ్ ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందారు.కొడంగల్‌లో మైనార్టీ నేతగా ఎదిగారు. ఈ మేరకు కాంగ్రెస్, మైనార్టీ నాయ కులు యూసుఫ్‌కు అభినందనలు తెలిపారు.
గొర్రెలమందపైవీధికుక్కల దాడి30 గొర్రెపిల్లల మృతి
ఆమనగల్లు: పోలెపల్లిలో శుక్రవారం సాయంత్రం గొర్రెల మందపై వీధికుక్కలు దాడిచేశాయి. ఈ ఘటనలో 30 గొర్రెపిల్లలు మృత్యువాతపడ్డాయి. రైతు ఎట్టయ్యయాదవ్ తన పొలం వద్ద గొర్రెలను ఉంచగా అదే సమయంలో కుక్కలు దాడిచేశాయి. మందలో ఉన్న 30 గొర్రెపిల్లలు మృతి చెందాయి.

బస్సులో భువనగిరికి వెళ్తున్న విద్యార్థులు

వాహనాలను వేలం వేయిస్తున్న ఎస్పీ కోటిరెడ్డి

Comments
Please login to add a commentAdd a comment