malaysia airliles
-
ఎయిరిండియాకు ఎయిర్ ఏషియా వాటా
న్యూఢిల్లీ: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఎయిర్ఏషియా ఇండియాలో మిగిలిన వాటాను ప్రయివేట్ రంగ దిగ్గజం ఎయిరిండియా సొంతం చేసుకోనుంది. ఇందుకు వాటా విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు మలేషియన్ కంపెనీ ఎయిర్ఏషియా తాజాగా వెల్లడించింది. అయితే ఒప్పందం పూర్తి వివరాలు వెల్లడికాలేదు. టాటా గ్రూప్, మలేషియన్ కంపెనీ భాగస్వామ్యంలో ఏర్పాటైన ఎయిర్ఏషియా ఇండియా 2014 జూన్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. టాటా సన్స్‌కు 83.67 శాతం, ఏషియా ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్‌కు 16.33 శాతం చొప్పున వాటా ఉంది. ఈ ఏడాది జూన్‌లో ఎయిరేషియాలో పూర్తి వాటాను ఎయిరిండియా కొనుగోలు చేసేందుకు సీసీఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కాగా.. జనవరిలో ప్రభుత్వం నుంచి ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లను టాటా గ్రూప్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. తదుపరి ఈ రెండింటితోపాటు.. విస్తారా, ఎయిర్ఏషియా ఇండియా బిజినెస్‌లను కన్సాలిడేట్(ఏకీకృతం) చేసే సన్నాహాలు ప్రారంభించింది. -
బ్లాక్‌బాక్సులను అప్పగించిన రష్యా రెబల్స్
విమాన దుర్ఘటన జరిగిన దాదాపు వారం రోజులకు ఎట్టకేలకు బ్లాక్ బాక్సులు అధికారుల చేతికి వచ్చాయి. ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతంలో విమానం కూలిన ప్రాంతంలో ఉన్న వీటిని మలేషియన్ అధికారులకు రష్యాన్ తిరుగుబాటుదారులు అందించారు. డోనెట్స్క్ ప్రాంతంలో వీటిని తమ అధికారులకు ఇచ్చినట్లు మలేషియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ వెల్లడించారు. వీటిని తదుపరి విశ్లేషణ కోసం నిపుణులకు పంపుతామని ఆయన చెప్పారు. విమాన దుర్ఘటన విషయంలో ఇప్పుడు మరో కొత్త వాదన మొదలైంది. ఉక్రెయిన్‌కు చెందిన ఓ ఫైటర్ జెట్ విమానం గాలిలోంచి గాలిలోకి ప్రయోగించి క్షిపణులతో ఎంహెచ్-17 విమానాన్ని వెంబడించినట్లు రష్యా సైన్యానికి చెందిన సీనియర్ అధికారులు తాజాగా చెబుతున్నారు. ఇందుకు సంబంధించి తమకు ఉపగ్రహ చిత్రాల సాక్ష్యాలు ఉన్నాయని, ఆ ఫైటర్ విమానం ఎక్కడినుంచి ఎక్కడు వెళ్లిందో వివరించాలని ఉక్రెయిన్ను నిలదీస్తున్నారు.