అమిత్ షా సభలో రెచ్చిపోయిన పటేదార్లు
అమిత్ షా సభలో రెచ్చిపోయిన పటేదార్లు
Published Fri, Sep 9 2016 9:15 AM | Last Updated on Mon, May 28 2018 3:58 PM
సూరత్ : బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సభలో పటేదార్లు విరుచుకుపడ్డారు. విద్యా ఉద్యోగాల్లో తమకు కోటా కల్పించాలంటూ హార్థిక్ పటేల్ మద్దతు దారులు సభలోని కుర్చీలను, ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని నేతృత్వంలో కొత్తగా ఎంపికైన పటేదారు మంత్రులను గౌరవించడానికి ఈ సభను ఏర్పాటుచేశారు. బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కేవలం బీజేపీ బలాన్ని చూపించడానికే కాక, పటేల్ కమ్యూనిటీతో మళ్లీ బీజేపీ కనెక్ట్ అవుతుందనే సంకేతాలతో ఈ భారీ సభను ఏర్పాటుచేశారు. కొంతమంది పటేదార్లు నేతలు కూడా ఈ ప్రోగ్రామ్లో పాల్గొన్నారు.
అమిత్ షా స్టేజ్ మీదకు వచ్చిన అనంతరం కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా ప్రసంగించే సమయంలో ఈ రగడ చెలరేగింది. హార్థిక్, హార్థిక్ అంటూ నినాదాలు చేస్తూ సభలో ఏర్పాటుచేసిన కుర్చీలను విరగొట్టారు. వెంటనే స్పందించిన పోలీసులు 40 మంది పటేదార్ల నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులు నినదించిన హార్థిక్ పటేల్, పటేదార్లకు రిజర్వేషన్లు కల్పించాలంటూ గతేడాది 40 రోజులు ఆందోళన కొనసాగించిన సంగతి తెలిసిందే. పటేదార్ల కమ్యూనిటీని హర్ట్ చేస్తే, ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. ఈ విషయంపై అమిత్ షాకు కూడా ఫేస్బుక్లో హార్థిక్ చాలెంజ్ చేశాడు. రిజర్వేషన్ల కోసం పటేల్ కమ్యూనిటీ చేస్తున్న ఆందోళనకు దూరంగా ఉండాలని, తాను చనిపోయేంత వరకు ఈ ఉద్యమం ఆగదని వ్యాఖ్యానించారు.
Advertisement
Advertisement