ఆగంతకుల తుపాకి కాల్పులకు తాము బలయ్యే ప్రమాదముందని అత్యధిక అమెరికా టీనేజర్లు భయపడుతున్నారు. పాఠశాలల్లో కాల్పులకు చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలపై ప్రఖ్యాత అమెరికా పరిశోధనా సంస్థ ప్యూ (పీఈడబ్ల్యూ) రీసెర్చ్ సెంటర్ జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 57 శాతం పిల్లలు తాము చదువుకుంటున్న స్కూల్లోనే ఇలాంటి సంఘటన జరగొచ్చని భావిస్తున్నామని చెప్పారు. ఇలాంటి విపత్తుపై ప్రతి నలుగురిలో ఒకరు బాగా ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో మైనారిటీలైన హిస్పానిక్(లాటినోలు), నల్లజాతి పిల్లలు ఇలాంటి కాల్పులు జరిగే అవకాశంపై అత్యధికంగా భయపడుతున్నారు.
స్పానిష్ మూలాలున్న లాటినో పిల్లల్లో నాలుగింట మూడు వంతులు, నల్లజాతి టీనేజర్లలో 60 శాతం మంది తుపాకి కాల్పుల ప్రమాదంపై దిగులుపడుతున్నారు. ఫిబ్రవరి 14న ఫ్లారిడా రాష్ట్రంలోని పార్క్ లాండ్ స్కూల్లో పాత విద్యార్థి కాల్పుల్లో 17 మంది మరణించాక మార్చి 7ఏప్రిల్12 మధ్య 1317 ఏళ్ల వయసు అమెరికా పిల్లలు, అదే వయసు టీనేజర్ల తల్లిదండ్రులతో మాట్లాడి ప్యూ సంస్థ ఈ సర్వే జరిపించింది. తమ తరగతి గదుల్లో తుపాకితో దుండుగుడు వచ్చి కాల్పులు జరిపే అవకాశముందని తల్లిదండ్రులు ఎంత భయపడుతున్నారో వారి పిల్లలు కూడా అంతగా ఆందోళన చెందుతున్నారని ఈ అధ్యయనంలో తేలింది. తుపాకి కాల్పుల ప్రమాదం తమ పిల్లలు చదివే స్కూళ్లలో ఉందని 63 శాతం తల్లిదండ్రులు చెప్పారు.
టీచర్లకు గన్లు ఇవ్వద్దొంటున్న నల్లజాతి పిల్లలు!
పార్క్‌లాండ్‌లోని మార్జరీ స్టోన్‌మన్ డగ్లస్ హైస్కూల్ కాల్పుల ఘటన తర్వాత దేశవ్యాప్తంగా తుపాకుల సంస్కృతిపై ఆవేశపూరిత చర్చ జరిగింది. దుండగుల కాల్పులకు విరుగుడుగా స్కూలు టీచర్లకే తుపాకులు ఇవ్వడం మేలనే ప్రతిపాదన వచ్చింది. అయితే, పాఠశాల ఉపాధ్యాయులకు ఆయుధాలివ్వడాన్ని అత్యధిక టీనేజర్లు ముఖ్యంగా నల్లజాతి కుర్రాళ్లు వ్యతిరేకిస్తున్నారు. స్కూళ్లలో కాల్పుల ఘటనలు నివారించడానికి అత్యంత ప్రయోజనకరమైన చర్యలుమానసిక ఆరోగ్యంలేని వారికి తుపాకులు అందుబాటులో లేకుండా చేయడం, మానసిక ఆరోగ్య పరీక్షలు, చికిత్సల నాణ్యత మెరుగుపరచడమేనని ఈ సర్వేలో పాల్గొన్న పిల్లలు భావిస్తున్నారు.
స్కూళ్లలో మెటల్ డిటెక్టర్లు అమర్చడం, ఒకేసారి ఎక్కువ మందిని చంపడానికి వాడే తుపాకులపై నిషేధం వల్ల ఎక్కువ ఫలితముంటుందని చెప్పుకోదగ్గ సంఖ్యలో టీనేజర్లుఅభిప్రాయపడ్డారు. పార్క్‌లాండ్‌కాల్పుల ఘటన తర్వాత మానసిక ఆరోగ్య సేవల విస్తరణ వంటి చర్యలకు వీలు కల్పిస్తూ ఫ్లారిడా ఓ చట్టం చేసింది. అయితే, ఏఆర్‌తరహా అసాల్ట్‌తుపాకులపై నిషేధం విధించలేదు. విద్యార్థులు, స్కూలు సిబ్బందికి పాఠశాలల్లో భద్రతకు సంబంధించిన శిక్షణ పెంచడానికి ప్రాధాన్యమిస్తూ మార్చిలో అమెరికా కాంగ్రెస్‌ఓ బిల్లు ఆమోదించింది. - సాక్షి నాలెడ్జ్‌సెంటర్
భయపడుతున్నఅమెరికా టీనేజర్లు ప్యూ సర్వేలో వెల్లడి
Published Fri, Apr 20 2018 8:38 PM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment