'అతడికి డిప్రెషన్ ఉందని ముందే తెలుసు'
డసెల్డ్రాఫ్ : గత వారం ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్ పర్వాతాల్లో కుప్పకూలిన 'ఎయిర్ బస్ ఏ320' విమానాన్ని కో పైలట్ ఆండ్రియస్ లూబిట్జ్ తాను తీవ్రమైన డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు 2009లోనే లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ కు తెలిపాడు. ఈ విషయాన్ని ఆ కంపెనీ మంగళవారం వెల్లడించింది. డిప్రెషన్ కారణంగా కో పైలట్ కొన్ని రోజుల విరామం తర్వాత తన పరిస్థితిని కంపెనీకి మెయిల్ చేశాడు. ఈ మెయిల్ లో తాను తిరిగి కంపెనీలో ట్రెయినింగ్ ప్రోగ్రామ్కి జాయిన్ అవ్వాలనుకుంటున్నట్లు, వాటితో పాటు మానసిక స్థితికి సంబంధించిన డాక్యుమెంట్లు అటాచ్ చేశాడని సంస్థ పేర్కొంది. అతని మానసిక స్థితి తెలిసి కూడా ఎయిర్ లైన్స్ లూబిట్జ్ ని ట్రెయినింగ్ ప్రోగ్రామ్కి ఎలా అనుమతించిందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ట్రెయినింగ్ స్కూల్కి ఎంచుకునే వారి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మానసిక బలాన్ని కూడా పరిక్షిస్తారని లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కార్స్ పేర్కొన్నారు. లూబిట్జ్ అపార్ట్మెంట్ తనిఖీ చేసిన పోలీసులు ఓ విషయాన్ని తెలుసుకున్నారు. ఫ్లైట్ క్రాష్ అయిన రోజు లూబిట్జ్ ఆరోగ్యం బాగాలేదని అక్కడి డాక్యుమెంట్లలో గుర్తించారు.
జర్మనీ ఛాన్స్లర్ ఎంజెలా మోర్కెల్తో సమావేశం అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్ హొలాండే మీడియాతో సమావేశమయ్యారు. వారాంతానికల్లా మృతులను గుర్తిస్తామన్నారు. కొందరు అధికారులు మాత్రం మరి కాస్త సమయం పట్టేందుకు అవకాశం ఉందని చెప్పారు.