మన తెలంగాణను మనమే పాలించుకోవాలి | general election nominations | Sakshi
Sakshi News home page

మన తెలంగాణను మనమే పాలించుకోవాలి

Published Sun, Apr 20 2014 1:28 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

మన తెలంగాణను  మనమే పాలించుకోవాలి - Sakshi

మన తెలంగాణను మనమే పాలించుకోవాలి

పరిగి అసెంబ్లీ టీఆర్‌ఎస్ అభ్యర్థి హరీశ్వర్‌రెడ్డి
 
 పూడూరు, న్యూస్‌లైన్: బంగారు తెలంగాణ నిర్మాణం కేవలం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి హరీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని సోమన్‌గుర్తి, సిరిగాయపల్లి, కెవరెళ్లి, దేవనోనిగూడం, రాకంచర్ల, తిర్మలాపూర్, చీలాపూర్  తదితర గ్రామాల్లో శనివారం ఆయన ముమ్మర ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా హరీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నంత మాత్రాన మన ఆశయం నెరవేరదన్నారు. మన తెలంగాణను మనమే పాలించుకోవాలని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నారు.

టీఆర్‌ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. హరీశ్వర్‌రెడ్డి సమక్షంలో రాకంచర్లకు చెందిన నాయకులు బీక్యా నాయక్ తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు అజీం, నాయకులు పుడుగుర్తి మల్లేషం, జి.రాములు, సత్యనారాయణ, అమ్రాది శ్రీనివాస్‌గుప్త, సర్పంచులు మధుసూదన్, గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement