Andreas Lubitz
-
డ్రగ్స్ ఇచ్చి.. పైలట్‌ను పంపి.. విమానం కూల్చేశాడు
జర్మన్ వింగ్స్ విమానాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చేసి తనతోపాటు మరో 149 మంది మరణానికి కారకుడైన కో- పైలట్ లుబిట్జ్ కుట్రకు సంబంధించి మరో అంశం వెలుగులోకి వచ్చింది. కాక్‌పిట్‌లో పైటల్ పాట్రిక్ తాగిన కాఫీలో కో- పైలట్ లుబిట్జ్ డ్రగ్స్ కలిపి ఉంటాడని ఫ్రెంచి బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎనాలసిస్ సంస్థ బలంగా నమ్ముతోంది. కాఫీలో డ్యురెటిక్ డ్రగ్ (పదే పదే మూత్రవిసర్జన కలిగించే ద్రవ్యం) కలపడం ద్వారా పైలట్‌ను కాక్‌పిట్ నుంచి బయటికి పంపితే, తన కుట్రను సులువుగా అమలు చేయొచ్చని లుబిట్జ్ భావించాడు. అందుకే ఆ డ్రగ్ పనితీరుకు సంబంధించిన సమాచారాన్ని ఇంటర్నెట్లో సెర్చ్ చేసినట్లు, లుబిట్జ్ ల్యాప్‌ట్యాప్‌ను శోధించగా ఈ విషయాలు బయటపడినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. -
సూసైడ్ కోసం కో పైలట్ ముందే ప్లాన్
బెర్లిన్: ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో జర్మనీ విమానాన్ని ఇటీవల కూల్చి 149 మంది ప్రయాణికుల మరణానికి కారణమైన కో పైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ వారం రోజుల ముందు నుంచే ఎలా ఆత్మహత్య చేసుకోవాలి? విమానంలోని కాక్‌పిట్ డోర్లు ఎలా ఉంటాయి. దాని భద్రతా వ్యవస్థ ఎలా ఉంటుంది ? అనే అంశాలపై ఇంటర్నెట్లో తీవ్రంగా సర్చ్ చేసినట్టు గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది. లూబిడ్జ్ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న ట్యాబ్ కంప్యూటర్ ద్వారా ఈ విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయని జర్మనీ ప్రాసిక్యూటర్లు తెలిపారు. తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్న లూబిడ్జ్కి ‘లోరాజపమ్’ అనే బలమైన యాంటీ యాక్జైటీ డ్రగ్‌ను వాడాల్సిందిగా డాక్టర్లు సూచించినట్టు కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ డ్రగ్ తీసుకున్నట్టయితే సైకిల్, కారుతో సహా ఎలాంటి వాహనాన్ని నడపరాదని, విమానం అసలు నడపరాదని వైద్యులు సాధారణంగా సలహా ఇస్తారట. ఈ డ్రగ్‌ను వాడే కొత్తలో మానసిక రోగుల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన తీవ్రంగా కలుగుతుందట. రానురాను తగ్గుతుందట. అలాగే ఈ డ్రగ్ వాడే రోగులకు కనీసం ఏడు గంటల ప్రశాంత నిద్ర అవసరమట. లోరాజపమ్ డ్రగ్‌ను వాడాల్సిందిగా లూబిడ్జ్కి సూచించిన డాక్టర్ కూడా కొంతకాలం సెలవు తీసుకోమని, విమానం అసలు నడపరాదని కూడా అతనికి సూచించారట. అయితే తాను సెలవులోనే ఉన్నానని, వీలైనంత త్వరగా కోలుకొని మళ్లీ విధుల్లో చేరాలనుకుంటున్నట్టు లూబిడ్జ్ వైద్యులతో అబద్ధాలేవాడని జర్మన్ వార్తా పత్రిక ‘బిల్డ్’ వెల్లడించింది. ఆల్ఫ్స్ పర్వతాల్లో మార్చి 24వ తేదీన కూలిపోయిన జర్మనీ విమానం (ఎయిర్‌బస్ 320ఏ) రెండం బ్లాక్ బాక్సు కూడా దొరికిందని, దాన్ని ఇంకా విశ్లేషించాల్సి ఉందని, అప్పుడు మరిన్ని వివరాలు వెలుగులోకి రావచ్చని జర్మనీ ప్రాసిక్యూటర్లు గురువారం మీడియాకు తెలిపారు. -
'అతడికి డిప్రెషన్ ఉందని ముందే తెలుసు'
డసెల్డ్రాఫ్ : గత వారం ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్ పర్వాతాల్లో కుప్పకూలిన 'ఎయిర్ బస్ ఏ320' విమానాన్ని కో పైలట్ ఆండ్రియస్ లూబిట్జ్ తాను తీవ్రమైన డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు 2009లోనే లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ కు తెలిపాడు. ఈ విషయాన్ని ఆ కంపెనీ మంగళవారం వెల్లడించింది. డిప్రెషన్ కారణంగా కో పైలట్ కొన్ని రోజుల విరామం తర్వాత తన పరిస్థితిని కంపెనీకి మెయిల్ చేశాడు. ఈ మెయిల్ లో తాను తిరిగి కంపెనీలో ట్రెయినింగ్ ప్రోగ్రామ్‌కి జాయిన్ అవ్వాలనుకుంటున్నట్లు, వాటితో పాటు మానసిక స్థితికి సంబంధించిన డాక్యుమెంట్లు అటాచ్ చేశాడని సంస్థ పేర్కొంది. అతని మానసిక స్థితి తెలిసి కూడా ఎయిర్ లైన్స్ లూబిట్జ్ ని ట్రెయినింగ్ ప్రోగ్రామ్‌కి ఎలా అనుమతించిందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ట్రెయినింగ్ స్కూల్‌కి ఎంచుకునే వారి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మానసిక బలాన్ని కూడా పరిక్షిస్తారని లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కార్స్ పేర్కొన్నారు. లూబిట్జ్ అపార్ట్మెంట్ తనిఖీ చేసిన పోలీసులు ఓ విషయాన్ని తెలుసుకున్నారు. ఫ్లైట్ క్రాష్ అయిన రోజు లూబిట్జ్ ఆరోగ్యం బాగాలేదని అక్కడి డాక్యుమెంట్లలో గుర్తించారు. జర్మనీ ఛాన్స్లర్ ఎంజెలా మోర్కెల్‌తో సమావేశం అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్ హొలాండే మీడియాతో సమావేశమయ్యారు. వారాంతానికల్లా మృతులను గుర్తిస్తామన్నారు. కొందరు అధికారులు మాత్రం మరి కాస్త సమయం పట్టేందుకు అవకాశం ఉందని చెప్పారు. -
పిచ్చివాడి చేతికి విమానం
-
పిచ్చివాడి చేతికి విమానం
అతడు తన ప్రాణం తాను తీసుకున్నాడు. అదే సమయంలో మరో 150 మంది ప్రాణాలు తీశాడు. అది ఆత్మహత్య. ఆ 150 మంది ప్రయాణికుల సామూహిక హత్య కూడా. ఇదే సూత్రం మీద ఇప్పుడు ఫ్రెంచ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గడచిన మంగళవారం ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వతశ్రేణులలో జర్మన్వింగ్స్ విమానం కూలడం గురించి, ఇందుకు కారకునిగా భావిస్తున్న కో-పైలట్ ఆండ్రియాస్ ల్యూబిట్జ్ గురించి గుండెలు బరువెక్కించే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ‘ఏదో ఒకరోజు నా పేరు ఈ విశ్వమంతటా మారు మోగిపోతుంది చూడు!’ అంటూ ఐదారు మాసాల క్రితమే తన మాజీ గర్ల్ ఫ్రెండ్‌తో అన్నమాటకు ల్యూబిట్జ్ ఇలా కార్యరూపమిచ్చాడు. నిజమే... ఇప్పు డు ప్రపంచం మొత్తం అతడి పేరునే స్మరిస్తోంది. బ్లాక్ బాక్సుల ద్వారా వెల్లడైన సమాచారం గగనయానం మీద కొత్త ప్రశ్నలను రేకెత్తించే విధంగా ఉంది. ల్యూబిట్జ్ నుంచి విడిపోక తప్పని పరిస్థితి ఈ మధ్యే రావడం ఎంత మంచిదైందో ఆ మాజీ గర్ల్‌ఫ్రెండ్ తలుచుకుని ఇంత విషాదంలోనూ ఆనం దించి ఉండాలి. ఎందుకు విడిపోయారంటే, అప్పటికే అతడిలో ఏదో మానసిక సమస్యకు సంబంధించిన లక్షణాలు మొదలయ్యాయని చెప్పిందామె. ‘మనం పడిపోతున్నాం...మనం పడిపోతున్నాం...!’ అంటూ ల్యూబిట్జ్ చటుక్కున నిద్దట్లోనుంచి లేచిపోయి అరుస్తూ ఉండేవాడట. అతడికి ఎప్పుడూ పీడకలలే. కానీ తన ఆరోగ్య స్థితిని సంస్థ దృష్టికి రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా డు. విమానం కూలిన రోజు, ఆ ముందు రోజు కూడా అంటే,ఈ మార్చి 25, 26 తేదీలలో కూడా అతడు వైద్యులను కలసివచ్చాడు. అయితే ఆస్పత్రిలో ఇచ్చిన రిపోర్టులను అతడు చించిపారేశాడు. నిజానికి ల్యూబిట్జ్ 2009లో పైలట్ శిక్షణ పొందుతున్నప్పుడే వ్యాధి బయటపడింది. 18 మాసాల వైద్యం తరువాత మళ్లీ చేరాడు. 2013 నుంచి ఇతడిలో వ్యాధి లక్షణాలు మరోసారి కనిపిం చాయి. అప్పుడే, 2015 వరకు కూడా ల్యూబిట్జ్ తరచూ వైద్యపరీక్షలు నిర్వహించుకోవాలని ఆస్పత్రి వర్గాలు సూచించాయి. ఇలా ఉండగానే ఈ సంవ త్సరం ఫిబ్రవరిలో అంతుచిక్కని వ్యాధికి అతనికి కొత్తగా చికిత్స మొదలయింది. ల్యూబిట్జ్ వ్యక్తిగత జీవితం సంక్షోభభరితమైంది కావచ్చుననీ, దానితో పాటు కొన్ని ఇతర కారణాలు కూడా ఇంతటి విపరీత నిర్ణయం తీసుకోవడానికి దారి తీసి ఉండవచ్చునని జర్మనీ పత్రికలు విశ్లేషిస్తున్నాయి. ఈ దుర్ఘటనలో అస లు పైలట్‌ను కాక్‌పిట్‌లోకి రానివ్వకుండా లోపల తాళం పెట్టుకుని ల్యూబిట్జ్ విమానాన్ని భూమార్గం పట్టించాడు. ఇది పొరపాటుగా జరిగినది కూడా కాదనీ, ఎందుకంటే, ఏ మీట నొక్కితే విమానం కిందకు దూకుతుందో, అదే మీటను ల్యూబిట్జ్ నొక్కేశాడని నిపుణులు చెబుతున్నారు. ఆ తరువాత ఎనిమిది నిముషాల పాటు అతడు హాయిగా ఊపిరి తీసుకున్న విషయం కూడా కనుగొ న్నారు. మద్యపానం, మత్తుమందులతో వచ్చే సమస్యలు, వివాహ జీవితం భగ్నం కావడం, వ్యక్తిగత వైఫల్యాలు, గతంలో భరించిన లేదా ఇప్పుడు భరి స్తున్న పని ఒత్తిడి వంటి కారణాలు కూడా ఈ దారుణ చర్యకు దారితీయించే అవకాశం ఉందని అక్కడి పత్రికలు అంటున్నాయి. నిజానికి ఇందులో చాలా వరకు ల్యూబిట్జ్ జీవితంలో కనిపిస్తున్నాయి. కానీ అతడు మోంటాబార్ (జర్మ నీ పశ్చిమ ప్రాంతం) అనే చోట తల్లిదండ్రులతో కలసే ఉండడం విశేషం. కానీ డుసెల్డార్ఫ్లో ఒక అపార్టుమెంటు కొని, ఉద్యోగం కోసం అందులో ఉంటు న్నాడు. అయితే ఇది ఒక్క ల్యూబిట్జ్కు సంబంధించిన సమస్య కాదని మార్జోరీ వాలెస్ మాటలను బట్టి తెలుస్తోంది. చారిటీ సేన్ అనే మానసిక రుగ్మతల నివా రణ సంస్థ అధిపతిగా ఉన్న వాలెస్ చెబుతున్నది వింటే గుండె ఝల్లుమంటుం ది. ప్రస్తుతం ఒత్తిడికి వైద్యం చేయించుకుంటున్నవారు వేల సంఖ్యలో ఉన్నా రనీ, అందులో పైలట్లు కూడా ఉన్నారనీ ఆయన అంటున్నారు. ఇంత జరిగాక ఇప్పుడు ఐరోపా విమానయాన భద్రతా సంస్థ (ఈఏఎస్ఏ) ఉలిక్కిపడి మార్చి 28 నుంచే కొత్త నిబంధనలు ప్రకటించింది. ఇక నుంచి కాక్‌పిట్‌లో ఎల్లవేళలా ఇద్దరు ఉండాలని ఆదేశించింది. ఈ పద్ధతిని అమెరికా ఇప్పుటికే పాటిస్తున్నది. పనిలో పనిగా ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ విమానయాన సంస్థ కూడా పైలట్లు తరచు మానసిక పరీక్షలు జరిపించుకోవాలని పిలుపునిచ్చింది. ఏమైనా ఒక హాలీవుడ్ హర్రర్ సినిమాకు తగిన విషాదాన్ని ప్రపంచానికి వదలిపెట్టి వెళ్లాడు ల్యూబిట్జ్. -
ట్రైనింగ్‌లో లూబిడ్జ్ ఎక్కడికెళ్లాడు?
పారిస్: ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో జర్మనీ విమానం 'ఎయిర్ బస్ ఏ320' విమానాన్ని కోపైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ ఉద్దేశపూర్వకంగానే కూల్చివేశారని తేలిపోవడంతో అతని ఉద్దేశం వెనుక కారణాలేమిటనే అంశంపైనే ప్రస్తుతం దర్యాప్తు కేంద్రీకృతమైంది. లుఫ్తాన్సా విమానయాన సంస్థ తరఫున అమెరికాలోని ఆరిజోనాలో పెలైట్ శిక్షణ పొందిన కోపైలట్ తన శిక్షణ కాలంలో కొన్ని నెలలపాటు శిక్షణకు గైర్హాజరయ్యాడన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎందుకు లూబిడ్జ్ గైర్హాజరయ్యాడన్న అంశం తేలితే విమానం ప్రమాదం మిస్టరీ వీడిపోయే అవకాశం ఉందని లుఫ్తాన్సా విమానయాన సంస్థ ఉన్నతాధికారి కార్స్టెన్ స్పార్ తెలిపారు. పైలట్ శిక్షణ సందర్భంగా సాధారణంగా ఎవరికి లాంగ్ లీవ్ ఇవ్వరని, సిక్ లీవ్ మాత్రం ఇస్తారని ఆయన చెప్పారు. లూబిడ్జ్ సిక్ లీవ్‌పై వెళ్లాడా, లేదా, వెళితే అతని అనారోగ్యానికి కారణాలేమిటో కూపీ లాగాల్సి ఉందని ఆయన అన్నారు. పైలట్ శిక్షణ కేంద్రం నిబంధనలు, జర్మన్ చట్టాల ప్రకారం శిక్షణ పొందుతున్న పైలట్ల సెలవులకు కారణాలు బయటకు వెల్లడించరని, కోర్టు కోరితే తెలపవచ్చని ఆయన తెలిపారు. 2001, సెప్టెంబర్11వ తేదీన అమెరికాలోని పెంటగాన్‌పై హైజాక్ చేసిన విమానంతో దాడి జరిపిన టైస్టు కూడా ఆరిజోనాలోనే పైలట్ శిక్షణ పొందిన విషయం ఇక్కడ గమనార్హం. ఎయిర్‌బస్ విమానాన్ని కోపైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ ఆల్ఫ్స్ పర్వతాలపైకి మళ్లించడం, హఠాత్తుగా విమానాన్ని తలకిందులుగా అతివేగంతో కిందకు తీసుకెళ్లి రాళ్లకు ఢీ కొట్టించడం ఉద్దేశపూర్వకంగా జరిగినట్టు బ్లాక్‌బాక్స్ సందేశాల ద్వారా కనుక్కొన్న విషయం తెల్సిందే. కోపైలట్ ఇలా చేయడానికి రెండే రెండు కారణాలు ఉంటాయని, ఒకటి మానసిక ప్రవర్తన సరిగ్గా లేకపోవడం, రెండు టైస్టుల ఆదేశాల మేరకు నడుచుకోవడమని కార్స్టెన్ చెప్పారు. ఈ రెండు అంశాల్లో కూడా లూబిడ్జ్ను అనుమానించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. అయితే అతని పైలట్ శిక్షణా కాలంలో ఎందుకు అన్ని నెలలు సెలవు పెట్టారు, ఆ సమయంలో ఎక్కడ ఉన్నాడు, ఏం చేశాడు? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉందని చెప్పారు.