
తాండూరు టౌన్: తాండూరు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలను ఆదివారం నిర్వహించనున్నారు. పట్టణంలోని వైట్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో ఉదయం 10నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. సాయంత్రం 6గంటల లోపు ఫలితాలు వెల్లడిస్తారు. 2023– 25 సంవత్సరానికి గాను విడుదలైన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ ప్రక్రియ గురువారం ముగిసింది. కేవలం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు. శుక్రవారం ఉప సంహరణ గడువు ఉండగా ఎవరూ తమ నామినేషన్‌ను వెనక్కి తీసుకోలేదు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. అబ్దుల్ గని, చిక్కాల శ్రీనివాస్ తుది పోరులో నిలిచారు. గనికి టైరు గుర్తు, శ్రీనివాస్‌కు పాన గుర్తును కేటాయించారు. అసోసియేషన్‌లో గుర్తింపు పొందిన 261 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సభ్యులందరూ తప్పకుండా అసోసియేషన్ జారీ చేసిన గుర్తింపు కార్డుతో రావాలని, ఎన్నికల నిబంధనలు పాటించని వారిని ఓటు వేసేందుకు అనర్హులుగా ప్రకటిస్తామని ఎన్నికల అధికారి, బీఆర్‌ఎస్ కార్మిక విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు అడ్వకేట్ గోపాల్ తెలిపారు. తమను గెలిపిస్తే లారీ ఓనర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అభ్యర్థులిద్దరూ సభ్యులను కోరారు.


Comments
Please login to add a commentAdd a comment