హరిద్వార్ : చేతిలో గన్స్ పట్టుకుని ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ వీడియోలో ఆ వ్యక్తి రెండు చేతులతో గన్స్ పట్టుకుని హిందీ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోను పరిశీలిస్తే ఓ ఇంటిలో ఈ తతంగం సాగినట్టు తెలుస్తుండగా, ఇది ఎప్పుడు ఏ ప్రాంతంలో జరిగిందనేది తెలియరాలేదు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరు..ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది నిగ్గుతేల్చేందుకు దర్యాప్తు సాగిస్తున్నామని హరిద్వార్ సర్కిల్ ఆఫీసర్ అభయ్ సింగ్ పేర్కొన్నారు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి చర్యలు చేపడతామని చెప్పారు. ఈ ఘటన హరిద్వార్‌లో జరిగిందా లేక మరో ప్రాంతంలోనా అన్నది గుర్తిసామని తెలిపారు. ఈ ఏడాది జులైలో బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ ఛాంపియన్ రెండు చేతులతో గన్స్‌ను చూపుతూ బాలీవుడ్ పాటకు నృత్యాలు చేసిన వీడియో వెల్లడవడంతో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దర్యాప్తు అనంతరం ప్రణవ్ సింగ్ మూడు గన్‌ల లైసెన్స్‌లను రద్దు చేశారు. ఆయనను పార్టీ నుంచి తొలగించినట్టు బీజేపీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment