Air craft take off
-
వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. ఈ ఐదు ప్రధాన కారణాలు!
ప్రపంచవ్యాప్తంగా వరుస విమాన ప్రమాదాలు ప్రయాణీకులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో విమానం ఎక్కాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా ఒకేరోజులో(జనవరి 29)న అమెరికా, సూడాన్‌లో జరిగిన విమాన ప్రమాదాల కారణంగా ఏకంగా 84 మంది ప్రాణాలు కోల్పోవడం బాధితుల కుటుంబ సభ్యులను ఆవేదనకు గురిచేస్తోంది. ఈ ప్రమాదాలకు పైలట్స్, విమానంలో సాంకేతిక లోపాలే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రమాదాలకు మాత్రం ఐదు కారణాలే ముఖ్యంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.తాజాగా సౌత్ సూడాన్‌లో ఘోర విమాన భారత కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20మంది ప్రయాణికులు మరణించారు. ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు ధృవీకరించారు. యూనిటీ రాష్ట్రంలో గ్రేటర్ పయనీర్ ఆపరేటింగ్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విధుల్లో భాగంగా ఉద్యోగుల్ని తీసుకుని రాజధాని జుబాకు బయలుదేరింది. అయితే, రన్‌వే నుండి 500 మీటర్ల దూరంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం కూలిపోయింది. ప్రయాణీకుల్లో 16 మంది సౌత్ సూడాన్, ఇద్దరు చైనా, ఒక భారతీయుడు ఉన్నట్లు తేలింది.ఇక, భారత కాలమానం ప్రకారం.. గురువారం తెల్లవారుజామున అమెరికాలోని వాషింగ్టన్ సమీపంలో ప్రయాణికుల విమానం, సైనిక హెలికాప్టర్ ఢీ కొన్న ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 64 మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అక్కడి అగ్నిమాపక శాఖ చీఫ్ వెల్లడించారు. ఇప్పటి వరకు 28 మృతదేహాలను నదిలోంచి బయటకి తీసినట్లు తెలిపారు. అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, 2025 ఏడాది ప్రారంభంలోనే ఇలా ఒకే రోజున విమాన ప్రమాదాల కారణంగా ఇంత పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరగడంతో ప్రయాణీకులు వణికిపోతున్నారు.ఇదిలా ఉండగా.. 2000-2024 మధ్య 26 బోయింగ్ విమాన ప్రమాదాలు జరగ్గా అందుల్లో దాదాపు 10వేల మంది మరణించారు. ఒక్క 2024 ఏడాదిలో 15 విమాన ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 318 మంది ప్రాణాలు కోల్పోయారు. విమాన ప్రమాదాల్లో 50 శాతం ప్రమాదాలకు ప్రధాన కారణంగా పైలట్లే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి పైలట్లు అనుభవిస్తున్న అలసటే కారణమని అంటున్నారు. ఇక, 20 శాతం ప్రమాదాలకు విమాన సాంకేతిక లోపాలే కారణమని అంటున్నారు. 2018 తర్వాత 2024లోనే విమాన ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి.ఐదు కారణాలు ఇవే..పైలట్ల లోపాలు.. 50 శాతంసాంకేతిక లోపాలు.. 20 శాతంపిడుగులు, తుఫాన్లు, బ్యాడ్ వెదర్.. 15 శాతంటెర్రరిజం, మిస్సైల్ దాడులు.. 5 శాతం ఇతర ప్రమాదాలు.. 10 శాతందీనికి సంబంధించిన పలు కారణాలు విశ్లేషణతో ఈ వీడియోలో.. -
179 మంది మృతి..‘నాదే పూర్తి బాధ్యత’
దక్షిణ కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయం(Muan International Airport)లో జరిగిన జెజు ఎయిర్ విమాన ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి బాధ్యత తీసుకుంటానని సంస్థ సీఈఓ కిమ్ ఇబే తెలిపారు. దక్షిణ కొరియాలో ఆదివారం జరిగిన విమాన ప్రమాదంలో 179 మంది మృతి చెందారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. విమానం ల్యాండింగ్ గేర్ వైఫల్యం అవ్వడంతో రన్‌వేపై జారుతూ ఎయిర్పోర్ట్ రక్షణ గోడను ఢీకొట్టి ఈ ప్రమాదం జరినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై జెజు ఎయిర్(Jeju Air) సీఈఓ స్పందిస్తూ కారణంతో సంబంధం లేకుండా పూర్తి బాధ్యత వహిస్తారని తెలిపారు.థాయ్‌లాండ్ నుంచి 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో దక్షిణ కొరియాలోని సియోల్‌కు 290 కిలోమీటర్ల దూరంలోని ముయాన్కు జెజు ఎయిర్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్(Aircraft) ఆదివారం బయలుదేరింది. ఉదయం 9 గంటల సమయంలో ముయాన్ ఎయిర్‌పోర్ట్‌లో దిగుతుండగా విమానం ముందు భాగంలోని ల్యాండింగ్ గేర్ తెరుచుకోలేదు. అప్పటికే ల్యాండింగ్‌కు ముందు ఏటీసీ నుంచి పైలట్లకు ‘బర్డ్స్ట్రైక్’ వార్నింగ్ ఇచ్చారు. కానీ అప్పిటికే పరిస్థితి చేదాటిపోయిందని పైలట్ సిగ్నల్ పంపించారు. విమానం ముందు భాగంలోని ల్యాండింగ్ గేర్ వైఫల్యంతో రన్‌వేపై జారుతూ వెళ్లిన విమానం ఎయిర్పోర్ట్ రక్షణ గోడను ఢీకొని క్షణాల్లో మంటలు అంటుకుని పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు.ఇదీ చదవండి: యాపిల్ ఐఫోన్ 14, ఎస్ఈ నిలిపివేత..కారణం..ఘటనపై జెజు ఎయిర్ సీఈఓ కిమ్ ఇబే స్పందిస్తూ..‘ఈ విషాదకరమైన సంఘటన తీవ్రంగా కలచివేసింది. కారణంతో సంబంధం లేకుండా, ఘటనకు నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రమాదంపై చేపడుతున్న విచారణకు అన్నివిధాలా సహకారం అందిస్తాం’ అని చెప్పారు. ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి దర్యాప్తు కొనసాగుతోంది. -
హర్యానా గవర్నర్‌కు త్రుటిలో తప్పిన ముప్పు
విమానం టేకాఫ్ అవుతుండగా పొగలు చండీగఢ్: హర్యానా గవర్నర్ జగన్నాథ్ పహాడియాకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో టేకాఫ్ అయ్యే సమయంలో సాంకేతిక సమస్య ఏర్పడటంతో అత్యవసరంగా దించేశారు. దీంతో గవర్నర్‌తో పాటు పది మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ సమయంలో విమానంలో ఇద్దరు సిబ్బంది కాక గవర్నర్ పహాడియా, ఆయన భార్య శాంతి, ఇద్దరు ఏడీసీలు, ఓ డాక్టర్, ఓ సహాయకుడుతో పాటు ఎనిమిది మంది ఉన్నారు. గురువారం ఉదయం 11.37 గంటలకు గవర్నర్ పహాడియా ఛండీగఢ్ నుంచి ఢిల్లీకి రాష్ట్ర ప్రభుత్వ విమానంలో బయలుదేరారు. విమానం 30 అడుగుల ఎత్తుకు వెళ్లిన తర్వాత ఇంజిన్ నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన పైలట్ విమానాన్ని రన్‌వే సమీపంలో అత్యవసరంగా దించేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న వైమానికదళ అధికారులు గవర్నర్‌ను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పైలట్ వింగ్ కమాండర్ బీ నందా వెల్లడించారు.