అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి
అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు నర్సమ్మ
పరిగి: అంగన్‌వాడీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు నర్సమ్మ, పరిగి ప్రాజెక్టు అధ్యక్షురాలు మంజుల, ప్రధాన కార్యదర్శి సత్యమ్మ అన్నారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పరిగి ప్రాజెక్టు పరిధిలోని నాలుగు మండలాల అంగన్‌వాడీ కార్యకర్తలు పరిగి ఐసీడీఎస్ సీడీపీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీడీపీఓ ప్రియదర్శినికి వినతి పత్రం అందజేశారు. ఎన్నిసార్లు ధర్నాలు, ఆందోళనలు, వినతి పత్రాలు సమర్పించినా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం్ంలేదని వారు పేర్కొన్నారు. ప్రతి నెలా వేతానాలు ఇవ్వటంతో పాటు పెండింగ్‌లో ఉన్న రెండు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని వారు కోరారు. సెంటర్లకు రాయితీ గ్యాస్ కోసం ప్రభుత్వం డబ్బులు మంజూరు చేయాలన్నారు.వంట పాత్రలు, పొయ్యిలు అందజేయాలన్నారు. సెంటర్లకు బీరువాలు, బకెట్లుతదితర సామాగ్రి అందజేయాలన్నారు. 2015 నుంచి పెండింగ్‌లో ఉన్న యూనిఫారాలు అందజేయాలన్నారు. ప్రతి నెలా బియ్యం, పప్పు, వంటనూనే, గుడ్లు, బాలామృతం పంపిణీ చేయాలన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు సెంటర్ల అద్దె డబ్బులు చెల్లించాలన్నారు. పెండింగ్ టీఏ, డీఏలు వెంటనే ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు స్వరూప, సక్కుబాయి పాల్గొన్నారు.