co-pilot
-
Ratan Tata: వ్యాపారవేత్తే కాదు.. యుద్ద విమానాలు నడిపిన పైలట్ కూడా!
దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మరణం ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేసింది. బుధవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా వ్యాపారవేత్తగానే కాకుండా, గొప్ప మానవతావాదిగా.. ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తిగా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అయితే రతన్‌కు వైమానిక రంగంపై కూడా ఆసక్తి ఎక్కువే. ఆయన హెలికాప్టర్లు, విమానాలు నడిపే ఓ మంచి పైలట్ కూడా. వీటిని నడిపేందుకు లైసెన్స్ కూడా ఉంది.2007లో ఆయనకు ఏకంగా యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం వచ్చింది. 69 ఏళ్ల వయసులో ఫైటర్ జెట్‌ను నడిపి రికార్డు సృష్టించారు. 2007లో బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా షోలో అమెరికా రక్షణ రంగ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ F-16 ఫైటర్ జెట్‌ను నడిపేందుకు ఆహ్వానం వచ్చింది. దీంతో రతన్ టాటా తొలిసారిగా యుద్ధ విమానాన్ని నడిపారు. అనుభవజ్ఞుడైన అమెరికా పైలట్ మార్గదర్శకత్వంలో కోపైలట్ రతన్ టాటా ఎఫ్-16లో గాల్లో దూసుకుపోయారు. దాదాపు అరగంట పాటు పూర్తిస్థాయిలో పైలట్‌గా విమానాన్ని నియంత్రిస్తూ ఎంజాయ్ చేశారు.ఈ సమయంలో పైలట్ సాయంతో కొన్ని విన్యాసాలు కూడా చేశారు. ఓ సందర్భంలో వీరి విమానం భూమికి కేవలం 500 అడుగుల ఎత్తులో 600 నాట్స్ వేగంతో దూసుకుపోయింది. ఆయనకు ఓ రెప్లికాను కూడా లాక్హిడ్ గిఫ్ట్‌గా ఇచ్చింది. యుద్ధ విమానం నడపడం ఒళ్లు గగుర్పొడిచే అనుభవం అని ఆయన ఆ తరువాత మీడియాకు తెలిపారు. అంతేగాక యుద్ధ విమానం నడుపుతూ రతన్ టాటా ఎంతో థ్రిల్ అయ్యారని ఆయనను గైడ చేసిన లాక్‌హీడ్ మార్టిన్ పైలట్ కూడా చెప్పుకొచ్చారు.అయితే, ఎఫ్-16ను నడిపిన మరుసటి రోజే రతన్ టాటా మరో యుద్ధ విమానంలో విహరించారు. ఎఫ్-16 కంటే శక్తిమంతమైన బోయింగ్ సంస్థకు చెందిన ఎఫ్ -18 హార్నెట్ యుద్ధ విమానంలో ఆయన గగనతలంలో విహరించారు. అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ కార్యకలాపాలకు ఎఫ్ - 18 అప్పట్లో కీలకంగా ఉండేది. వైమానిక రంగంపై విశేషాసక్తి కనబరిచే రతన్ టాటాకు వరుసగా రెండుసార్లు యుద్ధ విమానాల్లో విహరించే అవకాశం రావడంతో తన కల నేరవేరినట్టు భావించారట. ఇదిలా ఉండగా దాదాపు 69 ఏళ్ల తర్వాత విమానయాన సంస్థ ఎయిరిండియా తిరిగి రతన్ టాటా హయాంలోనే మాతృ సంస్థకు చేరుకొన్న విషయం తెలిసిందే. -
కాక్‌పిట్‌లోకి గర్ల్‌ఫ్రెండ్.. వరుస వివాదాల్లో ఎయిరిండియా!
ప్రముఖ దేశీయ ఏవియేషన్ దిగ్గజం ఎయిరిండియా (airindia) వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. మధ్యం మత్తులో ప్రయాణంలో తోటి ప్రయాణికులపై తప్పతాగి మూత్రం పోయడం, ఒకరినొకరు కొట్టుకోవడం,కాక్‌పిట్‌లో స్నేహితురాలిని ఆహ్వానించడం వంటి ఘటనలతో తరచు వార్తల్లో కెక్కుతుంది. తాజాగా, గత వారం ఎయిరిండియా విమానానికి చెందిన ఇద్దరు పైలెట్లు తన స్నేహితురాలని కాక్‌పిట్‌లోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఎయిరిండియాకు చెందిన ఏఐ-445 విమానం ఢిల్లీ నుంచి లేహ్‌కు (లద్దాఖ్) వెళ్లిన విమానంలో పైలెట్, కో-పైలెట్ తన స్నేహితురాల్ని కాక్‌పిట్(cockpit)లో కూర్చోబెట్టుకున్నారు. అయితే, ఎంత సేపు కాక్‌పిట్‌లో ఉన్నారనే అంశంపై స్పష్టత రాలేదు. ఈ ఘటనపై క్యాబిన్ క్రూ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో ఎయిరిండియా యాజమాన్యం ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మరోవైపు, దీనిపై డీజీసీఏ స్పందించింది. నియమ నింబంధనల్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఎయిరిండియా విచారణ నిమిత్తం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశంపై ఎయిరిండియా అధికారిక ప్రకటన చేయలేదు. దేశంలో అత్యంత సున్నిత ప్రాంతమైన లేహ్ వైమానిక మార్గం అత్యంత సున్నితమైంది. క్లిష్టమైనది. ఈ మార్గంలో ప్రయాణించే విమానంలో పైలట్లు నిబంధనలను ఉల్లంఘించడంపై వైమానిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. ఫిబ్రవరి 27న దుబాయ్ నుంచి ఢిల్లీ మార్గంలో ఎయిర్ ఇండియా విమానం ఏ1-915 కాక్‌పిట్‌లోకి తన మహిళా స్నేహితురాలిని స్వాగతించిన ఎయిర్ ఇండియా పైలట్ లైసెన్స్‌ను డీజీసీఏ సస్పెండ్ చేసింది. కాక్‌పిట్ ఉల్లంఘన ఘటనలో సత్వర, సమర్థవంతమైన చర్య తీసుకోలేదని ఆరోపించినందుకు డీజీసీఏ ఎయిరిండియాకు రూ. 30 లక్షల జరిమానా విధించింది. ఇదీ చదవండి : వాట్సాప్ చాట్ విడుదల, మూత్ర విసర్జన ఘటనలో శంకర్ మిశ్రాను ఇరికించారా? -
నేపాల్ విమాన ఘటన: కోపైలట్ విషాద గాథ..నాడు భర్తలాగే భార్య కూడా..
నేపాల్ విమాన ప్రమాద ఘటన ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడక పోవడం అందర్నీ తీవ్రంగా కలిచి వేసింది. ఐతే ఈ ఘటనలో చనిపోయిన కో పైలెట్ అంజు ఖతివాడ విషాద గాథ అందర్నీ కంటతడి పెట్టేలా చేసింది. ఆమె 2006లో పైలట్ అయిన తన భర్తను ఇదే విమాన ప్రమాదంలో పోగొట్టకుంది. అయినా ఆ బాధను దిగమింగుకుని తన భర్త మాదిరిగా పైలట్ అవ్వాలని 2010లో ఎయిర్‌లైన్స్‌లో చేరింది. అందుకోసం ఎంతో ప్రయాసపడి ఏదోలా కో పైలట్ ఉద్యోగం సాధించింది. ఇంకా కొద్దిగంటల్లో పైలట్ అయిపోతుంది అనంగా ఈ ఘోర ప్రమాదం బారినపడింది. వాస్తవానికి నేపాల్ నిబంధనల ప్రకారం కోపైలట్ పైలట్ అవ్వాలంటే సుమారు 100 గంటల పాటు విమానాన్ని నడిపిన అనుభవం ఉండాలి. అందులో భాగంగా ఈ ప్రమాదం జరిగిన యతి ఎయిర్‌లైన్స్ విమానంలో పయనించింది. ఈ మేరకు 72 మంది ప్రయాణికులతో వెళ్తున్న యతి ఎయిర్‌లైన్స్ ఏటీఆర్ 72 విమానానికి కమల్ కేసీ పైలట్‌గా ఉండగా..అంజు ఖతివాడ కో పైలట్‌గా వ్యవహరించారు. అంతేగాదు అంజుకి కోపైలట్‌గా ఇది చివరి విమానం. ఇప్పటివరకు అంజు నేపాల్‌లో ఉన్న అన్ని ఎయిర్‌పోర్ట్‌లో కోపైలట్‌గా.. విజయవంతంగా అన్ని విమానాలను ల్యాండ్ చేశారు. ఇంకొద్దిసేపులో తన కల నెరవేరుతుందనంగా విధికి ఆమెపై కన్నుకుట్టిందేమో! తెలియదుగానీ ఆమె కలల్ని కల్లలు చేస్తూ..ఆమెను చిదిమేసింది. నాడు అంజు భర్త 16 ఏళ్ల క్రితం ఇదే యతి ఎయిర్‌లైన్స్‌లో కోపైలట్ విధులు నిర్వర్తిస్తూ..ఎలాగైతే మరణించారో ఆమె కూడ అలానే మరణించడం బాధకరం. అంజు భర్త 2006లో కోపైలట్‌గా యతి ఎయిర్‌లైన్స్ విమానంలో ఉండగా.. నేపాల్‌గంజ్ నుంచి జుమ్లా వెళ్తుండగా జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందారు. నాడు భర్త లాగే..నేడు భార్యను కూడా విధి తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. ఐతే ఈ ఘటనలో పైలట్ కమల్ కేసి మృతదేహాన్ని గుర్తించామని, కానీ కోపైలట్ అంజు మృతదేహనికి సంబంధించిన అవశేషాలను ఇంకా గుర్తించలేదని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా తెలిపారు. ఇదిలా ఉండగా, ఆదివారం నేపాల్ యతి ఎయిర్‌లైన్స్ ఏటీఆర్-72 విమానం దుర్ఘటనలో విమానం కూలిపోవడానికి కొద్ది క్షణాల ముందు అటు ఇట్లు దొర్లినట్లు ప్రత్యక్ష సాక్షలు చెబుతున్నారు. అలాగే విమానంలోని కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్, స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇవి క్రాష్ కావడానికి కారణమేమిటో గుర్తించడంలో సహాయపడవచ్చునని చెబుతున్నారు. (చదవండి: వీధి కుక్కులకి ఆహారం పెడుతుండగా..ర్యాష్‌గా దూసుకొచ్చిన కారు) -
సింధు ‘తేజస్’ విహారం
సాక్షి, బెంగళూరు: భారత బ్యాడ్మింటన్ స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి పీవీ సింధు ‘ఏరో ఇండియా’ వైమానిక ప్రదర్శనలో సందడి చేసింది. తేజస్‌కు కో పైలెట్‌గా గగన విహారం చేసింది. ఇక్కడి యలహంక ఎయిర్‌బేస్ స్టేషన్లో ఈ వైమానిక ప్రదర్శన జరుగుతోంది. ఇందులో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కాక్‌పిట్‌లో కెప్టెన్ సిద్ధార్థ్ సింగ్‌తో కలిసి సింధు కో పైలెట్‌గా విమానాన్ని నడిపింది. ఇలా తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో కో పైలెట్‌గా విహరించిన తొలి మహిళగా ఆమె ఘనతకెక్కింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తేజస్‌లో విహరించడం ఎంతో గర్వంగా ఉందని చెప్పింది. వైమానిక రంగంలో మహిళలు సాధించిన ఘనతలు అమోఘమని కొనియాడింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ యుద్ధ విమానం ఇటీవలే వాయుసేనలో చేరింది. గురువారం ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కూడా తేజస్‌ను నడిపి చూశారు. -
నచ్చిన మహిళా కో పైలెట్ కోసం పట్టు..
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా పైలట్ల తీరు మారడం లేదు. ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా, ఎంతమందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నా పైలట్లు మాత్రం విధి నిర్వహణలో తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఓ పైలట్ తన డిమాండ్ కోసం 110 మంది ప్రయాణీకులను సుమారు రెండు గంటలపాటు విమానంలో వేచి చూడాల్సిన పరిస్థితి కల్పించాడు. అసలు విషయానికి వస్తే... తనకు నచ్చిన మహిళా పైలట్‌ను కో-పైలట్‌గా ఇవ్వలేదన్న కారణంతో ఈ చర్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఉదయం ఏడు గంటలకు బయలుదేరాల్సిన విమానం తొమ్మిది గంటల తర్వాత బయలుదేరింది. పైలట్ మంకుపట్టుతో ఎయిర్ ఇండియా విమానంలో 110 మంది ప్రయాణీకులు రెండున్నర గంటలపాటు బలవంతంగా కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. దీంతో మాలే నుంచి చెన్నై మీదగా తిరువనంతపురం వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో ఈ సంఘటన జరిగింది. ప్రత్యేకంగా తాను కోరిన మహిళా కో పైలట్‌నే Al 263/264 విమానంలో తనతోపాటు విధులకు పంపించాలంటూ పైలట్ పట్టుబట్టడంతో అసలు గొడవ ప్రారంభమైంది. అయితే ఆమె అప్పటికే ఢిల్లీ ఫ్లైట్‌కు వెళ్ళాల్సిన రోస్టర్ లో ఉందని, అతడి డిమాండ్ తీర్చడం కుదరదని రోస్టర్ సెక్షన్ అధికారులు తేల్చి చెప్పారు. గురువారం ఉదయం విధులకు హాజరైన అతడు రోస్టర్ సెక్షన్ లో అదేతీరులో వ్యవహరించాడు. తనకు బీపీ పెరిగిందని, అనారోగ్యం పేరుతో కాలయాపన చేశాడు. అయితే అతడి ప్రయత్నం ఫలించకపోవటంతో...తాను కోరిన కో పైలట్‌ను పంపించనిదే విధులకు వెళ్లేది లేదంటూ తెగేసి చెప్పాడు. ఈ ఘటనతో ఉదయం ఏడు గంటలకు బయలుదేరాల్సిన విమానం తొమ్మిది గంటల తర్వాత బయలుదేరింది. కాగా ఇంత హంగామా చేసిన ఈ పైలట్ వారం క్రితం ఎయిర్ ఇండియాకు రాజీనామా చేసి, ప్రస్తుతం నోటీసు కాలంలో పని చేయటం గమనార్హం. అయితే ఈ విషయంపై పూర్తి వివరణ ఇచ్చేందుకు వైమానిక ప్రతినిధులు ఎవ్వరూ అందుబాటులో లేరు. -
గాల్లో విమానం.. పైలెట్ చనిపోయాడు
సిరాకస్(అమెరికా): కొన్ని వేల అడుగుల ఎత్తులో విమానం ఎగురుతోంది. అది కూడా గమ్యస్థానానికి ఇంకా చాలా దూరంలో ఉంది. అనుకోకుండా పైలెట్‌కు అస్వస్థత.. కొద్ది సేపటికే మృతి. దీంతో తొలుత కంగారు పడిన కో పైలెట్ తిరిగి ధైర్యంగా వ్యవహరించి సురక్షితంగా విమానం దించేశాడు. అమెరికాకు చెందిన విమానం పైలెట్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై గాల్లోనే ప్రాణాలు విడిచాడు. దీంతో కో పైలెట్ జాగ్రత్తతో వ్యవహరించి ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా విమానాన్ని దించివేశాడు. అయితే, ఈ విషయం ముందుగా ప్రయాణీకులకు తెలియకుండా అతడు జాగ్రత్తపడటంతో ఓ భారీ ఆందోళన, భయానికి తావివ్వకుండా చేసినట్లయింది. ఆదివారం రాత్రి 11.55 గంటలకు అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం 550 ఫోనిక్స్ నుంచి బోస్టన్‌కు బయలు దేరింది. అయితే ప్రయాణం మధ్యలోనే పైలెట్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యి, ఆ వెంటనే ప్రాణాలుకోల్పోవడంతో వెంటనే విమానం బాధ్యతలు పూర్తి స్థాయిలో కో పైలెట్ తీసుకున్నాడు. మధ్యలోనే సిరాకస్కు చెందిన విమానాశ్రయ అధికారులను సంప్రదించి మెడికల్ ఎమర్జెన్సీ ఉందని, వెంటనే విమానాన్ని దించివేయాలనుకుంటున్నానని, అందుకు అనుమతివ్వాలని కోరాడు. దీంతోపాటు రన్ వే దగ్గరికి వెంటనే ఎమర్జెన్సీ అంబులెన్స్‌ను పంపించాలని కోరాడు. ఇందుకు సిరాకస్ అధికారులు అంగీకరించడంతో దానిని సోమవారం ఉదయం 7గంటల ప్రాంతంలో సురక్షితంగా దించివేశాడు. అలా దించిన తర్వాతనే పైలెట్ చనిపోయాడని, అందుకే విమానం అత్యవసరంగా దిగిందని, తోటి ప్రయాణీకులకు, సిరాకస్ విమానాశ్రయ అధికారులకు తెలిసింది. కో పైలెట్ నిర్వహించిన బాధ్యతలను విమానాశ్రయ అధికారులు మెచ్చుకోగా.. అందులోని ప్రయాణీకులు మాత్రం ఒక్క క్షణం గుండెలపై అమ్మో అని చేతులేసుకున్నారు. ఎయిర్ బస్ ఏ 320 ద్వారా ప్రయాణీకులను బోస్టన్ నగరానికి తరలించారు. ఇందులో మొత్తం 147మంది ప్రయాణీకులు ఉన్నారు. కాగా, కో పైలెట్ కూడా పైలెట్‌కు ఉండే సామర్థ్యతను కలిగి ఉంటాడని, అతడు ప్రమాదాలను నివారించగలడని అమెరికా ఎయిర్ లైన్స్ అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా ఎయిర్ లైన్స్‌లో ప్రయాణంలో ఉండగా ఏడుగురు పైలెట్లు, ఒక చార్టర్ పైలెట్ మరణించాడు. -
వేగం పెంచి మరీ కూల్చేశాడు!
పారిస్: ఫ్రాన్స్‌లో జర్మన్వింగ్స్ విమానాన్ని కూల్చేసిన కో-పైలట్ లూబిట్జ్.. విమానాన్ని కూల్చేసేందుకు పదే పదే వేగాన్ని పెంచినట్లు ఫ్రాన్స్‌కు చెందిన విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ బీఈఏ తెలిపింది. ప్రమాద ప్రాంతంలో గురువారం దొరికిన ఆ విమానపు రెండో బ్లాక్ బాక్స్‌లో నమోదైన సమాచారం ఈ విషయాన్ని స్పష్టంచేస్తోందని తెలిపింది. కో-పైలటే విమానాన్ని కావాలని కూల్చేసినట్లు తొలి బ్లాక్‌బాక్స్ సంభాషణల ద్వారా తెలియగా ఈ అనుమానాలకు తాజాగా రెండో బ్లాక్ బాక్స్‌లో లభ్యమైన సాంకేతిక సమాచారం బలం చేకూరుస్తోందని బీఈఏ పేర్కొంది. కో-పైలట్ ఆటోమాటిక్ పైలట్ వ్యవస్థను నియంత్రిస్తూ విమానాన్ని నేల దిశగా వేగంగా ప్రయాణించేలా చేశాడంది. -
'అతడికి డిప్రెషన్ ఉందని ముందే తెలుసు'
డసెల్డ్రాఫ్ : గత వారం ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్ పర్వాతాల్లో కుప్పకూలిన 'ఎయిర్ బస్ ఏ320' విమానాన్ని కో పైలట్ ఆండ్రియస్ లూబిట్జ్ తాను తీవ్రమైన డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు 2009లోనే లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ కు తెలిపాడు. ఈ విషయాన్ని ఆ కంపెనీ మంగళవారం వెల్లడించింది. డిప్రెషన్ కారణంగా కో పైలట్ కొన్ని రోజుల విరామం తర్వాత తన పరిస్థితిని కంపెనీకి మెయిల్ చేశాడు. ఈ మెయిల్ లో తాను తిరిగి కంపెనీలో ట్రెయినింగ్ ప్రోగ్రామ్‌కి జాయిన్ అవ్వాలనుకుంటున్నట్లు, వాటితో పాటు మానసిక స్థితికి సంబంధించిన డాక్యుమెంట్లు అటాచ్ చేశాడని సంస్థ పేర్కొంది. అతని మానసిక స్థితి తెలిసి కూడా ఎయిర్ లైన్స్ లూబిట్జ్ ని ట్రెయినింగ్ ప్రోగ్రామ్‌కి ఎలా అనుమతించిందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ట్రెయినింగ్ స్కూల్‌కి ఎంచుకునే వారి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మానసిక బలాన్ని కూడా పరిక్షిస్తారని లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కార్స్ పేర్కొన్నారు. లూబిట్జ్ అపార్ట్మెంట్ తనిఖీ చేసిన పోలీసులు ఓ విషయాన్ని తెలుసుకున్నారు. ఫ్లైట్ క్రాష్ అయిన రోజు లూబిట్జ్ ఆరోగ్యం బాగాలేదని అక్కడి డాక్యుమెంట్లలో గుర్తించారు. జర్మనీ ఛాన్స్లర్ ఎంజెలా మోర్కెల్‌తో సమావేశం అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్ హొలాండే మీడియాతో సమావేశమయ్యారు. వారాంతానికల్లా మృతులను గుర్తిస్తామన్నారు. కొందరు అధికారులు మాత్రం మరి కాస్త సమయం పట్టేందుకు అవకాశం ఉందని చెప్పారు. -
కిందకు పడిపోతున్నాం.. పడిపోతున్నాం : లూబిడ్జ్
పారిస్: ' ఏదో రోజు నేను ఏదో ఒక పనిచేస్తా! ఆ పని మొత్తం వ్యవస్థనే మార్చేస్తుంది. ఆరోజు యావత్ ప్రపంచ ప్రజానీకానికి నా పేరు తెలుస్తుంది. వారు నన్నెప్పటికీ మరిచిపోలేరు' అని జర్మనీ విమానాన్ని ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో ఉద్దేశపూర్వకంగా కూల్చేసిన కో పెలైట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ ఎప్పుడూ చెప్పేవాడని అతని మాజీ గర్ల్ ఫ్రెండ్ శుక్రవారం రాత్రి జర్మన్ మీడియాకు తెలియజేసింది. అతని ప్రవర్తన సక్రమంగా ఉండేది కాదని, రాత్రిళ్లు పీడకలలు భయపెట్టినట్టుగా హులిక్కిపడి నిద్రలేచి ' పడిపోతున్నాం. కిందకు పడిపోతున్నాం' అంటూ అరిచేవాడని ఆమె చెప్పారు. విమానం కూలిపోయిన వార్త తెలిసేంతవరకు అతని మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటో తనకు అర్థం కాలేదని ఆమె అన్నారు. తాను మానసిక వ్యాధితో బాధ పడుతున్నట్టు లూబిడ్జ్ తనకు ఎన్నడూ చెప్పలేదని, తానే తన అనుచిత ప్రవర్తనకు విసిగిపోయి అతన్ని వదిలేశానని ఆమె జర్మన్ వార్తా పత్రిక 'బ్లిండ్' కు వివరించారు. చట్ట నిబంధనల మేరకు ఆమె పేరును, పూర్తి వివరాలను ఆ పత్రిక వెల్లడించలేదు. డసెల్డార్ఫ్ శివారులోని ఓ ఇంట్లో లూబిడ్జ్తో కలిసి అతని గర్ల్ ఫ్రెండ్ ఏడేళ్లపాటు సహజీవనం చేసింది. వచ్చే ఏడాది వారిద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇంతలోనే వారు విడిపోయారు. లూబిడ్జ్ ప్రవర్తన గురించి క్షున్నంగా తెలసుకునేందుకు అతని గర్ల్ ఫ్రెండ్‌ను జర్మనీ పోలీసులు సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మరిన్ని వివరాలు వెలుగులోకి రావచ్చు. -
గర్ల్ ఫ్రెండ్ కాదనడంతో.. విమానం కూల్చేశాడు!!
ఆ కో-పైలట్ ఓ మానసిక రోగి ముందురోజు వరకు కౌన్సెలింగ్ గతంలోనూ సైకో థెరపీ తీసుకున్నాడు జర్మనీ వార్తాపత్రిక 'బిల్డ్' వెల్లడి పారిస్: ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్సా పర్వతాల్లో 'ఎయిర్‌బస్ ఏ-320' విమానాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చేసి 150 మందిని పొట్టన పెట్టుకున్న జర్మనీ వింగ్స్ కో-పైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ మానసిక రోగి అని, విమానాన్ని కూల్చేసిన రోజు వరకు కూడా మానసిక వ్యాధికి కౌన్సెలింగ్ తీసుకున్నాడని ప్రముఖ జర్మనీ వార్తా పత్రిక 'బిల్డ్' శుక్రవారం వెల్లడించింది. బాత్రూమ్కు వెళ్లిన పైలట్‌ను తిరిగి కాక్‌పిట్‌లోకి రాకుండా క్యాబిన్ డోర్‌ను లాక్ చేసి విమానాన్ని తలకిందులుగా తీసుకెళ్లి పర్వతాల్లో కో-పైలట్ లూబిడ్జ్ కూల్చేసినట్టు గురువారం ఫ్రెంచ్ ప్రాసిక్యూటర్ వెల్లడించిన విషయం తెల్సిందే. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలనుకున్న గర్ల్ ఫ్రెండ్, రెండు వారాల క్రితం అభిప్రాయ భేదాలొచ్చి తనతో విడిపోయిందని, అప్పటి నుంచి ఆయన మానసిక జబ్బు మళ్లీ తిరగతోడిందని, అందుకోసం సైకో థెరపీ కింద కౌన్సెలింగ్ తీసుకుంటూ వచ్చాడని ఆ పత్రిక పేర్కొంది. తీవ్ర మనస్తాపంతో రగిలిపోతున్న టూబిడ్జ్ విమానాన్ని కూల్చేయడం ద్వారా ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపింది. 28 ఏళ్ల లూబిడ్జ్ 2008లో పైలట్ శిక్షణ సందర్భంగా కొన్ని నెలలపాటు సెలవు తీసుకొని మానసిక జబ్బుకు సైకో థెరపి తీసుకున్న విషయం కూడా ఈరోజే వెలుగులోకి వచ్చింది. విమాన ప్రమాద సంఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్న పోలీసు అధికారుల బృందం గురువారం నాడు నాలుగు గంటలపాటు మోంటబార్‌లోని కో-పైలట్ లూబిడ్జ్ ఫ్లాట్‌ను శోధించగా ఓ గర్ల్ ఫ్రెండ్‌తో వ్యవహారం ఉన్నట్టు, మానసిక వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. పైలట్ శిక్షణ సందర్బంగా కొన్ని నెలలపాటు లూబిడ్జ్ సెలవుపై వెళ్లినట్టు ధ్రువీకరించిన లుఫ్తాన్సా విమానయాన సంస్థ హెడ్ కార్స్టెన్ స్పార్.. అతడి మానసిక వ్యాధి విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. లుఫ్తాన్సా విమానయాన సంస్థ తరపున అమెరికాలోని ఆరిజోనాలో పైలట్ శిక్షణ పొందిన లూబిడ్జ్ ఏకంగా ఏడాది పాటు మానసిక వ్యాధికి సైకో థెరపీ తీసుకున్నాడని తెల్సింది. అయితే అన్ని పరీక్షలతోపాటు, మానసిక పరీక్షల్లో కూడా ఉత్తీర్ణుడయ్యాకే ఆయన్ని పైలట్‌గా ఎంపిక చేశామని కార్స్టెన్ స్పార్ తెలిపారు. లూబిడ్జ్ నివాసంలో దొరికిన పత్రాల ప్రకారం విమాన ప్రమాదం జరిగిన ముందు రోజు వరకు కూడా మానసిక వ్యాధికి కో-పైలట్ కౌన్సెలింగ్ తీసుకుంటూ వచ్చాడు. విమానం ఎక్కే సందర్భాల్లో కూడా డాక్టర్ సలహా తీసుకున్నాకే విమానాన్ని నడపాల్సి ఉంటుందని కూడా ఆయనకు వైద్యం చేస్తున్న సైకాలజిస్ట్ సూచించారు. 'ఓ పాఠశాల లేదా సైనిక క్యాంప్‌పై దాడిచేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఎంతో మంది ప్రాణాలుతీసి తాను ఆత్మహత్య చేసుకునే మానసిక వ్యాధిగ్రస్థుడిలాగా లూబిడ్జ్ ప్రవర్తన కనిపిస్తోంది' అని బర్మింగ్ హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ సైకాలాజీ ప్రొఫెసర్ క్రేగ్ జాక్సన్ వ్యాఖ్యానించారు. -
కో-పైలెట్ తెచ్చిన విషాదం
ఆపద చెప్పిరాదు. దానికి ఒక రూపమంటూ ఉండదు. ఎక్కడ పొంచి వుంటుందో కూడా ఎవరూ అంచనా వేయలేరు. మంగళవారం స్పెయిన్ నుంచి జర్మనీ వెళ్తున్న ఎయిర్‌బస్-ఏ320 విమానం ఉన్నట్టుండి ఆల్ప్స్ మంచు పర్వత శ్రేణిలో కూలిపోవడం, ఆరుగురు విమాన సిబ్బందితోపాటు 144మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం అందరినీ దిగ్బ్రాంతిపరిచింది. జర్మనీకి చెందిన లుఫ్తాన్సా సంస్థకు అనుబంధంగా కొనసాగుతున్న జర్మన్‌వింగ్స్‌కు చెందిన ఈ విమానం ప్రమాదానికి లోనైన తీరుపై తాజాగా వెలువడుతున్న కథనాలు మరింత దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ప్రమాదస్థలిలో లభ్యమైన విమానం బ్లాక్‌బాక్స్‌ను విశ్లేషించిన నిపుణులు కో-పెలైట్ ఉద్దేశపూర్వకంగా దాన్ని కూల్చివేశాడని ప్రాథమికంగా నిర్ధారణకొస్తున్నారు. ప్రధాన పెలైట్ పాట్రిక్ సాండర్హీమర్ కాక్పిట్నుంచి బయటికొచ్చాక కో-పెలైట్ ఆండ్రియాస్ లుబిడ్స్ తలుపులు బిగించుకుని 25,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానాన్ని పర్వత శ్రేణి ప్రాంతంలో హఠాత్తుగా కిందకు దించాడన్నది వారి భావన. అది కిందికి దిగుతుండగా ఆందోళనకు లోనైన ప్రధాన పెలైట్ పదే పదే తలుపు తట్టడం, కోపెలైట్ నుంచి ఎలాంటి జవాబూ రాకపోవడం బ్లాక్ బాక్స్‌లో నమోదైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది సైతం అప్రమత్తంగా ఉండి వెనువెంటనే పంపిన అత్యవసర సందేశాలకు కూడా కో-పెలైట్ స్పందించకపోవడం బ్లాక్‌బాక్స్ రికార్డు చేసింది. పెలైట్ అచేతన స్థితిలో ఉన్నప్పుడు కాక్‌పిట్‌ను తెరవడానికి తోడ్పడే అత్యవసర కోడ్ వ్యవస్థను కూడా కో-పెలైట్ ధ్వంసంచేశాడని బ్లాక్‌బాక్స్ విశ్లేషణ నిర్ధారిస్తున్నది. ఇంతకూ కో-పెలైట్ లుబిడ్స్ ప్రమాదకర ప్రవర్తనకు కారణమేమిటి? అతనిపై ఉగ్రవాద సిద్ధాంతాల ప్రభావం ఏమైనా ఉందా? కుటుంబ పరిస్థితులు లేదా విధి నిర్వహణకు సంబంధించిన సమస్యలతో అతనేమైనా మానసికంగా దెబ్బతిని ఉన్నాడా? ఒకవేళ ఆత్మహత్యే చేసుకోదల్చుకుంటే తనతోపాటు అంత మంది ప్రాణాలను ఎందుకు హరించాలనుకున్నాడు? దర్యాప్తు చేస్తున్న అధికారులకు వీటిపై స్పష్టమైన సమాధానాలు ఇంతవరకూ లభించలేదు. అనారోగ్యానికి సంబంధించి వైద్య చికిత్స పొందుతున్నట్టు తెలిపే కొన్ని కాగితాలు మాత్రం లుబిడ్స్ ఇంట్లో దొరికాయంటున్నారు. ప్రపంచంలో అంతకంతకూ ఉగ్రవాద ముప్పు పెరగడంతో విమానయాన సంస్థలు, ప్రభుత్వాలు రకరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. విమానాశ్రయాల్లో వాడే తనిఖీ వ్యవస్థను పెంచడం, అందుకోసం అత్యున్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకలోకి తీసుకురావడం అందులో ఒకటి. అలాగే, విమానాన్ని నడపడంలో పెలైట్‌కు సమర్థవంతంగా తోడ్పడగల పరిజ్ఞానం కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రత్యేకించి ఎయిర్ బస్ ఏ-320లో ఇందుకు సంబంధించిన ఆధునాతన వ్యవస్థ ఉన్నదంటున్నారు. ఇవన్నీ విమాన ప్రయాణాన్ని సాపేక్షంగా అత్యంత సురక్షితం చేశాయి. విమానగమనాన్ని, దాని తీరుతెన్నులను నిర్దేశించే మెకానికల్, హైడ్రో మెకానికల్ నియంత్రిత వ్యవస్థల స్థానంలో ఇప్పుడు ‘ఫ్లై బై వైర్’ వ్యవస్థ అందు బాటులోకొచ్చింది. పెలైట్ ఒక కమాండ్ ఇచ్చినప్పుడు దానికి అనుగుణంగా జరగాల్సిన మార్పులన్నీ వాటికవే చోటుచేసుకోవడం...విమాన గమనంలో ఇబ్బందులేమైనా ఉన్న పక్షంలో సెన్సర్ల సాయంతో గుర్తించి సరిచేయడం ఈ కొత్త వ్యవస్థ విశిష్టత. అత్యంత వేగంగా, ఏకకాలంలో అనేక పనులను పూర్తి చేయగల ఈ సంక్లిష్ట సాంకేతిక వ్యవస్థ వల్ల పెలైట్‌కు చాలావరకూ శ్రమ తగ్గింది. అయితే, ఇదే సమయంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తెచ్చిన సమస్యలను నిపుణులు ఏకరువు పెడతారు. ఇది పెలైట్ను యాంత్రికంగా మారుస్తున్నదని, ఆలోచించవలసిన అవసరాన్ని చాలావరకూ తగ్గిస్తున్నదని వారంటారు. దీనివల్ల పెలైట్ లో నైపుణ్యం అవసరమైనంతగా పెరగడం లేదని చెబుతారు. అయితే పెలైట్ స్థానంలో ఉండే వ్యక్తి భావోద్వేగ స్థితిగతులు సక్రమంగా లేనప్పుడు... అతనికి దురుద్దేశాలు ఉన్నప్పుడు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానమైనా నిరుపయోగం అవుతుంది. బయటినుంచి కాక్‌పిట్ తలుపు తెరవగల అత్యవసర కోడ్ సదుపాయం కూలిన విమానంలో ఉన్నా కో-పెలైట్ చర్యవల్ల అది నిరర్ధకమైంది. ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని ఊహించడంవల్ల కాక్‌పిట్‌లో నిరంతరం ఇద్దరు పెలైట్లు ఉండాలని అమెరికా విమానయాన నిబంధనలను సవరించారు. తాజా విమాన ప్రమాదం తర్వాత ప్రపంచంలోని అన్ని విమానయాన సంస్థలూ ఈ నిబంధనను తప్పనిసరి చేస్తున్నాయి. అయితే, ఆ ఇద్దరూ ఏకమై ఏ ఉపద్రవానికైనా ఒడిగట్టే అవకాశం లేకపోలేదు. కనుక హఠాత్తుగా ఏ పెలైట్ అయినా అసాధారణ రీతిలో కమాండ్లు ఇచ్చినప్పుడు వాటిని స్వీకరించకుండా నిరోధించడంవంటి ఏర్పాట్లు ఉండాలని భద్రతా నిపుణులు గతంలో సూచించారు. అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అత్యవసర పరిస్థితుల్లో విమానగమనాన్ని సరిచేయగల నియంత్రిత వ్యవస్థ అందుబాటులో ఉంచడం అవసరమని వారు ప్రతిపాదించారు. ఇదిగాక ఫ్లైట్ డేటాను ఎప్పటికప్పుడు గమనిస్తూ కాక్‌పిట్‌లో అసాధారణ కార్యకలాపాలు చోటు చేసుకున్నప్పుడు వాటి స్వభావాన్ని మదింపువేసి అప్రమత్తం చేయగల సాఫ్ట్వేర్ రూపకల్పన తుది దశకు చేరుకున్నదంటున్నారు. దీంతోపాటు పెలైట్లతో ప్రమేయం లేకుండా విమానాన్ని పూర్తిగా అదుపు చేయగలిగే పరిజ్ఞానం కూడా దాదాపు సాధించారంటున్నారు. అయితే, ఎలాంటి పరిజ్ఞానమైనా దురుద్దేశంతో వ్యవహరించదల్చుకున్నవారిని పూర్తిగా నియంత్రించగలదనుకోవడం, నిరోధించ గలదనుకోవడం అత్యాశే. కుటుంబం, సమాజం అప్రమత్తంగా మెలిగే పరిస్థితులే అంతిమంగా భద్రతకు గ్యారెంటీ ఇస్తాయి. -
ట్రైనింగ్‌లో లూబిడ్జ్ ఎక్కడికెళ్లాడు?
పారిస్: ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో జర్మనీ విమానం 'ఎయిర్ బస్ ఏ320' విమానాన్ని కోపైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ ఉద్దేశపూర్వకంగానే కూల్చివేశారని తేలిపోవడంతో అతని ఉద్దేశం వెనుక కారణాలేమిటనే అంశంపైనే ప్రస్తుతం దర్యాప్తు కేంద్రీకృతమైంది. లుఫ్తాన్సా విమానయాన సంస్థ తరఫున అమెరికాలోని ఆరిజోనాలో పెలైట్ శిక్షణ పొందిన కోపైలట్ తన శిక్షణ కాలంలో కొన్ని నెలలపాటు శిక్షణకు గైర్హాజరయ్యాడన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎందుకు లూబిడ్జ్ గైర్హాజరయ్యాడన్న అంశం తేలితే విమానం ప్రమాదం మిస్టరీ వీడిపోయే అవకాశం ఉందని లుఫ్తాన్సా విమానయాన సంస్థ ఉన్నతాధికారి కార్స్టెన్ స్పార్ తెలిపారు. పైలట్ శిక్షణ సందర్భంగా సాధారణంగా ఎవరికి లాంగ్ లీవ్ ఇవ్వరని, సిక్ లీవ్ మాత్రం ఇస్తారని ఆయన చెప్పారు. లూబిడ్జ్ సిక్ లీవ్‌పై వెళ్లాడా, లేదా, వెళితే అతని అనారోగ్యానికి కారణాలేమిటో కూపీ లాగాల్సి ఉందని ఆయన అన్నారు. పైలట్ శిక్షణ కేంద్రం నిబంధనలు, జర్మన్ చట్టాల ప్రకారం శిక్షణ పొందుతున్న పైలట్ల సెలవులకు కారణాలు బయటకు వెల్లడించరని, కోర్టు కోరితే తెలపవచ్చని ఆయన తెలిపారు. 2001, సెప్టెంబర్11వ తేదీన అమెరికాలోని పెంటగాన్‌పై హైజాక్ చేసిన విమానంతో దాడి జరిపిన టైస్టు కూడా ఆరిజోనాలోనే పైలట్ శిక్షణ పొందిన విషయం ఇక్కడ గమనార్హం. ఎయిర్‌బస్ విమానాన్ని కోపైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ ఆల్ఫ్స్ పర్వతాలపైకి మళ్లించడం, హఠాత్తుగా విమానాన్ని తలకిందులుగా అతివేగంతో కిందకు తీసుకెళ్లి రాళ్లకు ఢీ కొట్టించడం ఉద్దేశపూర్వకంగా జరిగినట్టు బ్లాక్‌బాక్స్ సందేశాల ద్వారా కనుక్కొన్న విషయం తెల్సిందే. కోపైలట్ ఇలా చేయడానికి రెండే రెండు కారణాలు ఉంటాయని, ఒకటి మానసిక ప్రవర్తన సరిగ్గా లేకపోవడం, రెండు టైస్టుల ఆదేశాల మేరకు నడుచుకోవడమని కార్స్టెన్ చెప్పారు. ఈ రెండు అంశాల్లో కూడా లూబిడ్జ్ను అనుమానించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. అయితే అతని పైలట్ శిక్షణా కాలంలో ఎందుకు అన్ని నెలలు సెలవు పెట్టారు, ఆ సమయంలో ఎక్కడ ఉన్నాడు, ఏం చేశాడు? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉందని చెప్పారు. -
కో-పైలటే కూల్చేశాడు!
బాత్రూమ్కు వెళ్లిన కెప్టెన్.. కాక్‌పిట్‌ను లాక్ చేసుకున్న కోపైలట్ కెప్టెన్ తలుపు కొడుతూ ఎంతగా అడిగినా కోపైలట్ స్పందించలేదు విమానం కూలిపోయేలా కోపైలటే ఆపరేట్ చేసినట్లు తెలుస్తోంది ఎందుకు కూల్చివేశాడో తెలియదు.. ఉగ్రవాదంతో సంబంధం లేదు విమానం కూలిపోయే ముందు ప్రయాణికులు హాహాకారాలు చేశారు బ్లాక్‌బాక్స్‌ను విశ్లేషించి నిర్ధారించామన్న ఫ్రాన్స్ దర్యాప్తు అధికారులు పారిస్: ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్ పర్వతాల్లో మంగళవారం కుప్పకూలిన జర్మన్ విమానాన్ని కో-పైలట్ ఉద్దేశపూర్వకంగా కూల్చేశాడని.. ఫ్రాన్స్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు. విమానం పైలట్ కాక్‌పిట్ నుంచి బయటకు(బహుశా బాత్రూమ్కు) వెళ్లాక.. కోపైలట్ ఆండ్రియాస్ లూబిట్జ్ కాక్‌పిట్ తలుపు మూసేశాడని, పైలట్ ఎంతగా అడిగినా తలుపు తెరవలేదని, లోపలకు రానీయలేదని.. ఆ తర్వాత విమానం పర్వతాలపై కూలిపోయేలా నడిపించాడని వివరించారు. విమాన శకలాల నుంచి లభ్యమైన ‘బ్లాక్ బాక్స్’ కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లో రికార్డయిన సంభాషణలు, శబ్దాల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్లు ప్రాసిక్యూటర్ బ్రైస్ రాబిన్ తెలిపారు. జర్మనీ దేశపు జర్మన్వింగ్స్ విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌బస్ ఎ320 విమానం.. గత మంగళవారం ఉదయం 10 గంటలకు స్పెయిన్‌లోని బార్సిలోనా నుంచి బయల్దేరి జర్మనీలోని డ్యుసెల్డార్ఫ్ నగరానికి పయనమవటం.. 40 నిమిషాల్లోనే ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్ పర్వతశ్రేణుల్లో కూలిపోవటం తెలిసిందే. విమానంలోని ఆరుగురు సిబ్బందితో పాటు.. 144 మంది ప్రయాణికులు మొత్తం ఈ ఘోర దుర్ఘటనలో చనిపోయిన విషయమూ విదితమే. ఈ విమాన శకలాల నుంచి సేకరించిన బ్లాక్‌బాక్స్‌ను విశ్లేషించిన నిపుణులు.. విమానాన్ని కో-పైలట్ ఉద్దేశపూర్వకంగానే కూల్చివేశాడని బలంగా అనుమానిస్తున్నారు. ప్రాసిక్యూటర్ గురువారం మీడియాకు వివరించిన కథనం ప్రకారం... విమానం బయల్దేరిన తర్వాత కాక్‌పిట్‌లో కెప్టెన్, కో-పైలట్ల మధ్య సంభాషణలు మామూలుగానే సాగాయి. ఎటువంటి ఆందోళనకరమైన అంశాలూ లేవు. చివరిగా.. విమానం నిర్ణీత ఎత్తుకు చేరిన తర్వాత ఆ ఎత్తులో ప్రయాణం సాగిం చేందుకు లాంఛనంగా గ్రౌండ్ కంట్రోల్ అనుమతి కోరటం నమోదయింది. ఆ తర్వాత కొద్ది నిమిషాలు ఎటువంటి సంభాషణలూ లేవు. కాసేపటికి.. కాక్‌పిట్ నుంచి కెప్టెన్ బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన కాక్‌పిట్ వెలుపలి నుంచి తలుపుపై నెమ్మదిగా తడుతూ తెరవాలని కోరటం వినిపించింది. దీనికి కో-పైలట్ నుంచి ఎటువంటి స్పందనా, సమాధానం లేవు. తలుపు తెరవాల్సిందిగా కెప్టెన్ పదే పదే అడుగుతుండటం.. తలుపుపై చేతులతో కొడుతున్న శబ్దం వినిపించింది. కానీ.. కో-పైలట్ తలుపు తెరవలేదు. మరి కొద్ది నిమిషాల్లోనే తలుపును పగలగొట్టటానికి కెప్టెన్ ప్రయత్నిస్తున్నట్లు గట్టి శబ్దాలు వినిపించాయి. కాక్‌పిట్‌లో ఉన్న కో-పైలట్ మామూలుగా శ్వాస తీసుకుంటున్న శబ్దం మినహా మరే శబ్దాలూ వినిపించలేదు. ఇక విమానం మరికొన్ని క్షణాల్లో కూలిపోతుందనగా ప్రయాణికులు హాహాకారాలు చేయటం నమోదయింది. దీనినిబట్టి.. కాక్‌పిట్ నుంచి కెప్టెన్ బయటకు వెళ్లాక, తలుపు తెరుచుకోకుండా చేసి.. కో-పైలటే ఉద్దేశపూర్వకంగా.. విమానం నేరుగా నేలను తాకి కూలిపోయేలా నియంత్రణ వ్యవస్థను ఆపరేట్ చేశాడన్న నిర్ధారణకు వచ్చినట్లు ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. భూమికి 38,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం కూలిపోవటానికి ముందు చివరి పది నిమిషాల్లో ఏకంగా 36,000 అడుగులకు పైగా కిందకు దిగిపోయింది. చివరి క్షణాల వరకూ ప్రయాణికులకు ముంచుకొస్తున్న విపత్తు గురించి తెలియదని కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లో రికార్డయిన శబ్దాలను బట్టి తెలుస్తోందని చెప్పారు. విమానం కూలిపోతున్నంతవరకూ కో-పైలట్ సృ్పహలోనే ఉన్నాడని తెలిపారు. కో-పైలట్ విమానాన్ని కూల్చివేయడానికి కారణమేమిటనేది ఇంకా తెలియదన్నారు. అయితే.. ఇందులో ఉగ్రవాద పాత్రకు అవకాశం లేదని, అతడికి ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు ఆధారాలు లేవని కొట్టివేశారు. ఘటనా స్థలానికి మృతుల బంధువులు... ఆల్ప్స్ పర్వతాల్లో గాలింపు, సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పర్వతాలు, లోయల్లో చెల్లాచెదురుగా పడిపోయిన విమాన ప్రయాణికుల మృతదేహాలు, శరీరభాగాలను హెలికాప్టర్ల ద్వారా సమీపంలోని సెయిన్ లె ఆల్ప్స్కు తరలిస్తున్నారు. శరీరభాగాలు గుర్తించలేనంతగా ఛిద్రమయ్యాయని ఆ ప్రాంతానికి వెళ్లిన పర్వత మార్గదర్శకుడు ఒకరు పేర్కొన్నారు. దీంతో.. మృతులను గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నారు. ఈ దుర్ఘటనలో మొత్తం 18 దేశాలకు చెందిన పౌరులు మృతి చెందగా.. వారిలో అత్యధికంగా 72 మంది జర్మనీ వాసులు, 51 మంది స్పెయిన్ పౌరులు ఉన్నారు. స్పెయిన్, జర్మనీల నుంచి బాధిత ప్రయాణికుల కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఘటనా ప్రాంతానికి వెళ్లేందుకు ఫ్రాన్స్ వస్తున్నారు. బార్సిలోనా, డుసెల్డార్ఫ్ల నుంచి రెండు విమానాల్లో వీరు గురువారం ఫ్రాన్స్ చేరుకున్నారు. వారి నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించేందుకు ఘటనా ప్రాంతంలో టెంట్లను నెలకొల్పారు. ఎవరీ లూబిట్జ్? కోపైలట్ ఆండ్రియాస్ లూబిట్జ్ (28) జర్మనీ పౌరు డు. జర్మనీలోని మోంటాబార్ అతడి స్వస్థలం. అక్కడ తన తల్లిదండ్రులతో కలసి జీవిస్తున్నాడు. టీనేజీ వయసులోనే గ్లైడర్ పైలట్ లెసైన్స్ పొందాడు. గత ఏడాదే పైలట్ లెసైన్స్‌ను పునరుద్ధరించుకున్నాడు. జర్మనీలోనే లుఫ్తాన్సా శిక్షణ కేంద్రంలో పైలట్ శిక్షణ పూర్తిచేసుకున్న వెంటనే జర్మన్వింగ్స్ సంస్థలో 2013 సెప్టెంబర్‌లో ట్రైనీ పైలట్‌గా చేరాడు. అతడికి 630 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉంది. ఇటీవలి కాలంలో అతడు ఎలాంటి మానసిక ఒత్తిడికీ లోనైనట్లు కనిపించలేదని.. అతడిని దగ్గరగా తెలిసిన వ్యక్తులు పేర్కొన్నారు. జర్మన్వింగ్స్లో ఉద్యోగంలో చేరటం వల్ల సంతోషంగా కూడా ఉన్నాడని చెప్పారు. లూబిట్జ్ స్వతహాగా మితభాషి అయినా.. స్నేహశీలి అని వివరించారు. విమానం కెప్టెన్‌కు(పేరు వెల్లడించలేదు) 6,000 గంటల పాటు విమా నం నడిపిన అనుభవం ఉందని, 2014 మే నెల నుం చి జర్మన్వింగ్స్ సంస్థలో పనిచేస్తున్నాడని, అంతకుముందు జర్మన్వింగ్స్ మాతృసంస్థ లుఫ్తా న్సా, కాండోర్ విమానయాన సంస్థల్లో పనిచేశాడని.. లుఫ్తాన్సా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఆకాశంలో ఎయిర్‌బస్ ఏ320... ► ప్రతీ రెండు సెకన్లకు ప్రపంచంలో ఏదో ఒక చోట ఒక ఏ320 విమానం టేకాఫ్ లేదా ల్యాండ్ అవుతోంది. ►1988 నుంచి ఇప్పటివరకు ఎయిర్‌బస్ విమానాల్లో 8.5 కోట్ల సర్వీసుల్లో 600 కోట్ల మంది ప్రయాణించారు. ► ఇప్పటివరకూ 60 సంఘటనలు, 11 ప్రమాదాల్లో 789 మంది మరణించారు. ►మంగళవారం కూలిన విమానం తొలిసారిగా 1990లో సర్వీసు ప్రారంభించింది. ► 1991లో లుఫ్తాన్సా దీన్ని కొని, 2014లో జర్మన్‌వింగ్స్‌కు అమ్మేసింది. ► చివరిసారిగా సోమవారం దీనిని ‘సాధారణ తనిఖీ’ చేశారు. ► ఇప్పటివరకు 46,700 ప్రయాణాల్లో 58,313 గంటలు గాల్లో ఎగిరింది. ► ఈ విమానం 60,000 గంటల సామర్థ్యం గలదని లుఫ్తాన్సా చెబుతోంది. ► విమానంలో సీఎఫ్ఎం 56-5ఏ1 రకం ఇంజిన్లను అమర్చారు. -
క్యాలీ.. కో-పైలట్
లండన్: చిత్రంలో చూశారా.... పెంపుడు కుక్కకు గుర్తింపు కార్డు చూస్తుంటే చిత్రంగా ఉంది కదూ.... ఇదంతా ఆకతాయి చేష్ట అనుకుంటే పొరపాటే.... ఈ శునకానికి నిజంగా క్రూ కార్డు (విమాన సిబ్బందికి ఇచ్చే కార్డు) ఉంది. క్యాలీ అనే ఈ మూడేళ్ల కుక్క (పూచ్) తన యజమాని గ్రాహం మౌంట్ఫోర్డ్తో కలసి చిన్నప్పటి నుంచి ఇంగ్లండ్ అంతటా చక్కర్లు కొట్టింది. తన యజమానికి ఉన్న తేలికపాటి విమానంలో కో-పైలట్ హోదాలో 250 గంటల పాటు ఆకాశయానం చేసింది. ఇలా దాదాపు 80,467 కిలోమీటర్లు ప్రయాణించింది. దీంతో ఎయిర్‌క్రాఫ్ట్ ఓనర్స్ అండ్ పైలట్స్ అసోసియేషన్ (ఏఓపీఏ) వాళ్లు దీనికి క్రూ కార్డు జారీ చేశారు. ప్రపంచంలో ఈ కార్డు పొందిన మొదటి కుక్క క్యాలీనే. ఈ కార్డు ఉండడం వల్ల క్యాలీ ఇకపై ఇంగ్లండ్‌లోని అన్ని ఎయిర్‌పోర్టులకు విమానసిబ్బంది హోదాలో దర్జాగా వెళ్లొచ్చు. తన కో-పైలట్ కుక్క అని తెలిసి చాలామంది ఆశ్చర్యంతో చిరునవ్వు చిందిస్తుంటారని క్యాలీ యజమాని మౌంట్‌ఫోర్డ్ చెప్పాడు.