మాలవ్యా జీవిత విశేషాలు
స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త పండిట్ మదన్ మోహన్ మాలవ్యాకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. వారణాసిలో బెనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్యూ) ని స్థాపించారు. అలాగే భారత జాతీయ కాంగ్రెస్కు నాలుగు సార్లు అధ్యక్షుడిగా పని చేశారు. దేశంలోని పలు పత్రికలకు ఎడిటర్గా కూడా వ్యవహరించారు. మరణాంతరం మదన్ మోహన్ మాలవ్యా ఈ పురస్కారం అందుకుంటున్న 11 వ వ్యక్తి. 2014, డిసెంబర్ 25న మాలవ్యా 153వ జయంతిని ప్రభుత్వం నిర్వహించనుంది.
మాలవ్యా జీవన ప్రస్థానం:
1861 డిసెంబర్ 25న ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో జన్మించారు
మాలవ్యా తల్లిదండ్రులు బ్రిజ్నాథ్, మూనాదేవిలు
కలకత్తా యూనివర్శిటీ నుంచి బీఏ పట్టా అందుకున్నారు.
అలహాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పని చేశారు.
ఆ తర్వాత అలహాబాద్ కోర్టు, హైకోర్టులో న్యాయమూర్తిగా గుర్తింపు పొందారు.
చౌరీచౌరా అల్లర్ల కేసులో ఉరి శిక్ష పడిన నిందితుల తరపున మాలవ్యా వాదించి... దాదాపు 150 మందిని నిర్ధోషులుగా విడుదల చేయించారు.
1878లో మీర్జాపూర్కు చెందిన కుందన్ దేవిని వివాహం చేసుకున్నారు. మాలవ్యా, కుందన్ దేవి దంపతులకు అయిదుగురు కుమార్తెలు, అయిదుగురు కుమారులు ఉన్నారు.
1886లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభం
1887లో నేషనలిస్ట్ వీక్లీ సంపాదకుడిగా నియమితులయ్యారు.
1907లో అభ్యుదయ వేదిక, మరియాద హిందీ వార పత్రికలను స్థాపించారు
1916లో బనారస్ హిందూ యూనివర్శిటీని స్థాపించారు. 1919 -39 మధ్య ఆ యూనివర్శిటీ వీసీగా వ్యవహారించారు.
1928లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా పోరాడారు.
1924 - 46 మధ్య కాలంలో హిందూస్థాన్ టైమ్స్ ఛైర్మన్గా వ్యవహారించారు.
1941లో గోరక్ష మండల్ను ఏర్పాటు చేశారు.
మకరంద్ కలం పేరిట మాలవ్య పద్యాలు రాశారు. అనేక పత్రికల్లో ప్రచురితమైయ్యాయి.
1946 నవంబర్ 12న మృతి