place dispute
-
కరీంనగర్(జగిత్యాల): 3 గజాల స్థలం.. ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది
-
3 గజాల స్థల వివాదం.. ఓ నిండు ప్రాణం బలి
సాక్షి, కరీంనగర్(జగిత్యాల): జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. మూడు గజాల స్థల వివాదం ఒకరి ప్రాణాలను బలిగొంది. జగిత్యాల రూరల్ మండలం సంగంపల్లిలో జాలపల్లి రవి, పత్తిపాక బాపన్నకు మధ్య ఇంటి దారి విషయంలో భూ వివాదం నెలకొంది. మూడు గజాల స్థలం కోసం పలుమార్లు వారు గొడవ పడ్డారు. గొడవ మరింత ముదరడంతో ఈరోజు బాపన్న.. రవి, ఆయన భార్య మల్లవ్వపై కర్రతో దాడికి పాల్పడ్డాడు. రవి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గాయపడ్డ మల్లవ్వను స్థానికులు కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చదవండి: దారుణం: కన్నతల్లిని చూడకుండానే కవలల మృతి -
స్థల వివాదంగా చూస్తాం
న్యూఢిల్లీ: రాజకీయంగా సున్నితమైన రామ జన్మభూమి– బాబ్రీ మసీదు వివాదం కేసును పూర్తిగా స్థల వివాదంగానే పరిగణిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో రోజువారీ విచారణ జరపాలన్న విజ్ఞప్తిని అత్యున్నత ధర్మాసనం తిరస్కరిస్తూ సాధారణ పద్ధతిలోనే విచారిస్తామంది. 700 మందికిపైగా పేద కక్షిదారులు(ఇతర కేసుల్లో) న్యాయం కోసం వేచిఉన్నారని, వారి కేసుల్ని కూడా విచారించాల్సి ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో క్షక్షిదారులు కోర్టు ముందుంచిన డాక్యుమెంట్లు, సాక్ష్యాలు, ప్రాంతీయ భాషల పుస్తకాల్లోని సారాంశాన్ని ఇంగ్లిష్‌కి అనువదించి సమర్పించాలని ఆదేశించింది. విచారణను మార్చి 14కు ధర్మాసనం వాయిదా వేసింది. అలహాబాద్ హైకోర్టులో కేసు విచారణ రికార్డులకు సంబంధించిన వీడియో క్యాసెట్ల కాపీలను కక్షిదారులకు అందచేయాలని రిజిస్ట్రార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘రామ్ లల్లా విరాజ్మన్’ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదిస్తూ.. కేసులోని అవతలి వైపు కక్షిదారులు తమ వాదనల సారాంశాన్ని కోర్టుకు తెలపడంతో పాటు, తమతో పరస్పర మార్పిడి చేసుకోవాలని సూచించారు. దీనికి ప్రతివాది తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తనకు నచ్చిన విధంగా వాదిస్తానని, తాను దేని ప్రామా ణికంగా వాదించాలన్నది వారు ఆదేశించలేరని పేర్కొన్నారు. హిందూ సంస్థల తరఫున సీనియర్ న్యాయవాది కె.పరాశరన్ వాదిస్తూ.. ‘ఈ సంఘటన త్రేతాయుగం నాటిది. 30 వేల ఏళ్ల నాటికి చెందిన ఏ సాక్ష్యాల్ని అప్పీలుదారులు తేగలరు? అందువల్ల మమ్మల్ని రికార్డుల్లోని సాక్ష్యాల వరకే పరిమితం చేయాలి’ అని విజ్ఞప్తిచేశారు. అయోధ్యలోని వివాదాస్పద భూమిని నిర్మోహి అఖారా, రామ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డులకు సమానంగా పంచుతూ అలహాబాద్ హైకోర్టు గతంలోతీర్పునిచ్చింది. ముస్లిం నేతలతో రవిశంకర్ చర్చలు మరోవైపు అయోధ్య వివాద పరిష్కారం కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ గురువారం ముస్లిం నేతలతో చర్చించారు. సున్నీ వక్ఫ్ బోర్డు, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులతో పాటు ఇతరులు రవి శంకర్‌ను కలిసి అయోధ్య వివాదంలో కోర్టు వెలుపల రాజీకి మద్దతు తెలిపారని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘వేరే ప్రాంతానికి మసీదును తరలించే ప్రతిపాదనకు వారు మద్దతు ప్రకటించారు’ అని వెల్లడించింది. -
ఏజెన్సీ భూముల్లో గిరిజనేతరుల పాగా
-
శ్రీవాణిపై చర్యలు తీసుకుంటాం: సీఐ
-
శ్రీవాణిపై చర్యలు తీసుకుంటాం: సీఐ
వికారాబాద్ : అన్న భార్యపై దాడి చేసిన కేసులో పోలీసుల విచారణకు బుల్లితెర నటి శ్రీవాణి గైర్హాజరు అయింది. ఈ సందర్భంగా వికారాబాద్ మహిళాa పోలీస్ స్టేషన్ సీఐ నిర్మల మాట్లాడుతూ విచారణకు హాజరు కావాలని శ్రీవాణికి ఫోన్ చేశామన్నారు. అయితే ఆమె రాలేదని, విచారణకు శ్రీవాణి సహకరించడం లేదన్నారు. శ్రీవాణిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. అవసరం అయితే అరెస్ట్ తప్పదన్నారు. మరోవైపు పోలీసుల విచారణకు అనూష హాజరు అయ్యింది. కాగా షూటింగ్ ఉన్నందునే విచారణకు హాజరు కాలేకపోయానని శ్రీవాణి తెలిపింది. కాగా రంగారెడ్డి జిల్లా పరిగికి చెందిన అనూష, శ్రీవాణి ఇంటి స్థలం విషయంలో గొడవకు దిగడంతో పాటు ఘర్షణ పడి పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఐ నిర్మల నిన్న వివాదాస్పద ఇంటి స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. స్థానికులతో మాట్లాడి ఆరా తీశారు. నటి శ్రీవాణి పలుమార్లు సదరు ఇంటి స్థలాన్ని సందర్శించిందని, వదిన అనూషపై బెదిరింపులకు పాల్పడిందని సీఐకి వివరించారు. దీంతో వారందరి వాంగ్మూలాలను సీఐ నమోదు చేశారు. -
ఇల్లు కూల్చివేతలో నా ప్రమేయం లేదు
టీవీనటి శ్రీవాణి తాండూరు: తనపై తప్పుడు కేసు పెట్టారని, టీవీ నటినైనందునే తనను అప్రతిష్ట పాలు చేస్తున్నారని బుల్లి తెర నటి శ్రీవాణి స్పష్టం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా తాండూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. తన అన్న బాబ్జీ గత నెలలో చనిపోయాడని, నాన్న కోటేశ్వర్రావుకు ఐదుగురు కూతుళ్లమని, తమకు పరిగిలో ఇల్లు, ఒక ఎకరం భూమి ఉందన్నారు. తాము ఆ ఇల్లు కూల్చివేసినట్టు వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. తన వదిన అనూషను వేధింపులకు గురి చేశానని ఆరోపించడంలో నిజం లేదన్నారు. ఇల్లు కూల్చివేతలో తన ప్రమేయమే లేదని, అది ఏడాది క్రితమే జరిగిందన్నారు. ఇతరులను తీసుకువచ్చి దాడి చేయించాననడం అబద్ధమని, తనపైనే దాడి జరిగిందని చెప్పారు. శ్రీవాణి తండ్రి కోటేశ్వర్రావు మీడియాతో మాట్లాడుతూ పరిగిలో ఐదారు కోట్ల ఆస్తి తన పేరుతో ఉందన్నారు. శ్రీవాణితోపాటు తన కుటుంబసభ్యులపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ఆస్తిలో ఐదుగురు కూతుళ్లతో పాటు కోడలుకు సమానంగా వాటా ఉంటుందని చెప్పారు. -
నాపై అనవసర ఆరోపణలు: శ్రీవాణి
వికారాబాద్: రంగారెడ్డి జిల్లా పరిగి గ్రామంలో స్థల వివాదం విషయంలో తనపై వచ్చిన ఆరోపణలను బుల్లితెర నటి శ్రీవాణి ఖండించింది. తాను ఎవరిపైనా దాడి చేయలేదని ఆమె స్పష్టం చేసింది. వదిన అనూష తమపై అనవసర ఆరోపణలు చేస్తోందని శ్రీవాణి వ్యాఖ్యానించింది. తండ్రి ఆస్తిలో తమకు హక్కుందని ఆమె తెలిపింది. పోలీసులు విచారణకు సహకరిస్తానని శ్రీవాణి పేర్కొంది. మరోవైపు శ్రీవాణి వదిన అనూషకు స్థానికులు మద్దతుగా నిలిచారు. అనూషపై శ్రీవాణి దౌర్జన్యం చేస్తోందని పరిగి సర్పంచ్ సుదర్శన్ అన్నారు. గతంలో కూడా అనూషపై దాడికి యత్నించడమే కాకుండా వేధింపులకు గురి చేసినట్లు దాడికి యత్నించిందని తెలిపారు. తనను ఎవరూ ఏమీ చేయలేరనే అహంకారంతో శ్రీవాణిని ఉందన్నారు. శ్రీవాణి తండ్రి గతంలోనే ఐదెకరాల భూమిని అమ్మి ఆమెకు డబ్బులు ఇచ్చారని, మళ్లీ ఇప్పుడు ఆస్తిని కాజేయాలని చూస్తోందని సుదర్శన్ అన్నారు. కాగా మరోవైపు ఈ కేసుపై సీఐ నిర్మల మాట్లాడుతూ అనూష ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామన్నారు. శ్రీవాణి దౌర్జన్యం చేసినట్లు స్థానికులు చెబుతున్నారన్నారు. గతంలో కూడా అనూషను శ్రీవాణి వేధించారని సీఐ తెలిపారు. చదవండి... (బుల్లితెర నటి శ్రీవాణి విలనిజం) -
బుల్లితెర నటి శ్రీవాణి విలనిజం
-
బుల్లితెర నటి శ్రీవాణి విలనిజం
పరిగి: రీల్ లైఫ్‌లోనే కాదు...రియల్ లైఫ్‌లోనూ బుల్లితెర నటి తన విలనిజాన్ని చూపించింది. సోదరుడి ఆస్తిపై కన్నేసిన ఆమె...వదినపై అమానుషంగా ప్రవర్తించింది. అన్నచనిపోవడంతో వదిన ఉంటున్న ఇల్లును జేసీబీతో కూల్చేసింది. ఆస్తి తమకే దక్కుతుందని అనుచరులతో వీరంగం సృష్టించింది. టీవీ సీరియల్ ఎపిసోడ్‌కు ఏమాత్రం తీసిపోలేదు. చంద్రముఖి సీరియల్ ఫేం శ్రీవాణి సోదరుడు బాబ్జీ అనారోగ్యంతో కొంతకాలం క్రితం మరణించాడు. అయితే సోదరుడికి పిల్లలు లేకపోవడంతో తమ తండ్రి ఆస్తిలో తమకు వాటా వస్తుందంటూ శ్రీవాణి తన సోదరి శ్రీకన్యతో కలిసి సోమవారం రంగారెడ్డి జిల్లా పరిగిలో హల్చల్ చేశారు. వేరే వారిని ఆ స్థలాన్ని విక్రయించేందుకు యత్నించగా అందుకు బాబ్జీ భార్య అనూష అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా శ్రీవాణి అసభ్య పదజాలం ఉపయోగించడమే కాకుండా, తన భర్త ఆదిత్యరెడ్డి సాయంతో ఆ ఇంటిని కూల్చివేసింది. దీంతో అనూష పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిగి పోలీసులు శ్రీవాణిపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు అనూషపై శ్రీవాణి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం అనూష ఉంటున్న ఇంటి స్థలంలో తమకు కూడా వాటా ఉందని అడిగేందుకు వెళితే తమపై దాడికి యత్నించిందని శ్రీవాణి తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారని, ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. విచారణకు హాజరు కావాలని శ్రీవాణిని సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. మరోవైపు అనూషకు స్థానికులు బాసటగా నిలిచారు. అనూష భర్త చనిపోయి బాధలో ఉంటే వేధించడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అమాయకురాలైన అనూషకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ ఇంటి స్థలం కోసం శ్రీవాణి యత్నించిందని, అయితే ఆ ప్రయత్నాలను తాము అడ్డుకున్నట్లు స్థానికులు తెలిపారు. చదవండి....(బుల్లితెర నటి శ్రీవాణిపై ఫిర్యాదు)