Ramohan Reddy
-
ఫోన్ కొట్టు..టికెట్ పట్టు!
మీకు రాజకీయాల్లోకి రావాలనుందా...గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేయాలని ఉందా...మీకు ఏ పార్టీ టికెట్ ఇవ్వలేదా...అయితే మీ ఆసక్తిని ప్రోత్సహిస్తాం..మీ ఆశయాలకు బాటలు వేస్తాం. పార్టీ టికెట్ ఇచ్చి..గెలుపునకు బాటలు వేస్తాం. మాకు ఓ ఫోన్ కొట్టండి మరి...అని తెలంగాణ యువశక్తి (టీవైఎస్) పార్టీ పిలుపునిస్తోంది. ఈ మేరకు సోమవారం ఆ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి ఈ విషయం వెల్లడించారు. ముఖ్యంగా యువతీ యువకులు రాజకీయాల్లోకి రావాలని, ఆసక్తి ఉన్నవారు 9391005388లో సంప్రదించి తమ పార్టీ టికెట్‌పై గ్రేటర్ బరిలో నిలవచ్చని ఆయన పేర్కొన్నారు. - సుల్తాన్‌బజార్ -
కేసీఆర్ సర్కార్ వివక్ష చూపుతోంది...
హైదరాబాద్ : ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అభివృద్ధి నిధుల విడుదలలో కేసీఆర్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ రోడ్ల నిర్మాణానికి పంచాయతీ రాజ్ శాఖ రూ. 1952 కోట్లు విడుదల చేస్తూ జీవో 36 ఇచ్చిందన్నారు. అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు రూ.5 కోట్ల లోపు మంజూరు చేసిన ప్రభుత్వం... టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేసిందని రామ్మోహన్ రెడ్డి అన్నారు. కేసీఆర్...అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య తేడా చూపరాదని ఆయన సూచించారు. -
అనవసర రాద్ధాంతం: ఎమ్మెల్యే టీఆర్ఆర్
పరిగి: నియోజకవర్గం అభివృద్ధి చెందింది కాంగ్రెస్ హయాంలోనేనని ఎమ్మెల్యే తమ్మన్నగారి రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి పరిగిలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తనపై మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పరిగికి అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని రప్పించి రూ. 5కోట్లు మంజూరు చేయించానని తెలిపారు. ఆ నిధులతోనే పరిగి పట్టణంలో సీసీ రోడ్లు వేశారన్నారు. కోయిల్‌సాగర్ నీళ్లు తేవటం జీవితాశయమని ‘చిగురుటాకు’ పుస్తకంలో రాయించుకున్న హరీశ్వర్‌రెడ్డి ఇప్పుడు మాటమార్చి ఆ ప్రాజెక్టు 10 సంవత్సరాలకోసారి కూడా నిండదని చెప్పటం విడ్డూరమన్నారు. ఎన్నికల వ్యయంపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. తనపై మరోసారి అసత్య ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడాలేని విధంగా మోడల్ స్కూళ్లు, ఇందిరమ్మ, ఐఏవై ఇళ్లు పరిగి నియోజకవర్గానికి మంజూరు చేయించానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్దాంతి పార్థసారథి, డీసీసీ ఉపాధ్యక్షుడు సుభాష్‌చందర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బద్రిగారి నారాయణ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు బండలింటి మైపాల్, పట్టణ అధ్యక్షుడు గోపాల్, ఎంపీటీసీ సభ్యులు సమద్, సీనియర్ నాయకులు నస్కల్ అశోక్, దస్తగిరిపటేల్, సర్దార్‌మొల్‌సాబ్, ఎర్రగడ్డపల్లి కృష్ణ, ఆంజనేయులు, సర్వర్, ఎదిరెకృష్ణ, రవీంద్ర, రామకృష్ణారెడ్డి, షాహెద్, నయీమోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
సీబీఐకి ఫిర్యాదు చేస్తా
టీఆర్ఎస్ నేత హరీశ్వర్‌రెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇటీవల జరిగిన ఎన్నికల్లో పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి టి.రామ్మోహన్‌రెడ్డి ఖర్చు విషయంలో జిల్లా యంత్రాంగం లెక్కలు తారుమారు చేసి ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తోందని, దీనిపై సీబీఐతో విచారణకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఆర్ నిబంధనలకు మించి డబ్బులు ఖర్చు చేశారని, కానీ ఖర్చును అంచనావేసే అధికారులు తప్పుడు నివేదికలు సమర్పించారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో వాహనాలకు సంబంధించి అద్దె వివరాలు పేర్కొన్న అధికారులు.. డ్రైవరు భత్యం, డీజిల్ ఖర్చు తదితర వివరాలు పేర్కొనలేదన్నారు. అదేవిధంగా ప్రచార క్రమంలో పెద్దఎత్తున టీషర్టులు పంచారని, నియోజకవర్గ అభివృద్ధిపై వేలసంఖ్యలో రెండు రకాల పుస్తకాలు అత్యంత ఖర్చుతో అచ్చు వేయించారని, కానీ ఈ వివరాలు అభ్యర్థి ఖర్చుల జాబితాలో చేరలేదన్నారు. జిల్లా ఎన్నికల అధికారికి సమాచార హక్కు చట్టం ద్వారా రామ్మోహన్‌రెడ్డి ఎన్నికల ఖర్చుపై అర్జీ పెడితే.. ఇరవై రోజుల తర్వాత తనకు వివరాలిచ్చారని, అయితే ఎన్నికల ఖర్చులో పరిశీలకుడు సమర్పించిన వివరాలు.. ఆర్టీఐ ద్వారా అందిన వివరాలకు పొంతన లేకుండా ఉందన్నారు. ఈ వివరాలన్నింటినీ ఈసీ దృష్టికి తీసుకెళ్లామని, నిశితంగా పరిశీలించిన వారు పూర్తి నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారన్నారు. అధికారులు తప్పుడు నివేదికలు సమర్పించేందుకే కాలయాపన చేస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. అధికారుల్లో మార్పురాకుంటే కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కు ఫిర్యాదు చేస్తానని, ఇప్పటికే సీవీసీకి ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు హరీశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
'ఖర్చు' పై రచ్చ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి (టీఆర్ఆర్) ఎన్నికల ఖర్చు వ్యవహారంపై నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. ఎన్నికల సమయంలో టీఆర్ఆర్ చేసిన ఖర్చును తక్కువ చేసి చూపించారనే అభియోగంతో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి వాదనకు దిగారు. ఇందుకు సంబంధించి ఆయన సేకరించిన ఆధారాలతో ఏకంగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వివరాల ఆధారంగా పరిశీలనకు దిగిన ఎన్నికల సంఘం.. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించేందుకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా వివరాలు సమర్పించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. నివేదికపై తాత్సారం.. ఎన్నికల వేళ టీఆర్ఆర్ ఖర్చుపై ఇదివరకు జిల్లా ఎన్నికల అధికారి నేతృత్వంలో యంత్రాంగం పరిశీలన చేసి నివేదిక సమర్పించింది. అయితే ఇందులో లెక్కలు తారుమారు చేశారని హరీశ్వర్ పేర్కొంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా టీఆర్ఆర్ ఖర్చు వివరాలకోసం సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆర్టీఐ ద్వారా అధికారులిచ్చిన వివరాలు, ఎన్నికల సంఘం వివరాలకు పొంతన లేకపోవడాన్ని పసిగట్టిన హరీశ్వర్‌రెడ్డి.. వాదనను తీవ్రతరం చేశారు. అధికారులను నిలదీయంతో సదరు అధికారులు డైలమాలో పడ్డారు. ఈ క్రమంలో తాను సేకరించిన ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల సంఘం అధికారులు నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. అయితే నివేదిక ఇప్పటికే ఇవ్వాల్సి ఉండగా.. జిల్లా యంత్రాంగం మాత్రం నివేదిక సమర్పణపై తాత్సారం చేస్తున్నట్లు కనిపిస్తోంది.