పరిగిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రారంభం | YSRCP Office Started In Parigi | Sakshi
Sakshi News home page

పరిగిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రారంభం

Jul 26 2018 9:09 AM | Updated on Aug 20 2018 6:07 PM

YSRCP Office Started In Parigi - Sakshi

కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మతిన్‌ 

పరిగి వికారాబాద్‌ : పార్టీ నాయకులు ఎల్లవేళలా మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్‌ స్ఫూర్తితో పేదల పక్షాన నిలబడాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మతిన్‌ సూచించారు. పరిగిలోని శ్రీనివాసనగర్‌ కాలనీలో పార్టీ పరిగి నియోజకవర్గ కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల పక్షాన నిలబడే వారికి గుర్తింపు ఉంటుందని.. వారిని ప్రజలే ఆదరిస్తారని తెలిపారు. ఇది వైఎస్సార్‌ నిరూపించారని గుర్తుచేశారు. నేటికి ఆయన ప్రజల గుండెల్లో ఉండడమే దానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షు డు కోళ్ల యాదయ్య, రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అహ్మద్‌ ఖాద్రీ, అధికార ప్రతినిధి నరేందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement