ఇల్లు కూల్చివేతలో నా ప్రమేయం లేదు | Police book case on TV actress Sree Vani | Sakshi
Sakshi News home page

ఇల్లు కూల్చివేతలో నా ప్రమేయం లేదు

Published Fri, Jul 15 2016 3:54 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

ఇల్లు కూల్చివేతలో నా ప్రమేయం లేదు - Sakshi

ఇల్లు కూల్చివేతలో నా ప్రమేయం లేదు

టీవీనటి శ్రీవాణి
తాండూరు: తనపై తప్పుడు కేసు పెట్టారని, టీవీ నటినైనందునే తనను అప్రతిష్ట పాలు చేస్తున్నారని బుల్లి తెర నటి శ్రీవాణి స్పష్టం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా తాండూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. తన అన్న బాబ్జీ గత నెలలో చనిపోయాడని, నాన్న కోటేశ్వర్‌రావుకు ఐదుగురు కూతుళ్లమని, తమకు పరిగిలో ఇల్లు, ఒక ఎకరం భూమి ఉందన్నారు. తాము ఆ ఇల్లు కూల్చివేసినట్టు వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు.

తన వదిన అనూషను వేధింపులకు గురి చేశానని ఆరోపించడంలో నిజం లేదన్నారు. ఇల్లు కూల్చివేతలో తన ప్రమేయమే లేదని, అది ఏడాది క్రితమే జరిగిందన్నారు. ఇతరులను తీసుకువచ్చి దాడి చేయించాననడం అబద్ధమని, తనపైనే దాడి జరిగిందని చెప్పారు. శ్రీవాణి తండ్రి కోటేశ్వర్‌రావు మీడియాతో మాట్లాడుతూ పరిగిలో ఐదారు కోట్ల ఆస్తి తన పేరుతో ఉందన్నారు. శ్రీవాణితోపాటు తన కుటుంబసభ్యులపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ఆస్తిలో ఐదుగురు కూతుళ్లతో పాటు కోడలుకు సమానంగా వాటా ఉంటుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement