మహేశ్వరం: స్థానిక ప్రభుత్వ మోడల్ స్కూల్ నుంచి తొమ్మిది మంది విద్యార్థులకు అమెరికా టెక్సాస్ నగరంలో నిర్వహించే ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్‌మెంట్ కాన్ఫరెన్స్‌కు ఆహ్వానం రావడం గర్వించదగ్గ విషయమని మంత్రి సబితారెడ్డి అన్నారు. అమెరికా నుంచి ఆహ్వానం అందుకున్న విద్యార్థులు శుక్రవారం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ మోడల్ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఆహ్వానం అందడం అభినందనీయమని, సర్కారు బడుల్లో నాణ్యతతో కూడిన విద్య అందుతుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బాబు, మాజీ ప్రిన్సిపాల్ బి. ధనుంజయ్, కేసీ తండా సర్పంచ్ మోతిలాల్ నాయక్, ఉప సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ రవి నాయక్, విద్యార్థులు పలువురు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment