బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులైన మదన్ మోహన్ మాలవీయ ఆ బృహత్ కర్తవ్యంలో ఉండగా ఎన్నో సమస్యలు చుట్ట్టు ముట్టాయి.
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులైన మదన్ మోహన్ మాలవీయ ఆ బృహత్ కర్తవ్యంలో ఉండగా ఎన్నో సమస్యలు చుట్ట్టు ముట్టాయి. ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిం ది. దేశభక్తి నిండిన ఆయన విద్యావ్యాప్తికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిన ద్రష్ట. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలనే ఆయన దృఢనిశ్చయం సడలలేదు. ఊరూరూ తిరిగి, ఎందరినో కలసి విరాళాలు పోగుచేశారు.
ఆ సందర్భం గా హైదరాబాద్ నిజాం నవాబును కూడా కలసి విరా ళం అడిగారు. దానికి నిజాం నవాబు... ‘‘ఎంత ధైర్యం హిందూ విశ్వ విద్యాలయం స్థాపన కోసం నన్నే విరాళం అడుగుతావా?’’ అని ఆగ్రహించి, తన కాలి చెప్పుని తీసి ఆయనపైకి విసిరాడు. మాలవీయగారు మారు మాట్లాడకుండా ఆ చెప్పుని తీసుకుని బజారులో వేలం వెయ్యడం మొదలుపెట్టారట. నవాబుగారి చెప్పు అని చాలామంది పోటీపడి వేలం పాడసాగారట. ఇది తెలిసి నవాబుగారు ‘‘ఎవరైనా నా చెప్పుని తక్కువ ధరకు కొంటే ఎంత అవ మానం’’ అని భటులని పంపి పెద్ద మొత్తానికి తానే వేలంలో కొనుక్కు న్నారట. ఏ పరిస్థితిని అయినా అవకాశంగా మలచుకున్నవారే గొప్ప నేతలు. మాలవీయకు భారతరత్న గుర్తింపు సమంజసం.
- తలారి సుధాకర్ కోహెడ, కరీంనగర్