ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అభివృద్ధి నిధుల విడుదలలో కేసీఆర్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్ : ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అభివృద్ధి నిధుల విడుదలలో కేసీఆర్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ రోడ్ల నిర్మాణానికి పంచాయతీ రాజ్ శాఖ రూ. 1952 కోట్లు విడుదల చేస్తూ జీవో 36 ఇచ్చిందన్నారు. అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు రూ.5 కోట్ల లోపు మంజూరు చేసిన ప్రభుత్వం... టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేసిందని రామ్మోహన్ రెడ్డి అన్నారు. కేసీఆర్...అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య తేడా చూపరాదని ఆయన సూచించారు.