గోమా : ఎయిర్‌పోర్ట్ నుంచి అప్పుడే టేకాఫ్ తీసుకున్న విమానం ఇళ్ల మధ్య కూలడంతో 23 మంది చనిపోయారు. ఈ విషాదకర ఘటన మధ్య ఆఫ్రికా దేశంలోని డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆప్ కాంగోకి చెందిన గోమా సిటీలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు .. గోమా ఎయిర్‌పోర్ట్ నుంచి జిబీ బి విమానయాన సంస్థకు చెందిన డోర్నియర్-228 విమానం ఆదివారం ఉదయం 9 గంటలకు బెనీకి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కాసేపటికే గోమాలోని నివాస ప్రాంతాల వద్దకు రాగానే విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 17 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. కాగా, విమానంలో ఉన్నవారెవరూ ప్రాణాలతో బయటపడలేదని పోలీసులు పేర్కొన్నారు. విమానం హఠాత్తుగా కుప్పకూలడానికి సాంకేతిక లోపమే కారణం కావొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు 6 మృతదేహాలను బయటికి తీసినట్లు వెల్లడించారు.
Smoke rises from the wreckage of a small plane which crashed on takeoff into a densely populated area of Goma in the Democratic Republic of Congo pic.twitter.com/31BXU7qrG0
— AFP news agency (@AFP) November 24, 2019
Comments
Please login to add a commentAdd a comment