
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారత రత్న పురస్కారం తీసుకునే అర్హత లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. గతంలో ప్రణబ్ ముఖర్జీపై తమ సంస్థ తరుపున అమెరికాలో క్రిమినల్ కేసు వేశామని చెప్పారు. అమెరికా నుండి వచ్చి ఆయనకు సమన్లు కూడా ఇచ్చారని పేర్కొన్నారు. చాలా క్రిమినల్ కేసులు ఎదుర్కొన్న వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ ప్రణబ్ అని, ఆయన చెప్పింది ఎప్పుడూ చేయలేదని విమర్శించారు. ఇవాళ అత్యంత విచారకరమైన రోజు అని, బ్లాక్ డే అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ప్రణబ్‌కి ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకని భారతరత్న అవార్డు ఇచ్చారో చెప్పాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ సానుభూతి పరుడని ప్రణబ్‌కు అవార్డు ఇచ్చారని ఆరోపించారు. లోక్ సభలో మెజారిటీ ఉంది కదా అని ఎవరికి పడితే వారికి అవార్డు ప్రధానం చేస్తారా అని మండిపడ్డారు. లోక్ సభ స్పీకర్‌గా సేవాలందించిన బాలయోగికి ఎందుకని అవార్డు ఇవ్వలేదన్నారు. బాలయోగి దళితుడిని అవార్డు ఇవ్వలేదా? టీడీపీ కనీసం ఆ దిశగా కృషి చేయలేదని కేఏ పాల్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment