స్కూల్‌ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. 40 మంది చిన్నారులు.. | New Brilliant School Bus Met With An Accident In Vikarabad | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. 40 మంది చిన్నారులు..

Published Sat, Sep 23 2023 10:01 AM | Last Updated on Sat, Sep 23 2023 4:50 PM

New Brilliant School Bus Met With An Accident In Vikarabad - Sakshi

సాక్షి, వికారాబాద్‌: స్కూల్‌ పిల్లలతో వెళ్తున్న బస్సు ఓ నీటి కుంటలోకి దూసుకెళ్లిన ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేసింది. ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన స్కూల్‌ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 40 మంది పిల్లలకు తృటిలో ప్రమాదం తప్పడంతో పేరెంట్స్‌, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన వికారాబాద్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. 40 మంది స్కూల్‌ పిల్లలతో వెళ్తున్న ప్రైవేటు స్కూల్‌కు చెందిన మినీ బస్సు ‍ప్రమాదానికి గురైంది. సుల్తాన్‌పూర్‌ వద్ద ఓ నీటి కుంటలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో నీటిలో ఉన్న బస్సులోకి నుంచి స్థానికులు.. విద్యార్థులను కాపాడారు. ఇక, సదరు బస్సును న్యూ బ్రిలియంట్‌ స్కూల్‌కు చెందిన వాహనంగా గుర్తించారు. కాగా, బస్సు స్టీరింగ్‌ పనిచేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని డ్రైవర్‌ చెప్పుకొచ్చాడు. ఈ ప్రమాదం నేపథ్యంలో పాఠశాల యాజమాన్యంపై పేరెంట్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: నివేదిక వచ్చేవరకు జీవో 111కు కట్టుబడి ఉంటాం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement