వైఎస్‌ఆర్ స్ఫూర్తితో పార్టీని బలోపేతం చేస్తాం | party would strengthen the spirit of YSR | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్ స్ఫూర్తితో పార్టీని బలోపేతం చేస్తాం

Published Sat, Nov 8 2014 12:36 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

party  would strengthen the spirit of YSR

పరిగి: పేదల గుండెల్లో చిరస్మరణీయుడిగా మిగిలిపోయిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ స్ఫూర్తితో తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రుక్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

 జగన్‌మోహన్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిల ఆధ్వర్యంలో తెలంగాణలో పార్టీకి పునర్‌వైభవం తెస్తామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం  ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సంక్షేమ పథకాలను అర్హులకు కూడా దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. చేవెళ్లలో ఈనెల 9న నిర్వహించే పార్టీ రాష్ట్ర స్థాయి సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతుకుముందు చేవెళ్ల రాష్ట్ర సదస్సు పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కుముదిని, యాదయ్య, అజీజ్, యాకబ్, రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement