తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు | 15 IAS Officers Transferred In Telangana Know Full Details | Sakshi
Sakshi News home page

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. ఏకంగా 15 మందికి కొత్త పోస్టింగ్‌లు

Published Tue, Jan 31 2023 7:51 PM | Last Updated on Tue, Jan 31 2023 8:31 PM

15 IAS Officers Transferred In Telangana Know Full Details - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఈమేరకు 15 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

► ప్రస్తుతం  మంచిర్యాల జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న భారతీ హోలికెరి.. మహిళా శిశు సంక్షేమ వాఖ స్పెషల్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
► ప్రస్తుత హన్మకొండ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు.. నిజామాబాద్‌ కలెక్టర్‌గా బదిలీ.
► ప్రస్తుత ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌.. హన్మకొండ జిల్లా కలెక్టర్‌గా బదిలీ.
► ప్రస్తుత రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌  అమోయ్‌ కుమార్‌ మేడ్చల్‌ కలెక్టర్‌గా బదిలీ. అలాగే హైదరాబాద్‌ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు
► ప్రస్తుత వనపర్తి జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాషా..  కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ కలెక్టర్‌గా బదిలీ.
► ప్రస్తుత జగిత్యాల జిల్లా కలెక్టర్‌ జీ రవి.. మహబూబ్‌నగర్‌ కలెకర్ట్‌గా బదిలీ.
► ప్రస్తుత మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు.. సూర్యాపేట కలెక్టర్‌గా బదిలీ.
► ప్రస్తుత మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌ హరీష్‌.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బదిలీ.
► జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ బి సంతోష్‌.. మంచిర్యాల కలెక్టర్‌గా బదిలీ.
► ప్రస్తుత సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ రాజార్షి షా.. మెదక్‌​ జిల్లా కలెక్టర్‌గా బదిలీ.
► ప్రస్తుత నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి.. వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా బదిలీ.
► ప్రస్తుత కరీంనగర్‌ కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌కు జగిత్యాల ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు.
► ఐటీడీఏ ఉట్నూర్‌ ప్రాజెక్ట్‌ అధికారి వరుణ్‌ రెడ్డి.. నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌గా బదిలీ
► ప్రస్తుత కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌.. ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా బదిలీ
► ప్రస్తుత మహబూబ్‌ నగర్‌ అదనపు కలెక్టర్‌ తేజాస్‌ నందలాల్‌ పవార్‌.. వనపర్తి కలెక్టర్‌గా బదిలీ

కలెక్టర్ల బదిలీ పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement