Democratic Republic of Congo
-
ఘోర ప్రమాదం.. పడవ మునిగి 145 మంది జల సమాధి
వాయవ్య డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో(డీఆర్సీ) ఘోర ప్రమాదం జరిగింది. లులోంగా నదిలో 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న మోటారు బోటు ఓవర్ లోడుతో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 145 మంది చనిపోయి ఉంటారని అధికారులు తెలిపారు. మిగతా 55 మంది సురక్షితంగా ప్రాణాలతో బయపడినట్లు వెల్లడించారు. వీరంతా తమ వస్తువులు, పశువులతో రిపబ్లిక్ ఆఫ్ కాంగో వెళ్తుండగా బసన్కుసు పట్టణం సమీపంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడం, వారితో పాటు వస్తువులు, పశువులు ఉండటంతో బరువు ఎక్కువై పడవ నదిలో మునిగిపోయింది. డీఆర్సీలో తరచూ పడవ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ రోడ్డు మార్గాలు లేకపోవడంతో ప్రజలు పడవల్లోనే ప్రయాణిస్తున్నారు. వలసదారులు బతుకుదెరవు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఈత రాకపోయినా పడవల్లో ప్రయాణించి ప్రమాదాలకు గురవుతుంటారు. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్లు కూడా చాలా ఆలస్యమవుతుంటాయి. గతేడాది అక్టోబర్‌లోనూ కాంగో నదిలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. పడవ మునిగి 40 మంది చనిపోయారు. చదవండి: సారీ.. నేను చేసింది తప్పే.. ప్రజలకు రిషి సునాక్ క్షమాపణలు -
మళ్లీ పడగ విప్పుతున్న ప్రాణాంతక ఎబోలా..!
జెనీవా: ప్రాణాంతక ఎబోలా మళ్లీ పడగ విప్పుతోంది. ఆఫ్రికా ఖండంలో ఎబోలా వ్యాప్తి మళ్లీ మొదలైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది. డెమొక్రటిక్ రిపబ్లిక ఆఫ్ కాంగోలో వైరస్ వ్యాప్తి వెలుగులోకి వచ్చిందని తెలిపింది. ఆఫ్రికా ఈశాన్య ప్రాంతమైన ఈక్వెటర్ ప్రావిన్స్‌లోని మబండకా అనే పట్టణంలో ఎబోలా కేసు నమోదైంది. ఈ ప్రావిన్స్‌లో 2018 నుంచి ఎబోలా స్థానికంగా వ్యాప్తి చెందడం ఇది మూడోసారి. ఈ దేశంలో 1976నుంచి 14 సార్లు ఎబోలా వ్యాపించింది. రెండు వారాల క్రితమే వ్యాధి వ్యాప్తి ప్రారంభమైందనీ, ప్రస్తుతం దానిని అదుపు చేయడానికి అన్ని చర్యలు చేపట్టామని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. చదవండి👉🏾 మొట్టమొదటిసారిగా.. యూఎస్‌లో పోర్నోగ్రఫీపై కోర్సు ‘ఇప్పటి వరకు ఒక కేసును ఎబోలాగా అధికారికంగా ధ్రువీకరించారు. 31 ఏళ్ల రోగిలో ఈనెల 5వ తేదీన ఎబోలా లక్షణాలు కనిపించాయి. వారం తర్వాత స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆ తర్వాత ఏప్రిల్ 21న ఎబోలా చికిత్సా కేంద్రంలోని ఐసీయూలో చేర్పించారు. కానీ, ఒక రోజు తర్వాత అతడు మరణించాడు. వైద్య సిబ్బందిలో ఎబోలా లక్షణాలు కనిపించడంతో వెంటనే వారు పరీక్షల కోసం నమూనాలను ఇచ్చారు. ఇక ఎబోలాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలను గౌరవ ప్రదంగా నిర్వహించారు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. చదవండి👉🏻 ట్రిపుల్ బొనాంజా.. ఒకే కాన్పులో ఇద్దరు కాదు ముగ్గురు -
డీఆర్ కాంగోలో కూలిన విమానం
గోమా: ఆఫ్రికా దేశం డీఆర్ కాంగోలో విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 23 మంది మరణించారు. కాంగోలోని విమానాశ్రయం నుంచి ఉదయం 9 గంటల సమయంలో విమానం టేకాఫ్ అవుతుండగా ఇళ్ల మధ్యలో కూలింది. ఇందులో 19 మంది ప్రయాణికులు సహా కొందరు సిబ్బంది ఉన్నట్లు అధికారులు చెప్పారు. గోమా నుంచి బయలుదేరిన బిజీబీ ఎయిర్ లైన్స్‌కు చెందిన డోర్నియర్–228 రకం విమానం 350 కిలోమీటర్ల దూరంలోని బెని చేరుకోవాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. -
ఇళ్ల మధ్యలో కూలిన విమానం; 23 మంది మృతి
గోమా : ఎయిర్పోర్ట్ నుంచి అప్పుడే టేకాఫ్ తీసుకున్న విమానం ఇళ్ల మధ్య కూలడంతో 23 మంది చనిపోయారు. ఈ విషాదకర ఘటన మధ్య ఆఫ్రికా దేశంలోని డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆప్ కాంగోకి చెందిన గోమా సిటీలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు .. గోమా ఎయిర్పోర్ట్ నుంచి జిబీ బి విమానయాన సంస్థకు చెందిన డోర్నియర్-228 విమానం ఆదివారం ఉదయం 9 గంటలకు బెనీకి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కాసేపటికే గోమాలోని నివాస ప్రాంతాల వద్దకు రాగానే విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 17 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. కాగా, విమానంలో ఉన్నవారెవరూ ప్రాణాలతో బయటపడలేదని పోలీసులు పేర్కొన్నారు. విమానం హఠాత్తుగా కుప్పకూలడానికి సాంకేతిక లోపమే కారణం కావొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు 6 మృతదేహాలను బయటికి తీసినట్లు వెల్లడించారు. Smoke rises from the wreckage of a small plane which crashed on takeoff into a densely populated area of Goma in the Democratic Republic of Congo pic.twitter.com/31BXU7qrG0 — AFP news agency (@AFP) November 24, 2019 -
పడవ మునిగి 129 మంది మృతి
లుబంబాషి: కాంగోలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 129కు చేరింది. ఆగ్నేయ కాంగోలోని టంగన్యికా సరస్సులో గురువారం రాత్రి పడవ మునిగిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కటంగా ప్రావిన్స్ లో మొబా, కలేమీ పట్టణాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. సహాయక బృందాలు 129 మృతదేహాలు వెలికితీశారని అధికారులు వెల్లడించారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ప్రమాదం నుంచి 232 మంది బయటపడ్డారని కటంగా ప్రావిన్స్ రవాణా మంత్రి తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోందని పేర్కొన్నారు.