గోమాతకు సీమంతం
పుట్లూరు : పర్వదినాలతోపాటు, ప్రతి నిత్యం గోమాతను పూజిస్తారు. ఈ క్రమంలోనే పుట్లూరు మండలంల కేంద్రంలో బుధవారం రాత్రి గోమాతకు సీమంతం నిర్వహించి తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు గ్రామస్తులు. ముక్కోటి దేవతలు కొలువుదీరిన గోవుకు సీమంతం చేయడంతో గ్రామానికి, భక్తులకు సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెప్పారు. దీంతో ఆవు యజమాని రామకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఆవుకు ప్రత్యేక అలంకరణగావించారు. చీరె, పసుపు కుంకుమలు పెట్టి, మహిళలు సీమంతపు పాటలు పాడారు. కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఒంగోలు జాతికి చెందిన ఈ ఆవు గతంలో అందాల పోటీల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతులు గెలుచుకుంది.