madan mohan malaviya
-
41,806 డాలర్లు పలికిన అరుదైన చిత్రం
న్యూ ఢిల్లీ : మహాత్ముడి సంతకంతో ఉన్న అరుదైన చిత్రాన్ని అమెరికాలో వేలం వేశారు. వేలంలో ఈ ఫోటో 41,806 డాలర్లు (సుమారు రూ. 27లక్షలు) పలికింది. ఈ ఫొటోలో మహాత్మా గాంధీతో పాటు మదన్ మోహన్ మాలవ్య కూడా ఉన్నారు. ఫొటో మీద మహాత్ముడు ‘ఎంకే గాంధీ’ అని ఫౌంటెన్ పెన్‌తో సంతకం చేశారు. ఈ ఫోటో 1931 సెప్టెంబరులో లండన్‌లో రెండో సెషన్ భారత రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం తీసిందని బోస్టన్‌కు చెందిన ఆర్ ఆర్ వేలం సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బాబీ లివింగ్ స్టన్ వెల్లడించారు. భారత నేషనల్ కాంగ్రెస్ తరపున గాంధీ ఈ సమావేశానికి హాజరయ్యారు. 53,000 డాలర్లు పలికిన కారల్ మార్క్స్ ఉత్తరం ఇదే వేలంలో 19వ శతాబ్దానికి చెందిన కమ్యూనిస్టు, ఫిలాసఫర్ కారల్ మార్క్స్ రాసిన అరుదైన ఉత్తరాన్ని కూడా వేలం వేశారు. 1879, అక్టోబర్ 1న రాసిన ఈ ఉత్తరం 53 వేల డాలర్లు పలికింది. లండన్ నుంచి పంపించిన ఈ ఉత్తరంలో కారల్ మార్క్స్ తన పుస్తకం ‘రివిలేషన్స్’ను ఒక కాపీ పంపించమని రాడికల్ ఇంగ్లీష్ ఎడిటర్ కొల్లెట్ డబసన్ను కోరారు. -
అదే ఆయన ప్రత్యేకత: మోదీ
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి 91వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వాజపేయి నాయకత్వ లక్షణాలను ఆయన గుర్తు చేశారు. దేశానికి కీలక సమయంలో అసామాన్య నాయకత్వం అందించిన గొప్ప వ్యక్తి వాజపేయి అని, ఆయనకు సెల్యూట్ చేస్తున్నామన్నారు. పార్టీ నాయకుడు, పార్లమెంటేరియన్, మంత్రి, ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయన ఆయా పదవులకు వన్నె తెచ్చారని, అదే వాజపేయి ప్రత్యేకత అని ట్వీట్ చేశారు. ఈ సాయంత్రం ఢిల్లీకి తిరిగిరాగానే వాజపేయి నివాసానికి వెళ్లి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పనున్నట్టు వెల్లడించారు. రష్యా నుంచి ఈ ఉదయం ప్రధాని మోదీ కాబూల్ చేరుకున్నారు. అఫ్గానిస్థాన్ పార్లమెంట్ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. కాగా, పండిత్ మదన్ మోహన్ మాలవీయ జయంతి సందర్భంగా ఆయన సేవలను మోదీ స్మరించుకున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె కూడా వాజపేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. -
మాలవీయ, వాజ్‌పేయిలకు భారతరత్న
- భారత 65వ గణతంత్ర దినోత్సవాలకు జపాన్ ప్రధానమంత్రి షింజో అబే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. - నార్వే మాజీ ప్రధాన మంత్రి జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ నాటో సెక్రటరీ జనరల్‌గా మార్చి 27న ఎంపికయ్యారు. - మిస్ ఇండియా -2014 కిరీటాన్ని ఢిల్లీ యువతి కోయల్ రాణా కైవసం చేసుకుంది. - భారత నావికాదళ అధిపతిగా అడ్మిరల్ రాబిన్ కే ధోవన్ ఏప్రిల్ 17న బాధ్యతలు స్వీకరించారు. - జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ మే 30న నియమితులయ్యారు. - కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే (64) న్యూఢిల్లీలో జూన్ 3న రోడ్డు ప్రమాదంలో మరణించారు. - 16వ లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్ జూన్ 6న బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిని అలంకరించిన రెండో మహిళ ఆమె. - భారత 14వ అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గిని కేంద్రం మే 28న ఎంపిక చేసింది. - ఇక్రిశాట్ రాయబారులుగా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ నియమితులయ్యారు. - సైనిక దళాల కొత్త ప్రధానాధికారిగా జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ జూలై 31న బాధ్యతలు స్వీకరించారు. - చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్‌గా భారత వాయుసేన అధిపతి అరూప్‌రాహా జూలై 30న బాధ్యతలు చేపట్టారు. - లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా ఏఐఏడీఎంకే ఎంపీ తంబిదురై ఆగస్టు 13న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. - పోలెండ్ ప్రధాని డోనాల్డ్ టుస్క్ యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఆగస్టు 30న ఎన్నికయ్యారు. - అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్‌పోల్ ప్రచార కర్తగా బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్ ఆగస్టు 28న ఎంపికయ్యారు. - ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కొత్త హైకమిషనర్‌గా జోర్డాన్ యువరాజు జీద్ అల్ - హుస్సేన్ సెప్టెంబర్ 7న బాధ్యతలు చేపట్టారు. - లోక్‌సభ నైతిక విలువల కమిటీ అధ్యక్షుడిగా బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ నియమితులయ్యారు. . - జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా లలితా కుమార మంగళంను సెప్టెంబర్ 17న కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ నియమించింది. - సుప్రీంకోర్టు 42వ ప్రధాన న్యాయమూర్తిగా హంద్యాల లక్ష్మీనారాయణ స్వామి దత్తు సెప్టెంబర్ 28న నియమితులయ్యారు. - బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ అక్టోబర్ 9న యునిసెఫ్ దక్షిణ ఆసియా రాయబారిగా నియమితులయ్యారు. - ప్రసార భారతి బోర్డు చైర్మన్‌గా సీనియర్ పాత్రికేయుడు సూర్య ప్రకాశ్ అక్టోబరు 28న ఎంపికయ్యారు. - ఫోర్బ్స్ పత్రిక నవంబరు 5న విడుదల చేసిన ప్రపంచ శక్తిమంతుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ 15వ స్థానంలో నిలిచారు. జాబితాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు ఒబామా, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తొలి మూడు స్థానాల్లో నిలిచారు. - భారత్‌లో అత్యంత శక్తిమంతులైన 50 మంది మహిళా వ్యాపారవేత్తల జాబితాలో ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య అగ్రస్థానంలో నిలిచారు. ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ చందాకొచ్చర్‌కు రెండు, యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ శిఖాశర్మకు మూడో స్థానం దక్కింది. - ఐక్యరాజ్యసమితి దక్షిణాసియా మహిళా విభాగం గుడ్‌విల్ అంబాసిడర్‌గా భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా, బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ నియమితులయ్యారు. - సీబీఐ కొత్త డెరైక్టర్‌గా అనిల్ కుమార్ సిన్హా డిసెంబరు 3న బాధ్యతలు చేపట్టారు. - మిస్ సుప్రనేషనల్ -2014 కిరీటాన్ని భారత యువతి ఆశాభట్ గెలుచుకున్నారు. - మిస్ వరల్డ్-2014 కిరీటాన్ని మిస్ దక్షిణాఫ్రికా రోలిన్ స్ట్రాస్ దక్కించుకుంది. . - జపాన్ ప్రధానిగా షింజో అబే, మారిషస్ ప్రధానిగా అనిరుధ్ జగన్నాథ్ ఎన్నికయ్యారు. - కేరళకు చెందిన ఫాదర్ కురియకోస్ ఇలియాస్ ఛవారా (1805-71), సిస్టర్ యూఫ్రేసియా (1877- 1952)లు సెయింట్‌హుడ్ పొందారు. వీరిని మహిమాన్వితులుగా, బాధితులకు సాంత్వన కలిగించే ఆరాధ్యదైవాలుగా పోప్ ప్రకటించారు. - భారత్‌కు అమెరికా రాయబారిగా భారత సంతతికి చెందిన రిచర్డ్ రాహుల్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. - రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) అధిపతిగా రాజిందర్ ఖన్నా, సీఆర్పీఎఫ్ డెరైక్టర్ జనరల్‌గా ప్రకాశ్మిశ్రాను కేంద్రం డిసెంబర్ 19న నియమించింది. - ఇస్రో చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్‌కు ప్రముఖ అంత ర్జాతీయ సైన్స్ పత్రిక నేచర్ 2014 ఏడాదికి టాప్-10 శాస్త్రవేత్తల్లో స్థానం లభించింది. కొత్త ముఖ్యమంత్రులు రాష్ట్రం-పేరు: ఉత్తరాఖండ్-హరీష్ రావత్; బీహార్- జీతన్‌రాం మాంఝీ; ఒడిశా-నవీన్ పట్నాయక్; గుజరాత్-ఆనందీబెన్ పటేల్; సిక్కిం-పవన్ కుమార్ చామ్లింగ్; నాగాలాండ్-టీఆర్ జెలియాంగ్; తమిళనాడు-పన్నీర్ సెల్వం; హర్యానా-మనోహర్‌లాల్ ఖట్టర్; మహారాష్ట్ర-దేవేంద్ర గంగాధర్రావ్ ఫడ్నవీస్; గోవా-లక్ష్మీకాంత్ పర్సేకర్; జార్ఖండ్-రఘుబార్ దాస్. నూతన గవర్నర్లు రాష్ట్రం-పేరు: ఉత్తరప్రదేశ్-రామ్ నాయక్; గుజరాత్ - ఓమ్ ప్రకాశ్ కోహ్లి; పశ్చిమ బెంగాల్-కేసరినాథ్ త్రిపాఠి; చత్తీస్‌గఢ్-బలరాందాస్ టాండన్; నాగాలాండ్-పద్మనాభ ఆచార్య; హర్యానా-కప్టన్ సింగ్ సోలంకి; మహారాష్ట్ర- సీహెచ్ విద్యాసాగర్ రావు; రాజస్థాన్-కళ్యాణ్ సింగ్; కర్ణాటక-వాజూభాయ్ రూడాభాయ్ వాలా; గోవా-మృదులా సిన్హా; కేరళ- జస్టిస్ పి. సదాశివం. - పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నర్సింహా రెడ్డి డిసెంబర్ 27న నియమితులయ్యారు. అవార్డులు - కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మ’ పురస్కారాలను జనవరి 25న ప్రకటించింది. వీటిలో రెండు పద్మ విభూషణ్, 24 పద్మ భూషణ్, 101 పద్మశ్రీ ఉన్నాయి. పద్మ విభూషణ్‌కు డాక్టర్ రఘునాథ్ ఎ.మషేల్కర్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్-మహారాష్ట్ర), బి.కె.ఎస్. అయ్యంగార్ (యోగా-మహారాష్ట్ర), తెలుగువారిలో పద్మ భూషణ్‌ను దివంగత అనుమోలు రామకృష్ణ (సైన్స్, ఇంజనీరింగ్), పుల్లెల గోపీచంద్ (క్రీడలు- బ్యాడ్మింటన్) అందుకున్నారు. - 86వ ఆస్కార్ అవార్డుల వివరాలు.. గ్రావిటీ చిత్రానికి ఏడు అవార్డులు దక్కాయి. ఉత్తమ చిత్రం: 12 ఇయర్స ఎ స్లేవ్, ఉత్తమ విదేశీ భాషా చిత్రం: ద గ్రేట్ బ్యూటీ (ఇటలీ) - 2013 గాంధీ శాంతి బహుమతికిప్రముఖ గాంధేయ వాది, పర్యావరణ వేత్త చాందీ ప్రసాద్ భట్ ఎంపికయ్యారు. చిప్కో ఉద్యమ నిర్మాతల్లో చాందీ ఒకరు. - ప్రముఖ కవి, సినీ గేయ రచయిత, దర్శక, నిర్మాత గుల్జార్‌ను ప్రతిష్ఠాత్మక 45వ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. గుల్జార్ అసలుపేరు సంపూరణ్ సింగ్ కల్రా. - భారత సంతతికి చెందిన విజయ్ శేషాద్రికి 2014 పులిట్జర్ అవార్డు వరించింది. - ప్రతిష్ఠాత్మక జ్ఞాన్‌పీఠ్ పురస్కారం-2013 (49వది) ప్రముఖ హిందీ కవి కేదార్నాథ్ సింగ్‌కు ప్రకటించారు. - భారత సంతతికి చెందిన మంజుల్ భార్గవకు గణిత శాస్త్రంలో నోబెల్ గా భావించే ఫీల్డ్స్ మెడల్ లభించింది. - ఉత్తమ పార్లమెంటేరియన్ల వివరాలు.. 2010-అరుణ్ జైట్లీ (బీజేపీ); 2011-కరణ్‌సింగ్ (కాంగ్రెస్); 2012-శరద్ యాదవ్ (జేడీయూ); - జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులను హతమార్చి, అమరుడైన ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్‌కు అశోక చక్రను కేంద్రం ప్రకటించింది. - టాటా వ్యవస్థాపకుడు జెంషెడ్జీ టాటాకు చెందిన ముంబైలోని ఎస్ప్లాండే హౌస్‌కు యునెస్కో ఆసియా-పసిఫిక్ వారసత్వ అవార్డు లభించింది. మహారాష్ట్ర కిన్హాల్ గ్రామం సతారాలోని శ్రీ సఖరగద్ నివాసిని దేవి దేవాలయ ప్రాంగణం కూడా ఈ అవార్డుకు ఎంపికైంది. నోబెల్ బహుమతులు - వైద్యం: బ్రిటన్ అమెరికన్ జాన్ ఓ కీఫ్, నార్వే జంట, ఎడ్వర్డ్ మోసర్, మేబ్రిట్ మోసర్. ఫిజిక్స్: జపాన్‌కు చెందిన ఇసాము అకసాకి, హిరోషి అమానో, జపాన్‌లో పుట్టి అమెరికాలో స్థిరపడిన సుజి నకమురాలు. రసాయన శాస్త్రం: అమెరికా శాస్త్రవేత్తలు ఎరిక్ బెట్జిగ్, విలియం మోర్నర్ , జర్మన్‌కు చెందిన స్టీఫెన్ హెల్. ఆర్థిక శాస్త్రం: ఫ్రాన్స్ ఆర్థిక వేత్త జీన్ టిరోల్. సాహిత్యం: పాట్రిక్ మోడియానో(ఫ్రాన్స్). శాంతి: కైలాశ్ సత్యార్థి (భారత్), మలాలా యూసుఫ్ జాయ్ (పాకిస్థాన్)లు సంయుక్తంగా ఎంపికయ్యారు. - మ్యాన్ బుకర్ ప్రైజ్ -2014 ఆస్ట్రేలియా రచయిత రిచర్డ్ ప్లనగన్ను వరించింది. - జమ్మూకాశ్మీర్‌కు చెందిన మహిళా పోలీసు శక్తిదేవికి ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా శాంతి పరిరక్షకురాలు-2014 అవార్డు లభించింది. - మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జపాన్ జాతీయ పురస్కారం ది గ్రాండ్ కార్డన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ పౌలోనియా ఫ్లవర్స్‌కు ఎంపికయ్యారు. - ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతి-2014కు ఇస్రో ఎంపికైంది. - భారత-అమెరికన్ నేహాగుప్తాకు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పిల్లల శాంతి బహుమతి-2014 లభించింది. - అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం-2014ను బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు డిసెంబరు 27న అందించారు. - ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ (84) చెన్నైలో డిసెంబరు 23న మరణించారు. తెలుగు, కన్నడ, హిందీ భాష ల్లో 101 చిత్రాలకు దర్శకత్వం వహించారు. - స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ విద్యావేత్త మదన్మోహన్ మాలవీయ (మరణానంతరం), మాజీ ప్రధానమంత్రి అటల్ బీహరీ వాజ్‌పేయిలకు ప్రభుత్వం డిసెంబరు 25న దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. - మదన్ మోహన్ మాలవీయ: లీడర్ అనే ఆంగ్ల పత్రికను, మరియాద అనే హిందీ వార పత్రికను ప్రారంభించారు. బెనారస్ హిందూ విశ్వ విద్యాలయాన్ని స్థాపించారు. 1931లో రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. 1946 నవంబరు 12న మరణించారు. - అటల్ బీహారి వాజ్‌పేయి: పదో భారత ప్రధాని. 1996లో 13 రోజులు, 1998-1999 మధ్య 13 నెలలు, 1999-2004 వరకు పూర్తి కాలం ప్రధానమంత్రిగా పనిచేశారు. 1980లో షెకావత్, ఎల్కే అద్వానీతో కలిసి భారతీయ జనతా పార్టీని స్థాపించారు. ఆయన గొప్పవక్త, కవి. భారత రత్న పొందిన ఏడో ప్రధాని వాజ్‌పేయి. 1998 మేలో రెండో అణు పరీక్ష, 1999 కార్గిల్ విజయం ఆయన హయాంలోనే చోటు చేసుకున్నాయి. ప్రపంచంలోనే ఎత్తై ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలైన బాలికగా నిజామాబాద్ జిల్లా తాడ్వాయి గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థిని మాలావత్ పూర్ణ (13) ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మరో తెలుగు విద్యార్థి ఆనంద్‌కుమార్ ఎవరెస్ట్‌ను ఎక్కిన అత్యంత పిన్న వయస్కుడి (17)గా ఘనతను సాధించాడు. ‘మైక్రోసాఫ్ట్’ సీఈఓగా సత్య నాదెళ్ల ఫిబ్రవరి 4న నియమితులయ్యారు. ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ నోకియా ముఖ్య కార్య నిర్వహణ అధికారిగా భారత్‌కు చెందిన రాజీవ్ సూరి ఎంపికయ్యారు. -
భారతరత్న మాలవీయ
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులైన మదన్ మోహన్ మాలవీయ ఆ బృహత్ కర్తవ్యంలో ఉండగా ఎన్నో సమస్యలు చుట్ట్టు ముట్టాయి. ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిం ది. దేశభక్తి నిండిన ఆయన విద్యావ్యాప్తికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిన ద్రష్ట. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలనే ఆయన దృఢనిశ్చయం సడలలేదు. ఊరూరూ తిరిగి, ఎందరినో కలసి విరాళాలు పోగుచేశారు. ఆ సందర్భం గా హైదరాబాద్ నిజాం నవాబును కూడా కలసి విరా ళం అడిగారు. దానికి నిజాం నవాబు... ‘‘ఎంత ధైర్యం హిందూ విశ్వ విద్యాలయం స్థాపన కోసం నన్నే విరాళం అడుగుతావా?’’ అని ఆగ్రహించి, తన కాలి చెప్పుని తీసి ఆయనపైకి విసిరాడు. మాలవీయగారు మారు మాట్లాడకుండా ఆ చెప్పుని తీసుకుని బజారులో వేలం వెయ్యడం మొదలుపెట్టారట. నవాబుగారి చెప్పు అని చాలామంది పోటీపడి వేలం పాడసాగారట. ఇది తెలిసి నవాబుగారు ‘‘ఎవరైనా నా చెప్పుని తక్కువ ధరకు కొంటే ఎంత అవ మానం’’ అని భటులని పంపి పెద్ద మొత్తానికి తానే వేలంలో కొనుక్కు న్నారట. ఏ పరిస్థితిని అయినా అవకాశంగా మలచుకున్నవారే గొప్ప నేతలు. మాలవీయకు భారతరత్న గుర్తింపు సమంజసం. - తలారి సుధాకర్ కోహెడ, కరీంనగర్ -
ప్రజ్ఞాశాలి మాలవీయ
న్యూఢిల్లీ: బెనారస్ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడైన మదన్ మోహన్ మాలవీయ బహుముఖ వ్యక్తిత్వం కలిగిన విద్యావేత్త. హిందూ మహాసభ తొలినాళ్ల నాయకుడైన మాలవ్యా సమాజ సంస్కర్త, విజయవంతమైన పార్లమెంటేరియన్. స్వాతంత్య్రోద్యమ పథనిర్దేశకులలో ఒకరిగా చెప్పుకోదగిన మాలవీయ మితవాదులకు, అతివాదులకు మధ్య వారధిగా పనిచేశారు. 1886లో కోల్‌కతా (అప్పటి కలకత్తా)లో జరిగిన రెండవ కాంగ్రెస్ మహాసభలో స్ఫూర్తిదాయకమైన తన ప్రసంగంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. యాైభైఏళ్లపాటు ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడుగా నాలుగుసార్లు పనిచేశారు. జాతిపిత మహాత్మా గాంధీ పిలుపుతో 1930లో ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమాల్లో పాల్గొని స్వచ్ఛందంగా అరెస్టయ్యారు. - ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ(అలహాబాద్)లో 1861 డిసెంబర్ 25న విద్యావంతులైన హిందూ కుటుంబంలో మాలవీయ జన్మించారు. అలహాబాద్ జిల్లా స్కూలులో ఉపాధ్యాయుడుగా ఉద్యోగ జీవితం ప్రారంభించినా, ఉద్యోగంతోపాటు చదువునూ కొనసాగించారు. - న్యాయవాద విద్యను పూర్తిచేసి, జిల్లాకోర్టు, హైకోర్టులలో న్యాయవాద వృత్తిని చేపట్టారు. పేదకుంటుంబంలో పుట్టినా న్యాయవాద వృత్తితో భారీగా సంపాదించారు. చివరకు సుఖాలు, సదుపాయాలు, సంపాదననూ వదులుకొని దేశసేవే లక్ష్యంగా స్వరాజ్య సమరంలో ప్రవేశించారు. మళ్లీ పేదరికానికే చేరువయ్యారు. - అలహాబాద్నుంచి ప్రచురితమయ్యే ‘లీడర్’ అనే శక్తిమంతమైన ఆంగ్లపత్రికను 1909లో ప్రారంభించారు. - అలహాబాద్ మునిసిపల్ బోర్డు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొని, 1903-1920 మధ్య ప్రొవిన్సీయల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడుగా పనిచేశారు. 1910-20మధ్య సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడుగా, 1916-18 మధ్య ఇండియన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడుగా ఉన్నారు. 1931లో రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. - 1937లో క్రియాశీలక రాజకీయాలకు స్వస్తి చె ప్పి, సామాజిక సమస్యలపై దృష్టి కేంద్రీకరించారు. మహిళల విద్యావకాశాలకోసం, వితంతు పునర్వివాహాల కోసం కృషిచేశారు. బాల్యవివాహాలను తీవ్రంగా వ్యతిరేకించారు. -మాలవ్యా 1946 నవంబర్ 12న కన్నుమూశారు. -
వారి సేవలకు సరైన గుర్తింపు
వాజ్‌పేయి, మాలవీయలకు భారతరత్న పురస్కారంపై మోదీ చాలా సంతోషంగా ఉందని ట్వీటర్లో హర్షం న్యూఢిల్లీ: పండిట్ మదన్ మోహన్ మాలవీయ, అటల్ బిహారీ వాజ్‌పేయిలకు భారతరత్న పురస్కారం ప్రకటించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని వారికి ప్రకటించడం.. దేశానికి ఆ మహానుభావులు చేసిన సేవలకు లభించిన సరైన గుర్తింపని అభివర్ణించారు. భారతరత్న పురస్కారాల ప్రకటన వెలువడగానే ‘చాలా సంతోషంగా ఉంద’ంటూ మోదీ ట్వీట్ చేశారు. ‘గొప్ప పండితుడిగా, ప్రజల్లో జాతీయ వాదాన్ని రగుగొల్పిన స్వాతంత్య్ర సమరయోధుడిగా మాలవీయ గుర్తుండిపోతారు’ అని మరో ట్వీట్లో ప్రశంసించారు. ‘ఒక దార్శనికుడు, స్ఫూర్తిప్రదాత, ప్రముఖుల్లోకెల్లా ప్రముఖుడు, భారత్‌కు ఆయన చేసిన సేవలు అమూల్యం’ అంటూ వాజ్‌పేయిని కొనియాడారు. వాజ్‌పేయితో నాది అరుదైన స్నేహం: అద్వానీ వాజ్‌పేయికి భారతరత్న పురస్కారం అందిస్తున్న విషయం తెలియగానే వాజ్‌పేయితో ఐదు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉన్న బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘వాజ్‌పేయి అసామాన్య దేశభక్తుడు. ఎలాంటి కళంకం, వివాదం లేకుండా పాలన సాగించిన ప్రధాని ఆయనొక్కరే’ అన్నారు. ఇద్దరు దేశభక్తులకు భారతరత్న ప్రకటించడాన్ని మనఃస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానన్నారు. వాజ్‌పేయికి భారతరత్న ఇవ్వాల్సిందిగా 2008లోనే అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు తాను లేఖ రాశానన్నారు. వాజ్‌పేయితో తన స్నేహం అరుదైందని, కన్నాట్‌ప్లేస్‌లోని చాట్ భండార్ వద్ద తమకిష్టమైన గోల్గప్పవాలా తినేందుకు తన స్కూటర్‌పై ఇద్దరం కలసి వెళ్లేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. వాజ్‌పేయిని గొప్ప ఏకాభిప్రాయ సాధకుడని అద్వానీ ఓ టీవీ చానల్‌తో అన్నారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన పీడీపీ ముఖ్యనేత ముఫ్తీ మొహమ్మద్ సయీద్, ప్రముఖ ఆర్థిక వేత్త, భారతరత్న, నోబెల్ పురస్కారాల గ్రహీత అమర్త్యసేన్, జేడీయూ సీనియర్ నేత నితీశ్‌కుమార్‌లు వాజ్‌పేయికి భారతరత్న ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. బిహార్ శాసనమండలిలో నితీశ్‌కుమార్ ఈ మేరకు ఒక తీర్మానాన్ని తీసుకువచ్చారు. విదేశాంగమంత్రి సుస్మా స్వరాజ్ స్వయంగా వాజ్‌పేయి నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా హర్షం వ్యక్తం చేసింది. ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే.. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ‘రాజధర్మం పాటించాలంటూ’ వాజ్‌పేయి మోదీకి చేసిన హితబోధను గుర్తు చేసింది. కాగా, మాలవీయకు భారతరత్న ప్రకటించడాన్ని చరిత్రకారుడు రామచంద్ర గుహ తప్పుబట్టారు. మాలవీయకన్నా అర్హులైన రబీంద్రనాథ్ టాగూర్, ఫూలే, తిలక్, గోఖలే, వివేకానంద, అక్బర్, శివాజీ లాంటి భారతీయులు చాలామంది ఉన్నారని ట్వీటర్లో పేర్కొన్నారు. బాల్ ఠాక్రేకూ ఇవ్వాలి: శివసేన భారతరత్నను శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రేకు కూడా ప్రకటించాలని బీజేపీ మిత్రపక్షం శివసేన డిమాండ్ చేసింది. వాజ్‌పేయి, మాలవీయలకు ఈ పురస్కారాలను ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూనే.. బాల్ ఠాక్రే కూడా అందుకు అర్హుడేనని పేర్కొంది. ఇతర స్పందనలు..: ‘పండిట్ మాలవీయ, అటల్ బిహారీ వాజ్‌పేయిలకు భారతరత్న ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. వారిద్దరినీ నేను అంతర్జాతీయ ప్రముఖులుగా భావిస్తాను. వాజ్‌పేయి రాసిన గీత్ నయా గాతా హూ గీతాన్ని పాడి ఆయనకు అంకితమిస్తున్నాను’ - లతా మంగేష్కర్, ప్రఖ్యాత గాయని, 2001 భారతరత్న గ్రహీత ‘ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. వాజ్‌పేయి అంటే మాకందరికీ ప్రేమ, గౌరవం’ - మమతా బెనర్జీ, పశ్చిమబెంగాల్ సీఎం, వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు చంద్రబాబు, కేసీఆర్ హర్షం సాక్షి, హైదరాబాద్: వాజ్‌పేయి, మాలవీయలకు భారతరత్న ప్రకటించటంపై ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లు హర్షం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన మరో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించకపోవడం వెలితిగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. భారతరత్న పొందే అన్ని అర్హతలు పీవీ నరసింహారావుకు ఉన్నట్టు ఆయన వివరించారు. ఇప్పటికైనా పీవీకి భారతరత్న ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు. -
మాలవీయ, వాజ్‌పేయి భారత రత్నాలు
* దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించిన కేంద్రం * మరణానంతరం పండిట్ మదన్మోహన్ మాలవీయకు పురస్కారం * స్వాతంత్య్ర సమరయోధుడు, హిందూ జాతీయవాది మాలవీయ * బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు కూడా * అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర నేత వాజ్‌పేయి * కార్గిల్ విజయం, అణు పరీక్షలతో పేరు ప్రతిష్టలు న్యూఢిల్లీ: విద్యావేత్త, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత పండిట్ మదన్మోహన్ మాలవీయ.. మాజీ ప్రధాని, బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు అటల్ బిహారీ వాజ్‌పేయిలకు భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను ప్రకటించింది. వీరిద్దరికీ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రకటిస్తూ రాష్ట్రపతి భవన్ బుధవారం ప్రకటన విడుదల చేసింది. వాజ్‌పేయి 90వ జన్మదినం, మాలవీయ 153వ జయంతి అయిన డిసెంబర్ 25కు ఒకరోజు ముందు ఈ ప్రకటన వెలువడటం విశేషం. వీరితో కలిపి ఇప్పటివరకు 45 మందికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రకటించారు. గత సంవత్సరం క్రికెటర్ సచిన్ తేందూల్కర్, ప్రఖ్యాత శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావులకు భారత రత్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు ఈ పురస్కారం అందుకున్నవారిలో సి.రాజగోపాలాచారి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, జవహర్లాల్ నెహ్రూ, సీవీ రామన్, జయప్రకాశ్ నారాయణ్, మదర్ థెరిసా, లతామంగేష్కర్, జేఆర్డీ టాటా తదితరులున్నారు. అందరివాడు అటల్జీ! భారత రాజకీయాల్లో వాజ్‌పేయి అజాత శత్రువు, స్థితప్రజ్ఞుడు, మృదు భాషి, కవి, రాజనీతిజ్ఞుడుగా పేరుగాంచారు. రాజకీయ స్పర్థలకు అతీతంగా అందరూ అభిమానించే వాజ్‌పేయి.. బీజేపీ తరఫున ప్రధాని పదవి చేపట్టిన మొదటి వ్యక్తిగా నిలిచారు. అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర వ్యక్తిగా రికార్డు సృష్టించారు. జాతీయ రహదారులను అనుసంధానిస్తూ చేపట్టిన స్వర్ణ చతుర్భుజి పథకం, పాకిస్తాన్‌తో శాంతి ప్రయత్నం, పోఖ్రాన్ అణు పరీక్షలు, కార్గిల్ యుద్ధ విజయం.. ప్రధానిగా వాజ్‌పేయి పరిపాలనాపటిమకు నిదర్శనాలుగా నిలిచాయి. ధారాళంగా కవితాత్మకంగా సాగే ప్రసంగశైలి.. రాజకీయ ప్రత్యర్థులు సైతం అభిమానించే వాక్పటిమ ఆయన సొంతం. అనారోగ్య కారణాలతో కొద్దికాలంగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ‘సత్యమేవ జయతే’.. పండిట్ మాలవీయ! హిందూ జాతీయ వాదిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన పండిట్ మదన్మోహన్ మాలవీయకు మరణానంతరం ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రకటించారు. 1861లో జన్మిం చిన మాలవీయ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడిగా విద్యారంగ అభివృద్ధికి కృషి చేశారు. హిందూ మహాసభ తొలితరం నేతగా పలు సామాజిక సంస్కరణల కోసం కృషి చేశారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ‘సత్యమేవ జయతే’ నినాదానికి ప్రఖ్యాతి కల్పించిన వారు పండిట్ మాలవీయ.. గురువారం 91వ పడిలోకి అడుగుపెడుతున్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఆయన నివాసంలో కలసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న కేంద్ర మంత్రి అనంత్‌కుమార్. చిత్రంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్. అనారోగ్యం కారణంగా కొన్నేళ్లుగా వాజ్‌పేయి తన నివాసానికే పరిమితం కావడం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఆయన ఫొటో బయటికి రావడం ఇదే తొలిసారి. (వాజ్‌పేయిని కలసిన అనంతరం ఈ ఫొటోను అనంత్‌కుమార్ తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు) -
ఫోర్త్ ఏస్టేట్: భారతరత్నకు దారేది..?
-
వాజ్‌పేయి, మాలవ్యాలకు భారత రత్న?
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి, ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు మదన్ మోహన్ మాలవ్యాకు అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’ అవార్డును కేంద్రప్రభుత్వం ప్రకటించనున్నట్టు తెలిసింది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు జాతీయ మీడియా మంగళవారం రాత్రి తెలియజేసింది. వాజ్‌పేయి పేరుమీద ఓ వెబ్‌పేజీ: మాజీ ప్రధాని వాజ్‌పేయి ఇంగ్లిష్, హిందీలో చేసిన 300 ప్రసంగాలు, ఆయన జీవిత విశేషాలను తెలియజేసే చిత్రాలతో కేంద్ర ప్రభుత్వ పత్రికా సమాచార విభాగం (పీఐబీ) వెబ్‌పేజీని ప్రారంభించింది. పీఐబీ అధికారిక వెబ్సైట్లోనే దీన్ని ఏర్పాటు చేశారు.