అనవసర రాద్ధాంతం: ఎమ్మెల్యే టీఆర్‌ఆర్ | fight on election money | Sakshi
Sakshi News home page

అనవసర రాద్ధాంతం: ఎమ్మెల్యే టీఆర్‌ఆర్

Published Wed, Oct 29 2014 3:43 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

fight on election money

పరిగి: నియోజకవర్గం అభివృద్ధి చెందింది కాంగ్రెస్ హయాంలోనేనని ఎమ్మెల్యే తమ్మన్నగారి రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి పరిగిలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తనపై మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పరిగికి అప్పటి  సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని రప్పించి రూ. 5కోట్లు మంజూరు చేయించానని తెలిపారు. ఆ నిధులతోనే  పరిగి పట్టణంలో సీసీ రోడ్లు వేశారన్నారు.  కోయిల్‌సాగర్ నీళ్లు తేవటం జీవితాశయమని ‘చిగురుటాకు’ పుస్తకంలో రాయించుకున్న హరీశ్వర్‌రెడ్డి ఇప్పుడు మాటమార్చి ఆ ప్రాజెక్టు 10 సంవత్సరాలకోసారి కూడా నిండదని చెప్పటం విడ్డూరమన్నారు.

ఎన్నికల వ్యయంపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు.   తనపై మరోసారి అసత్య ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడాలేని విధంగా  మోడల్ స్కూళ్లు, ఇందిరమ్మ, ఐఏవై ఇళ్లు పరిగి నియోజకవర్గానికి  మంజూరు  చేయించానని ఆయన తెలిపారు.  ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్దాంతి పార్థసారథి, డీసీసీ ఉపాధ్యక్షుడు సుభాష్‌చందర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బద్రిగారి నారాయణ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు బండలింటి మైపాల్, పట్టణ అధ్యక్షుడు గోపాల్, ఎంపీటీసీ సభ్యులు సమద్, సీనియర్ నాయకులు నస్కల్ అశోక్, దస్తగిరిపటేల్, సర్దార్‌మొల్‌సాబ్, ఎర్రగడ్డపల్లి కృష్ణ, ఆంజనేయులు, సర్వర్, ఎదిరెకృష్ణ, రవీంద్ర, రామకృష్ణారెడ్డి, షాహెద్, నయీమోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement