
నంగునూరులో తుపాకుల కలకలం
రెండు తుపాకులు, తపంచా స్వాధీనం
నంగునూరు: పోలీసుల తనిఖీలో రెండు తుపాకులు, తపంచా వెలుగుచూడటం మెదక్ జిల్లాలో కలకలం రేపింది. నంగునూరు మండలం రాంపూర్ క్రాస్‌రోడ్డులోని ఓ ఇంట్లో ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు కూలిపనులకు వచ్చామని చెప్పి అద్దెకుదిగారు. శనివారం అర్ధరాత్రి ఏదో విషయమై గొడవకు దిగగా ఓ వ్యక్తికి తలపగిలి తీవ్ర గాయమైంది.
పెట్రోలింగ్ సిబ్బందితో అక్కడికి రాగానే ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. కృష్ణకుమార్ అనే వ్యక్తి వద్ద తుపాకీ లభించింది. ఇంట్లో సోదాలు నిర్వహించగా మరో తుపాకీ, ఒక తపంచా, 14 రౌండ్ల బుల్లెట్లు లభించాయి. ఈ నేపథ్యంలో సిద్దిపేట, చిన్నకోడూర్ పోలీసులు గ్రామాల్లో తనిఖీలు చేయడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.