రేవ్ పార్టీ పై పోలీసుల దాడి, ప్రముఖులు పిల్లల అరెస్ట్! | Police raids on Rave Party at Parigi Mandal of Ranga Reddy | Sakshi
Sakshi News home page

రేవ్ పార్టీ పై పోలీసుల దాడి, ప్రముఖులు పిల్లల అరెస్ట్!

Published Sun, Nov 10 2013 12:50 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

ముంబై, ఢిల్లీ మహనగరాల్లో జోరుగా సాగే రేవ్ పార్టీ సంస్కృతి భాగ్యనగరానికి కూడా పాకింది.

ముంబై, ఢిల్లీ మహనగరాల్లో జోరుగా సాగే రేవ్ పార్టీ సంస్కృతి భాగ్యనగరానికి కూడా పాకింది. ఈ మధ్యకాలంలో పోలీసులు రేవ్ పార్టీలపై ఆకస్మిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా పక్కా సమాచారంతో శనివారం రాత్రి  జరిపిన దాడిలో 20 మంది పురుషులతోపాటు, ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా పరిగి మండలం దొండపల్లిలో రేవ్ పార్టీలోని ఓ ఫామ్ హౌజ్ లో రేవ్ పార్టీ జరుగుతుందనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. 
 
ఈ దాడిలో నగర ప్రముఖుల, రాజకీయ నేతల కొడుకులు ఉన్నట్టు సమాచారం. ఈ దాడిలో భారీగా మద్యం బాటిల్లను, నాలుగు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం నగర శివార్లలో జరుగుతున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి.. పెద్ద మొత్తంలో మద్యాన్ని, భారీ సంఖ్యలో మహిళల్ని, పురుషుల్ని అరెస్ట్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement