బ్లాక్బాక్సులను అప్పగించిన రష్యా రెబల్స్
విమాన దుర్ఘటన జరిగిన దాదాపు వారం రోజులకు ఎట్టకేలకు బ్లాక్ బాక్సులు అధికారుల చేతికి వచ్చాయి. ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతంలో విమానం కూలిన ప్రాంతంలో ఉన్న వీటిని మలేషియన్ అధికారులకు రష్యాన్ తిరుగుబాటుదారులు అందించారు. డోనెట్స్క్ ప్రాంతంలో వీటిని తమ అధికారులకు ఇచ్చినట్లు మలేషియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ వెల్లడించారు. వీటిని తదుపరి విశ్లేషణ కోసం నిపుణులకు పంపుతామని ఆయన చెప్పారు.
విమాన దుర్ఘటన విషయంలో ఇప్పుడు మరో కొత్త వాదన మొదలైంది. ఉక్రెయిన్కు చెందిన ఓ ఫైటర్ జెట్ విమానం గాలిలోంచి గాలిలోకి ప్రయోగించి క్షిపణులతో ఎంహెచ్-17 విమానాన్ని వెంబడించినట్లు రష్యా సైన్యానికి చెందిన సీనియర్ అధికారులు తాజాగా చెబుతున్నారు. ఇందుకు సంబంధించి తమకు ఉపగ్రహ చిత్రాల సాక్ష్యాలు ఉన్నాయని, ఆ ఫైటర్ విమానం ఎక్కడినుంచి ఎక్కడు వెళ్లిందో వివరించాలని ఉక్రెయిన్ను నిలదీస్తున్నారు.