ఆరు ముస్లిం దేశాలకు అమెరికా కొత్త రూల్స్
ఆరు ముస్లిం దేశాలకు అమెరికా కొత్త రూల్స్
Published Thu, Jun 29 2017 9:07 AM | Last Updated on Tue, Oct 16 2018 5:58 PM
వాషింగ్టన్ : ట్రావెల్ బ్యాన్‌కు అమెరికా అత్యున్నత న్యాయస్థానం ఓకే చెప్పిన అనంతరం ఆరు ముస్లిం దేశాల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వీసా నిబంధనలు తీసుకొచ్చారు. అమెరికాలోని వ్యాపారాలు లేదా కుటుంబాలతో సంబంధమున్న శరణార్థులందర్ని, ముఖ్యంగా ఆ ఆరు ముస్లిం దేశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలు తీసుకొచ్చినట్టు ట్రంప్ కార్యాలయం బుధవారం పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పటికే జారీచేసిన వీసాలు రద్దు చేయబడవని స్టేట్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. కానీ సిరియా, సుడాన్, సోమాలియా, లిబియా, ఇరాన్, యెమెన్ ప్రాంతాల నుంచి అప్లయ్ చేసుకునే కొత్త వీసాదారులకు మాత్రం ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. వారు కచ్చితంగా ఇప్పటికే అమెరికాలో ఉన్న తల్లిదండ్రులతో, పిల్లలతో, భాగస్వామితో, అల్లుడు, కోడలు లేదా ఇతర తోబుట్టువులతో ఉన్న సంబంధాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందని స్టేట్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. అంతేకాక అన్ని దేశాల శరణార్థులకు ఇవి వర్తిస్తాయని, కొన్ని సడలింపులతో వీటిని తీసుకొచ్చినట్టు వెల్లడించింది.
తాతలు, మునిమనవళ్లు, సోదరుడు, సోదరీమణులు, కాబోయే భర్తలు,ఆంటీ, అంకుల్స్, కజిన్స్ వంటి ఇతర కుటుంబ సభ్యుల విషయంలో సన్నిహిత సంబంధాలను పరిగణలోకి తీసుకోమని స్టేట్ డిపార్ట్‌మెంట్ తన గైడ్ లైన్సులో పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికాలోని అన్ని డిపార్ట్‌మెంట్లకు వీటిని పంపించడం జరిగింది. వ్యాపారస్తులకు లేదా నిపుణులకు అమెరికాతో సంబంధాలున్నాయని, వాటన్నింటిన్నీ పరిగణలోకి తీసుకొని ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్టు స్టేట్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. జర్నలిస్టులు, విద్యార్థులు, వర్కర్లు, లెక్చరర్లు సరియైన ఆహ్వానంతో వస్తే, లేదా ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్‌తో అమెరికాను సందర్శించాల్సి వస్తే, ట్రావెల్ బ్యాన్ నుంచి వారిని మినహాయిస్తున్నట్టు వెల్లడించింది. వ్యాపారాలు లేదా నిపుణులకు ఉన్న సంబంధాలను పరిగణలోకి తీసుకొని, వారు ట్రావెల్ బ్యాన్ నుంచి తప్పించుకోవడానికి చట్టబద్ధమైన సంబంధాన్ని అధికారికంగా, డాక్యుమెంట్ రూపంలో నిరూపించుకోవాలని స్టేట్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.
జర్నలిస్టులు, విద్యార్థులు, వర్కర్లు, లెక్చరర్లు సరియైన ఆహ్వానంతో వస్తే, లేదా ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్‌తో అమెరికాను సందర్శించాల్సి వస్తే, ట్రావెల్ బ్యాన్ నుంచి వారిని మినహాయిస్తున్నట్టు వెల్లడించింది. అయితే ఈ మినహాయింపు కావాలని నిబంధనలు తప్పించుకోవాలనుకుని, అమెరికన్ వ్యాపారాలతో లేదా విద్యాసంస్థలతో సంబంధాలు కోరుకునే వారికి వర్తించవని తేల్చిచెప్పింది. డొనాల్డ్ ట్రంప్ గతంలో జారీచేసిన ఆరు ముస్లిం దేశాలపై తాత్కాలిక ట్రావెల్ బ్యాన్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయం కోర్టుల వరకు వెళ్లింది. ట్రంప్ జారీచేసిన ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై కింద కోర్టులు అభ్యంతరం చెప్పగా, సుప్రీంకోర్టు మాత్రం ఓకే చెప్పింది.
Advertisement
Advertisement