రీల్ లైఫ్లోనే కాదు...రియల్ లైఫ్లోనూ బుల్లితెర నటి తన విలనిజాన్ని చూపించింది. సోదరుడి ఆస్తిపై కన్నేసిన ఆమె...వదినపై అమానుషంగా ప్రవర్తించింది. అన్నచనిపోవడంతో వదిన ఉంటున్న ఇల్లును జేసీబీతో కూల్చేసింది. ఆస్తి తమకే దక్కుతుందని అనుచరులతో వీరంగం సృష్టించింది. టీవీ సీరియల్ ఎపిసోడ్కు ఏమాత్రం తీసిపోలేదు. చంద్రముఖి సీరియల్ ఫేం శ్రీవాణి సోదరుడు బాబ్జీ అనారోగ్యంతో కొంతకాలం క్రితం మరణించాడు.