వేగం పెంచి మరీ కూల్చేశాడు! | flight crash due to high speed | Sakshi
Sakshi News home page

వేగం పెంచి మరీ కూల్చేశాడు!

Published Sat, Apr 4 2015 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 11:48 PM

వేగం పెంచి మరీ కూల్చేశాడు!

వేగం పెంచి మరీ కూల్చేశాడు!

పారిస్: ఫ్రాన్స్‌లో జర్మన్‌వింగ్స్ విమానాన్ని కూల్చేసిన కో-పైలట్  లూబిట్జ్.. విమానాన్ని కూల్చేసేందుకు పదే పదే వేగాన్ని పెంచినట్లు ఫ్రాన్స్‌కు చెందిన విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ బీఈఏ  తెలిపింది. ప్రమాద ప్రాంతంలో గురువారం దొరికిన ఆ విమానపు రెండో బ్లాక్ బాక్స్‌లో నమోదైన సమాచారం ఈ విషయాన్ని స్పష్టంచేస్తోందని తెలిపింది. కో-పైలటే విమానాన్ని కావాలని కూల్చేసినట్లు తొలి బ్లాక్‌బాక్స్ సంభాషణల ద్వారా తెలియగా ఈ అనుమానాలకు తాజాగా రెండో బ్లాక్ బాక్స్‌లో లభ్యమైన సాంకేతిక సమాచారం బలం చేకూరుస్తోందని బీఈఏ పేర్కొంది. కో-పైలట్ ఆటోమాటిక్ పైలట్ వ్యవస్థను నియంత్రిస్తూ విమానాన్ని నేల దిశగా వేగంగా ప్రయాణించేలా చేశాడంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement