
నాపై అనవసర ఆరోపణలు: శ్రీవాణి
వికారాబాద్: రంగారెడ్డి జిల్లా పరిగి గ్రామంలో స్థల వివాదం విషయంలో తనపై వచ్చిన ఆరోపణలను బుల్లితెర నటి శ్రీవాణి ఖండించింది. తాను ఎవరిపైనా దాడి చేయలేదని ఆమె స్పష్టం చేసింది. వదిన అనూష తమపై అనవసర ఆరోపణలు చేస్తోందని శ్రీవాణి వ్యాఖ్యానించింది. తండ్రి ఆస్తిలో తమకు హక్కుందని ఆమె తెలిపింది. పోలీసులు విచారణకు సహకరిస్తానని శ్రీవాణి పేర్కొంది.
మరోవైపు శ్రీవాణి వదిన అనూషకు స్థానికులు మద్దతుగా నిలిచారు. అనూషపై శ్రీవాణి దౌర్జన్యం చేస్తోందని పరిగి సర్పంచ్ సుదర్శన్ అన్నారు. గతంలో కూడా అనూషపై దాడికి యత్నించడమే కాకుండా వేధింపులకు గురి చేసినట్లు దాడికి యత్నించిందని తెలిపారు. తనను ఎవరూ ఏమీ చేయలేరనే అహంకారంతో శ్రీవాణిని ఉందన్నారు. శ్రీవాణి తండ్రి గతంలోనే ఐదెకరాల భూమిని అమ్మి ఆమెకు డబ్బులు ఇచ్చారని, మళ్లీ ఇప్పుడు ఆస్తిని కాజేయాలని చూస్తోందని సుదర్శన్ అన్నారు.
కాగా మరోవైపు ఈ కేసుపై సీఐ నిర్మల మాట్లాడుతూ అనూష ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామన్నారు. శ్రీవాణి దౌర్జన్యం చేసినట్లు స్థానికులు చెబుతున్నారన్నారు. గతంలో కూడా అనూషను శ్రీవాణి వేధించారని సీఐ తెలిపారు. చదవండి... (బుల్లితెర నటి శ్రీవాణి విలనిజం)