మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి, ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు మదన్ మోహన్ మాలవ్యా..
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి, ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు మదన్ మోహన్ మాలవ్యాకు అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’ అవార్డును కేంద్రప్రభుత్వం ప్రకటించనున్నట్టు తెలిసింది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు జాతీయ మీడియా మంగళవారం రాత్రి తెలియజేసింది.
వాజ్‌పేయి పేరుమీద ఓ వెబ్‌పేజీ: మాజీ ప్రధాని వాజ్‌పేయి ఇంగ్లిష్, హిందీలో చేసిన 300 ప్రసంగాలు, ఆయన జీవిత విశేషాలను తెలియజేసే చిత్రాలతో కేంద్ర ప్రభుత్వ పత్రికా సమాచార విభాగం (పీఐబీ) వెబ్‌పేజీని ప్రారంభించింది. పీఐబీ అధికారిక వెబ్‌సైట్‌లోనే దీన్ని ఏర్పాటు చేశారు.