క్యాలీ.. కో-పైలట్ | Don’t get into a dog fight! Callie the chocolate labarador gets ‘pilot’ licence | Sakshi
Sakshi News home page

క్యాలీ.. కో-పైలట్

Published Wed, May 7 2014 4:14 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

క్యాలీ.. కో-పైలట్ - Sakshi

క్యాలీ.. కో-పైలట్

లండన్: చిత్రంలో చూశారా.... పెంపుడు కుక్కకు గుర్తింపు కార్డు చూస్తుంటే చిత్రంగా ఉంది కదూ.... ఇదంతా ఆకతాయి చేష్ట అనుకుంటే పొరపాటే.... ఈ శునకానికి నిజంగా క్రూ కార్డు (విమాన సిబ్బందికి ఇచ్చే కార్డు) ఉంది. క్యాలీ అనే ఈ మూడేళ్ల కుక్క (పూచ్) తన యజమాని గ్రాహం మౌంట్‌ఫోర్డ్‌తో కలసి చిన్నప్పటి నుంచి ఇంగ్లండ్ అంతటా చక్కర్లు కొట్టింది. తన యజమానికి ఉన్న తేలికపాటి విమానంలో కో-పైలట్ హోదాలో 250 గంటల పాటు ఆకాశయానం చేసింది.
 
 ఇలా దాదాపు 80,467 కిలోమీటర్లు ప్రయాణించింది. దీంతో ఎయిర్‌క్రాఫ్ట్ ఓనర్స్ అండ్ పైలట్స్ అసోసియేషన్ (ఏఓపీఏ) వాళ్లు దీనికి క్రూ కార్డు జారీ చేశారు. ప్రపంచంలో ఈ కార్డు పొందిన మొదటి కుక్క క్యాలీనే.  ఈ కార్డు ఉండడం వల్ల క్యాలీ ఇకపై ఇంగ్లండ్‌లోని అన్ని ఎయిర్‌పోర్టులకు విమానసిబ్బంది హోదాలో దర్జాగా వెళ్లొచ్చు. తన కో-పైలట్ కుక్క అని తెలిసి చాలామంది ఆశ్చర్యంతో చిరునవ్వు చిందిస్తుంటారని క్యాలీ యజమాని మౌంట్‌ఫోర్డ్ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement