ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలిస్తాం: పద్మారావు
ఖమ్మం: తెలంగాణలోని ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు వెల్లడించారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..గతంలో ఎక్సైజ్ శాఖకు తుపాకులు ఉండేవని, మద్య నిషేధ సమయంలో వాటిని ప్రభుత్వానికి అప్పగించారని తెలిపారు.
ఇప్పుడు మళ్లీ తుపాకులను ఎక్సైజ్ శాఖకు ఇవ్వాల్సిన అవసరంపై ఆయా జిల్లాల అధికారులను నివేదికలు కోరామని, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వీరికి తుపాకులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.