Collectors transfers
-
ఏపీలో భారీగా కలెక్టర్ల బదిలీ
-
20 మంది ఐఏఎస్, ఐపీఎస్, నాన్ కేడర్ ఎస్పీలపై ఈసీ వేటు..
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభ ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై 20 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నాన్ కేడర్ ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో రాష్ట్ర పరిపాలనపై దఖలుపడిన అధికారం మేరకు ఈ చర్య తీసుకుంది. హైదరాబాద్ సీపీ సహా ముగ్గురు పోలీసు కమిషనర్లు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, 10 జిల్లాల ఎస్పీలు, ఓ శాఖ కార్యదర్శి, మరో శాఖ డైరెక్టర్, ఇంకో శాఖ కమిషనర్లపై బదిలీ వేటు వేసింది. వీరిలో 18 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నాన్ కేడర్ ఎస్పీలకు శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదని ఆంక్షలు విధించింది. బదిలీ అయిన అధికారులు సత్వరమే బాధ్యతల నుంచి తప్పుకొని తమ తర్వాతి స్థానంలో ఉన్న అధికారికి బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కూడా వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, దేవాదాయ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతల నుంచి తక్షణమే వైదొలగాలని ఆదేశించింది. ఈ మూడు శాఖలకు కొత్త ముఖ్య కార్యదర్శులతోపాటు బదిలీ వేటుపడిన 20 మంది అధికారుల స్థానంలో గురువారం సాయంత్రం 5 గంటల్లోగా కొత్త అధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక్కో పోస్టుకు ముగ్గురు ఐఏఎస్/ఐపీఎస్ అధికారుల పేర్లను ప్రతిపాదించాలని.. వారికి సంబంధించిన గత ఐదేళ్ల వార్షిక పనితీరు మదింపు నివేదిక (ఏపీఏఆర్)లు, విజిలెన్స్ క్లియరెన్స్‌లను సైతం జత చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి ఎస్.బీ జోషి గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ రాశారు. దీనితో బదిలీ అయిన వారు తక్షణమే ఆయా పోస్టులకు వెళ్లాలని సీఎస్ బుధవారం రాత్రి ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర పర్యటనకు వచ్చి కేంద్ర ఎన్నికల సంఘం బృందానికి వివిధ రాజకీయ పార్టీల నుంచి అందిన ఫిర్యాదులు, నిబంధనల అతిక్రమణ, తమ దృష్టికి వచ్చిన ఇతర అంశాల ఆధారంగానే పెద్ద సంఖ్యలో అధికారులపై చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. పెద్ద ఎత్తున ఫిర్యాదుల నేపథ్యంలో చర్యలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌లతో కూడిన బృందం ఈనెల 3 నుంచి 5 వరకు రాష్ట్రంలో పర్యటించింది. ఎన్నికల సన్నద్ధతపై విస్తృతంగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించింది. ఈ క్రమంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమైంది. ఈ సమయంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వ్యవహార శైలిపై ప్రతిపక్షాల ప్రతినిధులు ఈసీ బృందానికి పలు ఆధారాలతో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఎన్నికలకు ముందు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే అధికారులను జిల్లా కలెక్టర్లుగా, ఎస్పీలుగా బదిలీ చేశారని, నిష్పక్షపాతంగా వ్యవహరించే యువ అధికారులను పక్కనపెట్టారని పేర్కొన్నట్టు సమాచారం. దీనికితోడు ఈ అధికారులు క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలను బదిలీ చేసిన విషయం కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. గతంలో ఎన్నికల నిర్వహణను ఎత్తిచూపుతూ.. కేంద్ర, రాష్ట్రాల ఎన్ఫోర్స్మెంట్ విభాగాల ఉన్నతాధికారులు, డీజీపీ, సీఎస్, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో నిర్వహించిన సమావేశాల సందర్భంగా గతంలో నిర్వహించిన ఎన్నికల తీరుపై సీఈసీ బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికలతోపాటు తర్వాత జరిగిన హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బు, మద్యం, బంగారం, ఇతర కానుకలు పంపిణీ చేసినట్టు ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నాయని గుర్తు చేసినట్టు తెలిసింది. తెలంగాణతోపాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ఓటర్లను అత్యధికంగా ప్రలోభాలకు గురిచేస్తున్నట్టు తమకు సమాచారం ఉందని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇంత జరుగుతున్నా ఎన్నికల సమయంలో జప్తు చేస్తున్న డబ్బు, మద్యం, మాదకద్రవ్యాలు, బంగారం, వెండి, ఇతర కానుకలు నామమాత్రంగానే ఉన్నాయని పేర్కొన్నట్టు తెలిసింది. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికలు నిర్వహించిన తీరుపై పదేపదే ఆక్షేపణలు తెలిపినట్టు సమాచారం. మరోవైపు డ్రగ్స్, లిక్కర్ మాఫియాపై చర్యలు తీసుకోవడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మహారాష్ట్ర, గుజరాత్‌లలో పెద్ద మొత్తంలో దొరికి డ్రగ్స్ రాష్ట్రం నుంచే తరలివెళ్లినట్టు నివేదికలు ఉన్నాయని.. డ్రగ్స్ మాఫియాతో చేతులు కలిపారా? అని వ్యాఖ్యానించినట్టు సమాచారం. రవాణా శాఖ కార్యదర్శి అధికార పార్టీ సభలకు వాహనాల కేటాయింపులో సహకరించినట్టు వచ్చిన ఆరోపణలతో ఆయనను తొలగించినట్టు తెలిసింది. వివిధ జిల్లాల్లో ఎస్పీలు ప్రతిపక్షాల సభలు, సమావేశాలకు అనుమతులు నిరాకరించడం, నిబంధనలను ఉల్లంఘించడం తదితర ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని వేటు వేసినట్టు సమాచారం. మరో నాలుగు రాష్ట్రాల్లోనూ బదిలీలు.. తెలంగాణతోపాటు శాసనసభ సాధారణ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో వేటుపడిన వారిలో 9 మంది కలెక్టర్లతోపాటు పలువురు పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు ఉన్నారు. అధికార వర్గాల్లో ప్రకంపనలు రాష్ట్రంలో విస్తృతంగా సమీక్షలు జరిపి వెళ్లిన వారంలోనే కేంద్ర ఎన్నికల సంఘం 20 మంది అధికారులపై బదిలీ వేటు వేయడం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బదిలీ చేసిన అధికారులను ఇంకా ఎలాంటి ఇతర పోస్టుల్లో ఇంకా నియమించలేదు. అయితే బదిలీ అయిన 10 మంది జిల్లా ఎస్పీల్లో 9 నాన్ కేడర్ ఎస్పీలే (ఐఏఎస్ కాకుండా ఎస్సై, సీఐ వంటి పోస్టుల నుంచి సీనియారిటీతో ఎస్పీగా నియామకమైనవారే) కావడం గమనార్హం. సాధారణంగా జిల్లా ఎన్నికల అధికారులుగా కలెక్టర్లే వ్యవహరిస్తారు. ఇలాంటిది నాలుగు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయడం, వారికి ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని ఈసీ ఆదేశించడం గమనార్హం. -
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఈమేరకు 15 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ► ప్రస్తుతం మంచిర్యాల జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న భారతీ హోలికెరి.. మహిళా శిశు సంక్షేమ వాఖ స్పెషల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ► ప్రస్తుత హన్మకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు.. నిజామాబాద్ కలెక్టర్‌గా బదిలీ. ► ప్రస్తుత ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్.. హన్మకొండ జిల్లా కలెక్టర్‌గా బదిలీ. ► ప్రస్తుత రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మేడ్చల్ కలెక్టర్‌గా బదిలీ. అలాగే హైదరాబాద్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు ► ప్రస్తుత వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా.. కొమురం భీమ్ ఆసిఫాబాద్ కలెక్టర్‌గా బదిలీ. ► ప్రస్తుత జగిత్యాల జిల్లా కలెక్టర్ జీ రవి.. మహబూబ్‌నగర్ కలెకర్ట్‌గా బదిలీ. ► ప్రస్తుత మహబూబ్‌నగర్ కలెక్టర్ ఎస్ వెంకట్రావు.. సూర్యాపేట కలెక్టర్‌గా బదిలీ. ► ప్రస్తుత మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్ హరీష్.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బదిలీ. ► జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ బి సంతోష్.. మంచిర్యాల కలెక్టర్‌గా బదిలీ. ► ప్రస్తుత సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజార్షి షా.. మెదక్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ. ► ప్రస్తుత నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి.. వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ. ► ప్రస్తుత కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌కు జగిత్యాల ఇన్చార్జ్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు. ► ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్ట్ అధికారి వరుణ్ రెడ్డి.. నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ ► ప్రస్తుత కొమురం భీమ్ ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్.. ఆదిలాబాద్ కలెక్టర్‌గా బదిలీ ► ప్రస్తుత మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్.. వనపర్తి కలెక్టర్‌గా బదిలీ కలెక్టర్ల బదిలీ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి -
త్వరలో కలెక్టర్ల బదిలీలు!
- ‘ఎస్ సార్’ అనేవారికే పోస్టింగులు - మాటవినని వారికి అప్రధాన పోస్టులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కలెక్టర్ల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. అధికార పక్షం నేతలు చెప్పిన అడ్డగోలు పనులు చేసేందుకు వీలుకాదంటున్న వారిని తప్పించేందుకు కసరత్తు సాగుతోంది. తాము ఏమి చెప్పినా ‘ఎస్ సార్’ అనే వారిని జిల్లా మెజిస్ట్రేట్లుగా తెచ్చుకోవాలని కొందరు మంత్రులు, అధికార పక్ష ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. చెప్పిన మాట చెప్పినట్లు చేయకుండా నిబంధనలు అంగీకరించవని చెప్పే వారిని తప్పించి అప్రధాన పోస్టులకు పంపించాలని మంత్రులు ఒత్తిడి తెస్తున్నారు. తాము చెప్పినట్లు చేయలేదనే కక్షతో కలెక్టర్లను తప్పించేందుకు తప్పుడు ఫిర్యాదులు కూడా చేయిస్తున్నారు. కోస్తా జిల్లాల్లో కూడా ఇద్దరు కలెక్టర్లపై ఇలాగే బురదచల్లి బదిలీ చేయించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ‘టీడీపీ వారు చెప్పిన పనులు చేయాల్సిందే. అధికారంలోకి తెచ్చిన వారికి మేలు చేయడం కుదరదంటే ఎలా? రూల్స్ మాట్లాడవద్దు... మావారు (అధికార పక్షం నేతలు) చేసిన సిఫార్సుల అమలు చేయండి. ఈ విషయంలో ఇక నాకు ఫిర్యాదులు రాకూడదు..’ అని కీలక నేత కొంతకాలం కిందట నేరుగా కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. మీరు చెప్పిన తర్వాత కూడా మాట వినడంలేదు. వారిని మార్చండని తాజాగా కొందరు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన బదిలీపైనే ప్రధాన చర్చ... గతంలో ఐఏఎస్‌ల బదిలీల సందర్భంగా రాయలసీమలో ఒక జిల్లా కలెక్టర్ కచ్చితంగా బదిలీ అవుతారని ఆ జిల్లా ఉద్యోగులు, అధికారులు దృఢంగా విశ్వసించారు. ‘కలెక్టరు వేధింపులు భరించలేకపోతున్నాం. జిల్లా స్థాయి అధికారులను సైతం నిత్యం వేధిస్తున్నారు. భారీ అవినీతికి పాల్పడుతున్నారు. ఆయన దోచుకుంటూ మాపై అవినీతి ముద్ర వేస్తున్నారు...’ అంటూ సదరు అధికారి అక్రమార్జనపై వివరాలతో ప్రభుత్వానికి ఆకాశరామన్న ఉత్తరాలు కూడా పంపించారు. కొందరు అధికార పక్ష ప్రజాప్రతినిధులు కూడా ఆయనను బదిలీ చేయాలని కోరారు. కలెక్టరు బదిలీ అయితే పొట్టేళ్లు బలి ఇస్తామని, కొబ్బరికాయలు కొడతామని చాలామంది అధికారులు మొక్కుకున్నట్లు అధికారవర్గాల్లో రసవత్తరమైన చర్చ సాగింది. ఆ జిల్లా కలెక్టర్ కచ్చితంగా బదిలీ అవుతారని సచివాలయంలోనూ ప్రచారం సాగింది. అయితే సదరు కలెక్టర్ బదిలీ కాలేదు. ఈ పర్యాయం ఆయన బదిలీ తప్పకపోవచ్చని అధికాారులు చెబుతున్నారు కానీ... ‘ఆ కలెక్టర్ బదిలీ కాకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఎవరి మాటా వినని విషయం వాస్తవమే. అయితే సీఎం కాలితో చెబితే చేతితో చేస్తారు. అందువల్లే సీఎం ఆయనను బదిలీ చేయకపోవచ్చు’ అని ఒక ఉన్నతాధికారి ‘సాక్షి’తో అన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్‌గా పనిచేసి ఉత్తరాంధ్ర జిల్లాకు కలెక్టరుగా వెళ్లిన ఓ అధికారికి ముక్కుసూటి మనిషనే గుర్తింపు ఉంది. అన్నివిధాలా అవినీతికి పాకులాడే ఆ జిల్లా మంత్రికి ఆ కలెక్టర్ నచ్చడంలేదు. కలెక్టరును మార్చితేనే కార్పొరేషన్ ఎన్నికల్లో నెగ్గుకు రాగలమని అధికారపార్టీ నేతల ద్వారా కూడా మంత్రి సీఎంకు చెప్పిస్తున్నారని సమాచారం. రాయలసీమలో కరువుతో పంటలు ఎండిపోవడాన్ని సకాలంలో తన దృష్టికి తీసుకురాలేదనే తప్పుడు ఆరోపణలతో మరో కలెక్టర్‌ను మార్చాలని ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలిసింది. అసలు విషయం ఏంటంటే పాలకపక్ష నాయకులు అడ్డగోలుగా కాంట్రాక్టులు అడుగుతుండంతో ఆ కలెక్టర్ అంగీకరించడంలేదనేది సమాచారం. కోస్తాలో ఇటీవలే పోస్టింగు లభించిన మరో కలెక్టర్‌ను కూడా మార్చాలని నాయకులు కోరుతున్నారని తెలిసింది. మున్సిపల్ ఎన్నికల తోనూ లింకు... త్వరలో జరగనున్న నగరపాలక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలంటే ఫలానా అధికారులను బదిలీ చేయాలని ఇటీవల కొందరు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి విన్నవించారు. రకరకాల సాకులతో ఇప్పటివరకూ ఎన్నికలు జరపకుండా తప్పించుకుంటూ వచ్చిన సర్కారు హైకోర్టు ఆదేశాల మేరకు ఈఏడాది చివర్లో ఎన్నికలు జరపక తప్పదని నిర్ణయించుకుంది. విశాఖపట్నం, శ్రీకాకుళం, కర్నూలు, తిరుపతి, కాకినాడ, గుంటూరు, ఒంగోలు నగర పాలక సంస్థలు, రాజంపేట, రాజాం, కందుకూరు, నెల్లిమర్ల మున్సిపాలిటీలకు ఎన్నికలు జరపాల్సి ఉంది. ఈ స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని, ఇందుకు కావాల్సిన సాధనాసంపత్తులన్నీ తానే సమకూర్చుతానని ఆయా జిల్లాల మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వీటిలో గెలవాలంటే మాట వినని కలెక్టర్లను బదిలీచేసి అనుకూలమైన వారిని వేయాలని మూడు జిల్లాల నేతలు కోరారు. త్వరలోనే కలెక్టర్లను బదిలీ చేస్తామని, మన మాట వినే వారే వస్తారని ముఖ్యమంత్రి చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో త్వరలో కలెక్టర్ల బదిలీలు ఉంటాయని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.