ఉదయగిరి దర్గాలోని సమాధి ఊపిరి తీసుకోవడం స్థానిక ప్రజలతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా ఆకర్షిస్తోంది. నెల్లూరు జిల్లాలోని దర్గాలోని సమాధి ఊపిరి తీసుకుంటుందనే వార్త బయటకి రావడంతో తండోపతండాలుగా భక్తులు నెల్లూరు జిల్లా దర్శించకుంటున్నారు. ఉదయగిరి సమాధి పగలు మాత్రం మామూలుగానే ఉంటుందని, రాత్రి మాత్రమే ఊపిరి తీసుకోవడం గమనార్హం. ఈ వింతను హిందు, ముస్లీంలకతీతంగా దర్శించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనను భక్తులు మాత్రం దైవలీల, దేవుడి మహిమ అని భావిస్తుండగా, మరికొంతమంది ఇదంత మూఢనమ్మకమని కొట్టిపారేస్తున్నారు. గతంలో కూడా వినాయకుడు పాలుతాగుతున్నాడని..సాయిబాబా పోటో నుంచి విభూతి రాలుతుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.