డ్రగ్స్ ఇచ్చి.. పైలట్ను పంపి.. విమానం కూల్చేశాడు
జర్మన్ వింగ్స్ విమానాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చేసి తనతోపాటు మరో 149 మంది మరణానికి కారకుడైన కో- పైలట్ లుబిట్జ్ కుట్రకు సంబంధించి మరో అంశం వెలుగులోకి వచ్చింది. కాక్పిట్లో పైటల్ పాట్రిక్ తాగిన కాఫీలో కో- పైలట్ లుబిట్జ్ డ్రగ్స్ కలిపి ఉంటాడని ఫ్రెంచి బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎనాలసిస్ సంస్థ బలంగా నమ్ముతోంది.
కాఫీలో డ్యురెటిక్ డ్రగ్ (పదే పదే మూత్రవిసర్జన కలిగించే ద్రవ్యం) కలపడం ద్వారా పైలట్ను కాక్పిట్ నుంచి బయటికి పంపితే, తన కుట్రను సులువుగా అమలు చేయొచ్చని లుబిట్జ్ భావించాడు. అందుకే ఆ డ్రగ్ పనితీరుకు సంబంధించిన సమాచారాన్ని ఇంటర్నెట్లో సెర్చ్ చేసినట్లు, లుబిట్జ్ ల్యాప్ట్యాప్ను శోధించగా ఈ విషయాలు బయటపడినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది.