మహాత్మా గాంధీతో పాటు మదన్ మోహన్ మాలవ్య (ఫైల్ ఫొటో)
న్యూ ఢిల్లీ : మహాత్ముడి సంతకంతో ఉన్న అరుదైన చిత్రాన్ని అమెరికాలో వేలం వేశారు. వేలంలో ఈ ఫోటో 41,806 డాలర్లు (సుమారు రూ. 27లక్షలు) పలికింది. ఈ ఫొటోలో మహాత్మా గాంధీతో పాటు మదన్ మోహన్ మాలవ్య కూడా ఉన్నారు. ఫొటో మీద మహాత్ముడు ‘ఎంకే గాంధీ’ అని ఫౌంటెన్ పెన్‌తో సంతకం చేశారు. ఈ ఫోటో 1931 సెప్టెంబరులో లండన్‌లో రెండో సెషన్ భారత రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం తీసిందని బోస్టన్‌కు చెందిన ఆర్ ఆర్ వేలం సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బాబీ లివింగ్ స్టన్ వెల్లడించారు. భారత నేషనల్ కాంగ్రెస్ తరపున గాంధీ ఈ సమావేశానికి హాజరయ్యారు.
53,000 డాలర్లు పలికిన కారల్ మార్క్స్ ఉత్తరం
ఇదే వేలంలో 19వ శతాబ్దానికి చెందిన కమ్యూనిస్టు, ఫిలాసఫర్ కారల్ మార్క్స్ రాసిన అరుదైన ఉత్తరాన్ని కూడా వేలం వేశారు. 1879, అక్టోబర్ 1న రాసిన ఈ ఉత్తరం 53 వేల డాలర్లు పలికింది. లండన్ నుంచి పంపించిన ఈ ఉత్తరంలో కారల్ మార్క్స్ తన పుస్తకం ‘రివిలేషన్స్’ను ఒక కాపీ పంపించమని రాడికల్ ఇంగ్లీష్ ఎడిటర్ కొల్లెట్ డబసన్‌ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment