స్వాతంత్ర్య సమరయోధుడు దివంగత మదన్ మోహన్ మాలవీయకు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న ప్రదానం చేశారు.
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు, బెనారస్ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు దివంగత మదన్ మోహన్ మాలవీయకు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న ప్రదానం చేశారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డును మాలవీయ కుటుంబ సభ్యులకు అందజేశారు.
మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయితో పాటు మాలవీయకు సంయుక్తంగా భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. వృద్దాప్య సమస్యలతో కదలలేని పరిస్థితిలో ఉన్న వాజ్పేయికి.. ఇటీవల రాష్ట్రపతి స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి అందజేశారు.