మాలవీయ, వాజ్‌పేయిలకు భారతరత్న | Atal Bihari Vajpayee and Madan Mohan Malviya chosen for Bharat Ratna award | Sakshi
Sakshi News home page

మాలవీయ, వాజ్‌పేయిలకు భారతరత్న

Published Wed, Dec 31 2014 10:45 PM | Last Updated on Sat, Sep 2 2017 7:02 PM

మాలవీయ, వాజ్‌పేయిలకు భారతరత్న

మాలవీయ, వాజ్‌పేయిలకు భారతరత్న

-    భారత 65వ గణతంత్ర దినోత్సవాలకు జపాన్ ప్రధానమంత్రి షింజో అబే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
 
 -    నార్వే మాజీ ప్రధాన మంత్రి జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ నాటో సెక్రటరీ జనరల్‌గా మార్చి 27న ఎంపికయ్యారు.
 
 -    మిస్ ఇండియా -2014 కిరీటాన్ని ఢిల్లీ యువతి కోయల్ రాణా కైవసం చేసుకుంది.
 
 -    భారత నావికాదళ అధిపతిగా అడ్మిరల్ రాబిన్ కే ధోవన్ ఏప్రిల్ 17న బాధ్యతలు స్వీకరించారు.
 
 -    జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ మే 30న నియమితులయ్యారు.
 
 -    కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే (64) న్యూఢిల్లీలో జూన్ 3న రోడ్డు ప్రమాదంలో మరణించారు.
 
 -    16వ లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్ జూన్ 6న బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిని అలంకరించిన రెండో మహిళ ఆమె.
 
 -    భారత 14వ అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గిని కేంద్రం మే 28న ఎంపిక చేసింది.
 
 -    ఇక్రిశాట్ రాయబారులుగా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ నియమితులయ్యారు.
 
 -    సైనిక దళాల కొత్త ప్రధానాధికారిగా జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ జూలై 31న బాధ్యతలు స్వీకరించారు.
 
 -    చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్‌గా భారత వాయుసేన అధిపతి అరూప్‌రాహా జూలై 30న బాధ్యతలు చేపట్టారు.
 
 -    లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా ఏఐఏడీఎంకే ఎంపీ తంబిదురై ఆగస్టు 13న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
 
 -    పోలెండ్ ప్రధాని డోనాల్డ్ టుస్క్ యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఆగస్టు 30న ఎన్నికయ్యారు.
 
 -    అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్‌పోల్ ప్రచార కర్తగా బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్ ఆగస్టు 28న ఎంపికయ్యారు.
 
 -    ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కొత్త హైకమిషనర్‌గా జోర్డాన్ యువరాజు జీద్ అల్ - హుస్సేన్ సెప్టెంబర్ 7న బాధ్యతలు చేపట్టారు.
 
 -    లోక్‌సభ నైతిక విలువల కమిటీ అధ్యక్షుడిగా బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ నియమితులయ్యారు.
 .
-    జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా లలితా కుమార మంగళంను సెప్టెంబర్ 17న కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ నియమించింది.
 
 -    సుప్రీంకోర్టు 42వ ప్రధాన న్యాయమూర్తిగా హంద్యాల లక్ష్మీనారాయణ స్వామి దత్తు సెప్టెంబర్ 28న నియమితులయ్యారు.
 
 -    బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ అక్టోబర్ 9న యునిసెఫ్ దక్షిణ ఆసియా రాయబారిగా నియమితులయ్యారు.
 
 -    ప్రసార భారతి బోర్డు చైర్మన్‌గా సీనియర్ పాత్రికేయుడు సూర్య ప్రకాశ్ అక్టోబరు 28న ఎంపికయ్యారు.
 
 -    ఫోర్బ్స్ పత్రిక నవంబరు 5న విడుదల చేసిన ప్రపంచ శక్తిమంతుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ 15వ స్థానంలో నిలిచారు. జాబితాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు ఒబామా, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
 
-    భారత్‌లో అత్యంత శక్తిమంతులైన 50 మంది మహిళా వ్యాపారవేత్తల జాబితాలో ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య అగ్రస్థానంలో నిలిచారు. ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ చందాకొచ్చర్‌కు రెండు, యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ శిఖాశర్మకు మూడో స్థానం దక్కింది.
 
-    ఐక్యరాజ్యసమితి దక్షిణాసియా మహిళా విభాగం గుడ్‌విల్ అంబాసిడర్‌గా భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా, బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ నియమితులయ్యారు.
 
-    సీబీఐ కొత్త డెరైక్టర్‌గా అనిల్ కుమార్ సిన్హా డిసెంబరు 3న బాధ్యతలు చేపట్టారు.
 
-    మిస్ సుప్రనేషనల్ -2014 కిరీటాన్ని భారత యువతి ఆశాభట్ గెలుచుకున్నారు.
 
-    మిస్ వరల్డ్-2014 కిరీటాన్ని మిస్ దక్షిణాఫ్రికా రోలిన్ స్ట్రాస్ దక్కించుకుంది. .
 
-    జపాన్ ప్రధానిగా షింజో అబే, మారిషస్ ప్రధానిగా అనిరుధ్ జగన్నాథ్ ఎన్నికయ్యారు.
 
-    కేరళకు చెందిన ఫాదర్ కురియకోస్ ఇలియాస్ ఛవారా (1805-71), సిస్టర్ యూఫ్రేసియా (1877- 1952)లు సెయింట్‌హుడ్ పొందారు. వీరిని మహిమాన్వితులుగా, బాధితులకు సాంత్వన కలిగించే ఆరాధ్యదైవాలుగా పోప్ ప్రకటించారు.
 
-    భారత్‌కు అమెరికా రాయబారిగా భారత సంతతికి చెందిన రిచర్డ్ రాహుల్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు.
 
-    రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) అధిపతిగా రాజిందర్ ఖన్నా, సీఆర్‌పీఎఫ్ డెరైక్టర్ జనరల్‌గా ప్రకాశ్‌మిశ్రాను కేంద్రం డిసెంబర్ 19న నియమించింది.
 
-    ఇస్రో చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్‌కు ప్రముఖ అంత ర్జాతీయ సైన్స్ పత్రిక నేచర్ 2014 ఏడాదికి టాప్-10 శాస్త్రవేత్తల్లో స్థానం లభించింది.
 
కొత్త ముఖ్యమంత్రులు
రాష్ట్రం-పేరు: ఉత్తరాఖండ్-హరీష్ రావత్; బీహార్- జీతన్‌రాం మాంఝీ; ఒడిశా-నవీన్ పట్నాయక్; గుజరాత్-ఆనందీబెన్ పటేల్; సిక్కిం-పవన్ కుమార్
 చామ్లింగ్; నాగాలాండ్-టీఆర్ జెలియాంగ్; తమిళనాడు-పన్నీర్ సెల్వం; హర్యానా-మనోహర్‌లాల్ ఖట్టర్; మహారాష్ట్ర-దేవేంద్ర గంగాధర్‌రావ్ ఫడ్నవీస్; గోవా-లక్ష్మీకాంత్ పర్సేకర్; జార్ఖండ్-రఘుబార్ దాస్.
 
నూతన గవర్నర్లు
రాష్ట్రం-పేరు: ఉత్తరప్రదేశ్-రామ్ నాయక్; గుజరాత్ - ఓమ్ ప్రకాశ్ కోహ్లి; పశ్చిమ బెంగాల్-కేసరినాథ్ త్రిపాఠి; చత్తీస్‌గఢ్-బలరాందాస్ టాండన్;
నాగాలాండ్-పద్మనాభ ఆచార్య; హర్యానా-కప్టన్ సింగ్ సోలంకి; మహారాష్ట్ర- సీహెచ్ విద్యాసాగర్ రావు; రాజస్థాన్-కళ్యాణ్ సింగ్; కర్ణాటక-వాజూభాయ్ రూడాభాయ్ వాలా; గోవా-మృదులా సిన్హా; కేరళ-
 జస్టిస్ పి. సదాశివం.
 
- పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నర్సింహా రెడ్డి డిసెంబర్ 27న నియమితులయ్యారు.
 
 అవార్డులు  
- కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మ’ పురస్కారాలను జనవరి 25న ప్రకటించింది. వీటిలో రెండు పద్మ విభూషణ్, 24 పద్మ భూషణ్, 101 పద్మశ్రీ ఉన్నాయి. పద్మ విభూషణ్‌కు డాక్టర్ రఘునాథ్ ఎ.మషేల్కర్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్-మహారాష్ట్ర), బి.కె.ఎస్. అయ్యంగార్ (యోగా-మహారాష్ట్ర), తెలుగువారిలో పద్మ భూషణ్‌ను దివంగత అనుమోలు రామకృష్ణ (సైన్స్, ఇంజనీరింగ్), పుల్లెల గోపీచంద్ (క్రీడలు- బ్యాడ్మింటన్) అందుకున్నారు.
 
 - 86వ ఆస్కార్ అవార్డుల వివరాలు.. గ్రావిటీ చిత్రానికి ఏడు అవార్డులు దక్కాయి. ఉత్తమ చిత్రం: 12 ఇయర్‌‌స ఎ స్లేవ్, ఉత్తమ విదేశీ భాషా చిత్రం: ద గ్రేట్ బ్యూటీ (ఇటలీ)
 
-    2013 గాంధీ శాంతి బహుమతికిప్రముఖ గాంధేయ వాది, పర్యావరణ వేత్త చాందీ ప్రసాద్ భట్ ఎంపికయ్యారు. చిప్కో ఉద్యమ నిర్మాతల్లో చాందీ ఒకరు.
 
-    ప్రముఖ కవి, సినీ గేయ రచయిత, దర్శక, నిర్మాత గుల్జార్‌ను ప్రతిష్ఠాత్మక 45వ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. గుల్జార్ అసలుపేరు సంపూరణ్ సింగ్ కల్రా.
 
-    భారత సంతతికి చెందిన విజయ్ శేషాద్రికి 2014 పులిట్జర్ అవార్డు వరించింది.
 
-    ప్రతిష్ఠాత్మక జ్ఞాన్‌పీఠ్ పురస్కారం-2013 (49వది) ప్రముఖ హిందీ కవి కేదార్‌నాథ్ సింగ్‌కు ప్రకటించారు.
 
-    భారత సంతతికి చెందిన మంజుల్ భార్గవకు గణిత శాస్త్రంలో నోబెల్ గా భావించే ఫీల్డ్స్ మెడల్ లభించింది.
 
-    ఉత్తమ పార్లమెంటేరియన్ల వివరాలు.. 2010-అరుణ్ జైట్లీ (బీజేపీ); 2011-కరణ్‌సింగ్ (కాంగ్రెస్); 2012-శరద్ యాదవ్ (జేడీయూ);
 
-    జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులను హతమార్చి, అమరుడైన ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్‌కు అశోక చక్రను కేంద్రం ప్రకటించింది.
 
-    టాటా వ్యవస్థాపకుడు జెంషెడ్‌జీ టాటాకు చెందిన ముంబైలోని ఎస్‌ప్లాండే హౌస్‌కు యునెస్కో ఆసియా-పసిఫిక్ వారసత్వ అవార్డు లభించింది. మహారాష్ట్ర కిన్హాల్ గ్రామం సతారాలోని శ్రీ సఖరగద్ నివాసిని దేవి దేవాలయ ప్రాంగణం కూడా ఈ అవార్డుకు ఎంపికైంది.
 
 నోబెల్ బహుమతులు
-    వైద్యం: బ్రిటన్ అమెరికన్ జాన్ ఓ కీఫ్, నార్వే జంట, ఎడ్వర్డ్ మోసర్, మేబ్రిట్ మోసర్. ఫిజిక్స్: జపాన్‌కు చెందిన ఇసాము అకసాకి, హిరోషి అమానో, జపాన్‌లో పుట్టి అమెరికాలో స్థిరపడిన సుజి నకమురాలు. రసాయన శాస్త్రం: అమెరికా శాస్త్రవేత్తలు ఎరిక్ బెట్జిగ్, విలియం మోర్నర్ , జర్మన్‌కు చెందిన స్టీఫెన్ హెల్. ఆర్థిక శాస్త్రం: ఫ్రాన్స్ ఆర్థిక వేత్త జీన్ టిరోల్. సాహిత్యం: పాట్రిక్ మోడియానో(ఫ్రాన్స్). శాంతి: కైలాశ్ సత్యార్థి (భారత్), మలాలా యూసుఫ్ జాయ్ (పాకిస్థాన్)లు సంయుక్తంగా ఎంపికయ్యారు.
 
-    మ్యాన్ బుకర్ ప్రైజ్ -2014 ఆస్ట్రేలియా రచయిత రిచర్డ్ ప్లనగన్‌ను వరించింది.
 
-    జమ్మూకాశ్మీర్‌కు చెందిన మహిళా పోలీసు శక్తిదేవికి ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా శాంతి పరిరక్షకురాలు-2014 అవార్డు లభించింది.
 
-    మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జపాన్ జాతీయ పురస్కారం ది గ్రాండ్ కార్డన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ పౌలోనియా ఫ్లవర్స్‌కు ఎంపికయ్యారు.
 
-    ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతి-2014కు ఇస్రో ఎంపికైంది.
 
-    భారత-అమెరికన్ నేహాగుప్తాకు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పిల్లల శాంతి బహుమతి-2014 లభించింది.
 
-    అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం-2014ను బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు డిసెంబరు 27న అందించారు.
 
-   ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ (84) చెన్నైలో డిసెంబరు 23న మరణించారు. తెలుగు, కన్నడ, హిందీ భాష ల్లో 101 చిత్రాలకు దర్శకత్వం వహించారు.
 
-    స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ విద్యావేత్త మదన్‌మోహన్ మాలవీయ (మరణానంతరం), మాజీ ప్రధానమంత్రి అటల్ బీహరీ వాజ్‌పేయిలకు ప్రభుత్వం డిసెంబరు 25న దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది.
 -    మదన్ మోహన్ మాలవీయ: లీడర్ అనే ఆంగ్ల పత్రికను, మరియాద అనే హిందీ వార పత్రికను ప్రారంభించారు. బెనారస్ హిందూ విశ్వ విద్యాలయాన్ని స్థాపించారు. 1931లో రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. 1946 నవంబరు 12న మరణించారు.
 -    అటల్ బీహారి వాజ్‌పేయి: పదో భారత ప్రధాని. 1996లో 13 రోజులు, 1998-1999 మధ్య 13 నెలలు, 1999-2004 వరకు పూర్తి కాలం ప్రధానమంత్రిగా పనిచేశారు. 1980లో షెకావత్, ఎల్‌కే అద్వానీతో కలిసి భారతీయ జనతా పార్టీని స్థాపించారు. ఆయన గొప్పవక్త, కవి. భారత రత్న పొందిన ఏడో ప్రధాని వాజ్‌పేయి. 1998 మేలో రెండో అణు పరీక్ష, 1999 కార్గిల్ విజయం ఆయన హయాంలోనే చోటు చేసుకున్నాయి.
 
 ప్రపంచంలోనే ఎత్తై ఎవరెస్ట్
 శిఖరాన్ని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలైన బాలికగా నిజామాబాద్ జిల్లా తాడ్వాయి గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థిని మాలావత్ పూర్ణ (13) ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మరో తెలుగు విద్యార్థి ఆనంద్‌కుమార్ ఎవరెస్ట్‌ను ఎక్కిన అత్యంత పిన్న వయస్కుడి (17)గా ఘనతను సాధించాడు.   ‘మైక్రోసాఫ్ట్’ సీఈఓగా సత్య నాదెళ్ల ఫిబ్రవరి 4న నియమితులయ్యారు. ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ నోకియా ముఖ్య కార్య నిర్వహణ అధికారిగా భారత్‌కు చెందిన రాజీవ్ సూరి ఎంపికయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement