లుబంబాషి: కాంగోలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 129కు చేరింది. ఆగ్నేయ కాంగోలోని టంగన్యికా సరస్సులో గురువారం రాత్రి పడవ మునిగిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కటంగా ప్రావిన్స్ లో మొబా, కలేమీ పట్టణాల మధ్య ఈ ప్రమాదం జరిగింది.
సహాయక బృందాలు 129 మృతదేహాలు వెలికితీశారని అధికారులు వెల్లడించారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ప్రమాదం నుంచి 232 మంది బయటపడ్డారని కటంగా ప్రావిన్స్ రవాణా మంత్రి తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోందని పేర్కొన్నారు.
పడవ మునిగి 129 మంది మృతి
Published Sun, Dec 14 2014 9:18 PM | Last Updated on Sat, Sep 2 2017 6:10 PM
Advertisement
Advertisement